• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Monthly Archives: ఆగస్ట్ 2013

గిడుగు 150వ జయంతి సప్తాహం చివరి వ్యాసం

27 మంగళవారం ఆగ 2013

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు, వివిన కబుర్లు

≈ 1 వ్యాఖ్య

27-8-2013
గిడుగు వారి 150 జయంతిని పురస్కరించుకుని ఈ నా సప్తాహ కార్యక్రమంలో ఆఖరు వ్యాసం గిడుగు రామ్మూర్తి పంతులుగారు ఆరంభించిన తెలుగు పత్రిక తొలి సంపాదకీయం. మొట్టమొదటి సంచిక సంపాదకీయాలలో పత్రికలు తమ లక్ష్యాలు చెప్పటం, ప్రజల సహాయ సహకారాలు అర్ధించటం ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగు జాతి ఏ పత్రిక పట్లా పక్షపాతం చూపించలేదు. చాలావాటిని మొగ్గలోనే చిదిమేసింది. పత్రికలు పెట్టిన వారి ధనబలం, సంకల్పబలం, ఔదార్యాలతో కొన్ని కొంత ఎక్కువకాలం బ్రతికాయి. సామల రమేష్ బాబు గారి లెక్క ప్రకారం ఇప్పుడు 18 కోట్ల తెలుగు వారున్నారుట. ఇంత జనసంఖ్య వివిధ రాష్ట్రాలలో ఉన్నారుట. బెంగాలీ బాబు ఎక్కడున్నా అమృతబజార్ పత్రిక చదువుతాడనీ, మద్రాసీ హిందూ, మళయాళీలు మనోరమ చదువుతాడనీ అంటుంటారు. అలా కనీసం ఒక పత్రిక ఒక జాతి సంస్కృతిలో భాగమవటం జరిగింది కాని  ఇంత పెద్ద తెలుగు జాతి అలా దేనినీ నిలబెట్టుకోలేదు. వాడుక భాష వ్యాప్తికోసం పుట్టిన ఈ పత్రిక ఓ ఏడాది బ్రతికినట్లుంది. గ్రాంధిక భాషా స్థిరత్వం కోసం పుట్టిన ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక పిఠాపురం రాజావారి చలవ వల్ల దాదాపు 60 ఏళ్లు బ్రతికింది. ఈ ఆసక్తికరమైన అంశం ఆలోచనీయం కదా! ఈ చిన్ని కార్యక్రమాన్ని పూర్తిచేసేలా ప్రోత్సహించిన ఆప్తులు రజనీకాంత్ గారికి కృతజ్ఞతలు.
గిడుగు వారి ఈ వ్యాసం తెలుగులో ఉన్నది ఈ లంకెలో చూడండి.
gidugu editorial

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

గిడుగు జయంతి 6 వ వ్యాసం

26 సోమవారం ఆగ 2013

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు, వివిన కబుర్లు

≈ 2 వ్యాఖ్యలు

ఈ రోజు ఆరవ వ్యాసం ఇస్తున్నాను. 1919 సెప్టెంబరులో గిడుగు వారు తెలుగు అనే మాసపత్రిక ఆరంభించారు. పర్లాకిమిడి నుంచి వేగుచుక్క ప్రింటింగ్ ప్రెస్ బరంపురంలో ముద్రించారు, పర్లాకిమిడి నుంచి ప్రచురించారు. దానిలో prof. S. konow లేఖను ప్రముఖంగా ప్రచురిచారు. వ్యావహారిక తెలుగు పై వారి ఆభిప్రాయాన్ని ఈ లంకెలో గమనించగలరు.TELUGU patrika toli sanchika

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

గిడుగు వారికి విజయపట్టప్రదానం- శ్రీపాద

25 ఆదివారం ఆగ 2013

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు, వివిన కబుర్లు, శ్రీపాద

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

గిడుగు, శ్రీపాద

2013-08-25
రజనీకాంత్ గారి కోసం గిడుగు వారి సప్తాహం కొనసాగిస్తున్నాను. ఈ రోజు గిడుగు వారి కి రాజమండ్రిలో 1934లో జరిగిన సన్మానం గురించి ప్రబుద్ధాంధ్ర ఫిబ్రవరి 1934లో ప్రచురించిన ఈ వ్యాసం చదవండి. ఈ లంకెలో చదివి ఆనందించండి.
sripada on gidugu

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

150ల గిడుగు – ప్రత్యర్ధి జయంతి రామయ్య

24 శనివారం ఆగ 2013

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు, వివిన కబుర్లు

≈ 1 వ్యాఖ్య

ట్యాగులు

jayanthi

24-8-2013
నేను బ్లాగులో గిడుగు వారి 150 వ జయంతి సందర్భంగా అందిస్తున్న రచనల పట్ల ఎవరికీ ఆసక్తి లేదని అర్ధమవుతోంది. నిన్న అట్టాడ అప్పలనాయుడి గారి 60వ పుట్టినరోజు పండగ. మిత్రుల మధ్య గడిపారు వారు నిన్న. ఆ సభ, లేదా కలయిక కోసం విశాఖ వెళ్లటం రాత్రి 12 ప్రాంతాలకు తిరిగి రావటం…. ఈ రోజు కిన్నెర శ్రీదేవి గారు రావటం ఆమెతో కబుర్లలో .. ఇప్పటివరకూ గడిచింది. ఏమైనా సరే అని నాలుగవ నివాళి ఈ రోజు అందిస్తున్నాను. ఇది రాసినది వారి భాషా వివాదంలో ప్రధాన ప్రత్యర్ధి జయంతి రామయ్య పంతులు గారు వారి పత్రిక ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రికలో ప్రచురించినది. దీనిని ఈ లంకెలో చూడండి.gidugu-jayanthi

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

gidugu vari 150 jayanthi – pilaka ganapathisastry

22 గురువారం ఆగ 2013

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు, వివిన కబుర్లు

≈ వ్యాఖ్యానించండి

22-8-2013
150 ఏళ్ల క్రితం జన్మించిన గిడుగు రామమూర్తి పంతులు గారి గురించి పిలకా గణపతిశాస్త్రి గారి నివాళి ఈనాడు మీకు అందిస్తున్నాను. నిన్న అందించిన భమిడిపాటి కామేశ్వరరావుగారి నివాళి చాలా చక్కని వ్యాసం. ఎక్కువమంది దీనిని చదివినట్లు లేదు. హాస్యబ్రహ్మగా పేరుమోసిన ఆయన గిడుగు వారి గురించి రాసిన వ్యాసం అభిరుచి గలవారు చదవవలసినది. ఈనాడు మనం ఎలా రాయటానికైనా బాట వేసిన మహావ్యక్తి గిడుగు వారి గురించి తెలుసుకోటం చాలా ఆవసరం.
గణపతిశాస్త్రి గారి నివాళి ఈ లంకెలో కనగలరు
on gidugu pilaka

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఛాయారాజ్- గిడుగు- భమిడిపాటి

21 బుధవారం ఆగ 2013

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు, వివిన రచనలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

bhamidipati, chayaraj, gidugu

21-08-2013

మార్చివరకూ శ్రీకాకుళంలో ఉన్నాను. ఆ సమయంలోనే ఛాయారాజ్ గారి ఆరోగ్యం గురించి తెలిసింది. వెంటనే వెళ్లి చూదామనుకున్నాను. కాని ఇక్కడ స్వయంగా తిరిగే .. ఏ పదం వాడాలి.. అదేదో అలవాటు చేసుకోలేదు. మిత్రుల మీద ఆధారపడటం. దానితో అవలేదు. వచ్చాక దాసరి రామన్న సహకారంతో వెళ్లి చూడగలిగాను. అప్పుడు నాకు కలిగిన ఆలోచనలు రాసుకోవాలని .. ప్రయత్నం. ఎన్ని రాయగలనో ఎన్ని దాచేస్తానో.. ఎందుకు రాసుకోటం అంటే వంద కారణాలు హాయిగా చెప్పగలం.. ఎందుకు దాచటం అంటే ఏం చెప్పినా ఏదో కొంత ఆసత్యమో, అసత్య భ్రమో తప్పదు గదా.. డైరీల్లోనూ, కారా మాస్టారికి 85 నుంచి రాసిన లేఖల్లోనూ నా ప్రేమ, కోపం, ఆలోచన, ఆవేశం, అసహనం నా ఇష్టం వచ్చినట్లు కక్కేవాడిని. సమాజం గురించి, దానలో నావంతు- నా శక్తికి అనువైనదనిపించిన- సాహిత్యం గురించి, గతం గురించిన విశ్లేషణ, వర్తమాన విషయాలు, భవిష్యత్తు నమూనా ఏవేవో.. ఇప్పుడూ డైరీలను ఆశ్రయించవచ్చు. బ్లాగులు డైరీలలా ఉపయోగపడతాయా.. పడవు. సాధ్యం కాదు. అవి కూడా లోకం కోసమే. బహుశా ఒక చిన్ని లోకం అవొచ్చు. సంపాదకుడు అనే ద్వారం మాత్రం ఉండదు. కాని వివేచన, స్వయం నియంత్రణ అనేవి ఉండనే ఉంటాయి.

పోతే- