• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Monthly Archives: నవంబర్ 2014

kara-8

30 ఆదివారం నవం 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, కాళీపట్నం రామారావు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

jampala chowdari, kalipatnam, nidadavolu malathi

ఈరోజు నిడదవోలు మాలతి, జంపాల చౌదరి గార్ల వ్యాసాలు అందిస్తున్నాను.kara-8

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

తెలుగులో 1910 నాటికి పత్రికలు

29 శనివారం నవం 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

jolipalem mangamma, telugu news papers

1910 నాటికి తెలుగు పత్రికల గురించిన ఈ వ్యాసం ఆసక్తికరంగా ఉంది. జోళిపాలెం మంగమ్మ గారు 2001లో “తెలుగులో అచ్చయిన తొలిపుస్తకాలు” అన్న పుస్తకాన్ని ప్రచురించారు. చాలా ఆసక్తికరమైన పరిశోధనా గ్రంధాలలో ఇది ఒకటి. ఆసక్తిగలవారు తప్పనిసరిగా చదవవలసిన గ్రంధం ఇది. ఇప్పుడు ఈ వ్యాసం అందిస్తున్న సందర్భంగా ఆ గ్రంధం గుర్తు వచ్చింది.

AndhraPatrika ugadi 1910- newspapers

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

kara 90 – 7

28 శుక్రవారం నవం 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, కాళీపట్నం రామారావు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

కారా మాస్టారు

కారా మాస్టారి పై నాలుగు వ్యాసాలు ఈరోజు అందిస్తున్నాను.

ప్రఖ్యాత రచయిత సి.ఎస్. రావు గారి వ్యాసం మొదటిది.

గాజువాకలోని ఆర్.కె. ఆస్పత్రి డాక్టరు గారు కృష్ణమూర్తి, వారి సతీమణి శోభారాణి గార్ల వ్యాసాలు 2,3. ఈ వైద్యులిరువురూ మాస్టారినీ, సీతమ్మగారినీ ప్రాణప్రదంగా చూసుకుంటున్నారు. వారి ఆరోగ్య బాధ్యతలు తీసుకున్నవారు. మంచి సాహిత్య అభిరుచి గలిగినవారు. ఈ వ్యాసాలలో కారా గారిపై, వారి సాహిత్యంపై ఆ దంపతులకు గల మక్కువ తెలుస్తుంది.

4వ వ్యాసం రాసిన వారు నర్రా జగన్మోహనరావు. ఈయన విజయవాడలో సెకండ్ హాండ్ పుస్తకాల వ్యాపారి. మాస్టారి పాతపుస్తకాల వెదుకులాటలో ఎన్నో పుస్తకాలు వీరే సేకరించి ఇచ్చారు. ఒక నిష్కల్మషమైన అభిమానం ఈ వ్యాసంలో గమనించవచ్చు.

kara-7

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

క్రైస్తవ మిషనరీల సేవ 1910

26 బుధవారం నవం 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ 1 వ్యాఖ్య

ట్యాగులు

క్రైస్తవ మిషనరీ

మనిషి భయం నుంచే దైవం అనే భావన పుట్టింది. మానవజాతి తొలినాళ్లలో భౌతికమైనవే దైవాలు. తనకి అపకారం కలిగించరాదనే భావనే తొలి దైవపూజ. తనకి ఉపకారం కలిగించమనే భావన ఆ తర్వాత వచ్చినదయుండాలి. గుంపులు ఏకం కావలసిన పరిస్థితులలో.. ప్రతి గుంపూ తమకి ఏర్పరచుకున్న దైవాలను ఏకం చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. దానినుంచే దేవుళ్లకి దేవుడు లేక అధికారి వంటి భావనలతో(ఇంద్రుడు వంటివి) తొలిమతాలు ఏర్పడ్డాయి. ఇవి నైరూప్య భావనలు(abstract ideas). మానవజాతి ప్రస్థానంలో, ప్రపంచ పరిణామంలో ఈ మతాల పాత్రని పూర్తిగా వ్యతిరేకదృష్టితో చూడటం సాధ్యంకాదు. ఈ తొలిమతాలను ఏర్పడినవి లేదా పరిణమించినవి అనొచ్చు. అవి సమాజ పరిణామంలో సంపన్న లేదా పాలక వర్గాల అవసరాలు తీర్చటానికీ, వారికి అసాధారణ హక్కులను ఇవ్వటానికీ ( రాజే దేముడు) శ్రమపడే వారిని పాలకులకి విధేయులుగా చేయటానికీ పరిమితమై పోయిన దశలో పుట్టినవి మలిమతాలు. (క్రైస్తవం, బౌద్ధం, జైనం, మహమ్మదీయం, కన్ఫ్యూషియనిజమ్, జురాష్ట్రియిజమ్ వంటివి). ఇవి తొలిదశలో.. తొలిమతాలపై ప్రజల తిరుగుబాటు అవసరంతోనే.. ఏర్పరచినవి లేదా స్థాపింపబడినవి. వీటికి సామాన్యజనంలో కల అసాధారణమైన ఫాలోయింగు(ఆదరణ)తో పాలకులు వాటిని స్వీకరించటం గమనించవచ్చు. మతవ్యాప్తి అనే భావన వీరి చర్యల ఫలితమే. మతవ్యాప్తి అన్నపేరిట అధికారవ్యాప్తి దానితో బాటు ఇతర ప్రదేశాలలోని సంపదను కొల్లగొట్టటానికి శక్తీ సమకూరాయి. వ్యాప్తి వెనుకనే మతరక్షణ అన్న భావన పుట్టింది. అది కొల్లగొట్టబడుతున్న ప్రదేశాలను ఏకం చెయ్యటానికి వినియోగపడింది. ఇదంతా మానవజాతి చరిత్ర. మతవ్యాప్తి వెనక ఇలాంటి కారణాలున్నా దానివల్ల జరిగిన అనేక వాంఛనీయ పరిణామాల పట్ల గుడ్డితనం కూడదు. మానవ జ్ఞానవ్యాప్తీ, జడప్రాయమూ మృతప్రాయమూ అయిన సమాజాలలో కదలికా.. వేరే సంస్కృతులతో పోల్చుకునే అవకాశమూ, బలంగా పాతుకుపోయిన సాంప్రదాయక అధికార కేంద్రాల నుంచి వ్యక్తులకి నూతన అధికారా కేంద్రాల రక్షణా వంటివి వాంఛనీయపరిణామాలే గదా.. ఈ నా అవగాహనతో వందేళ్ల క్రితం మన సమాజంలో జరిగిన పరిణామాలను చూస్తే చాలా ఆసక్తికరమైన, చర్చనీయమైన అంశాలు ఈ వ్యాసంలో కనిపించాయి. ముందుకెళ్లే మనిషైనా, సమాజమైనా రాగద్వేష రహితంగా చారిత్రకదృష్టితో గతాన్ని పరిశీలించటం జరుగుతుంది. ఈ వ్యాసం అందించటంలో నా ఉద్దేశ్యం అదే. దీనిని మతదృష్టితో కాక శాస్త్రీయదృష్టితో చదవాలని నా మనవి.

ఆంధ్రపత్రిక ఉగాది సంచికలలో 1910 మొదటిది. దానిలో ఉన్న ఈ వ్యాసంలో ఆసక్తికరమైన అంశాలున్నాయి. AndhraPatrika ugadi 1910 mishanaries

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

kara 90 – 6

26 బుధవారం నవం 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, కాళీపట్నం రామారావు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

అంపశయ్య నవీన్, అబ్బూరి ఛాయాదేవి, కారా మాస్టారు

ఈ రోజు అంపశయ్య నవీన్, అబ్బూరి ఛాయాదేవి గార్ల వ్యాసాలు అందిస్తున్నాను. kara-6

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

kara-5

24 సోమవారం నవం 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, కాళీపట్నం రామారావు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

కారా మాస్టారు, మునిపల్లెరాజు

ఈ పోస్టులో వ్యాసరచయితలు పి.ఆర్.జె. పంతులు( కారా మేనల్లుడు), కాళీపట్నపు పేర్రాజు(కారా తమ్ముని కొడుకు), పుట్రివు రామరాజ్యం(కారా మేనగోడలు) మునిపల్లెరాజు( సుప్రసిద్ద రచయిత)

kara- 5

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

కారా 90- 4

23 ఆదివారం నవం 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, కాళీపట్నం రామారావు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

కారా, కాళీపట్నం రామారావు, కృష్ణాబాయి, వరవరరావు

అనేక కార్యక్రమాల వల్ల, తిరుగుడు వల్ల వ్యాసాలు అందించటం జరగలేదు. మొత్తం పుస్తకం ఒకేమారు ఇవ్వొచ్చుగదా.. అని కొందరి ప్రశ్న. నా అభిప్రాయం ఇలా అయితే కొన్ని వ్యాసాలు అందరూ చదువుతారని. ఈ రోజు క్రిష్ణాబాయి, వరవరరావు, భమిడిపాటి జగన్నాధరావు గార్ల వ్యాసాలు ఈ లంకెలో అందిస్తున్నాను.krishna

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

kara 90- 3

15 శనివారం నవం 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, కాళీపట్నం రామారావు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

కారా మాస్టరు, కేసరి, kalipatnam

ఈరోజు రెండు వ్యాసాలు అందిస్తున్నాను. ఒక వ్యాసం రచయిత కాళీపట్నం సుబ్బారావు. వీరు మాస్టారి తొలి సంతానం. కేసరి పేరుతో కథలు రాస్తారు. దాదాపు 30పైగా కథలు రాసారు. నాకన్న 3 నెలలు చిన్నవారు. డిజిఎన్పీలో పనిచేసి 2008లో పదవీవిరమణ చేసారు.  నాతో బాటు నాకన్న ఎక్కువగా ఈ సావనీర్ తేవటంలో కష్టపడ్డవారు. కథానిలయంలో రెండేళ్లుగా శ్రమదానం చేస్తున్నారు. కధానిలయం ధర్మకర్తల మండలి సభ్యులలో ఒకరు. ప్రసుతం కోశాధకారిగా ఉంటున్నారు. కాళీపట్నంరామారావు వెబ్ సైట్ నిర్వహణ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. (kalipatnamramarao.com). వీరి ప్రధమసంతానం అనుపమ రెండవవ్యాసం రాసారు. ఈ రెండు వ్యాసాల నుంచి కారా మాస్టారి కుటుంబ నిర్వహణ పద్దతి కొంత తెలుస్తుంది. ఆసక్త గలవారు తప్పక చదవదగ్గ  ఈ రెండు వ్యాసాలు ఈ లంకెలో లభిస్తాయి.kesari

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

kara 90-2

13 గురువారం నవం 2014

Posted by వివిన మూర్తి in కాళీపట్నం రామారావు, వివిన రచనలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

kalipatnam, kara

ఈరోజు రెండు వ్యాసాలు అందిస్తున్నాను. గండికోట రఘురామారావు గారు కాళీపట్నం రామారావు గారి వద్ద చదువుకున్న విద్యార్ధి. ఈ 90ఏళ్ల పండగ రూపకర్త. విఖ్యాత చర్మవైద్యనిపుణులు. ఎంతో గౌరవంతో ప్రేమతో ఏనాడో చదువుకున్న మాస్టారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. వారి వ్యాసంలో, ఆనాటి మాస్టారు తన పనిలో చూపిన శ్రద్ధ, గమనించవలసిన అంశం.

రెండవ వ్యాసం ప్రఖ్యాత రచయిత కవనశర్మది. ఆయన మాస్టారి వద్ద చదువుకున్నారు. ఓ కొత్తపద్దతిలో ఈ వ్యాసం రాసారనిపించింది.నా మనసుని కదిలించినవ్యాసాలలో ఇది ఒకటి. gandikota-kavana

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

కారా గారి 90- 1

11 మంగళవారం నవం 2014

Posted by వివిన మూర్తి in కాళీపట్నం రామారావు, వివిన రచనలు

≈ 2 వ్యాఖ్యలు

ట్యాగులు

కారా మాస్టరు, కాళీపట్నం రామారావు, నవతీతరణం, వివినమూర్తి

కాళీపట్నం రామారావు మాస్టారు 90 సంవత్సరాలు నిండి 91లోకి అడుగుపెట్టారు. వారికీ సందర్భంగా ఆయనవద్ద చదువుకున్న విద్యార్ధులు నవతీతరణం పేరుతో ఒక అభినందన కార్యక్రమం నిర్వహించారు. దానికోసం వెలువరించిన అబినందన సంచిక వ్యాసాలు వరసగా అందించాలనుకుంటున్నాను. ఈరోజు నా ముందు మాట తో మెదలుపెడుతున్నాను.వివిన మూర్తి

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: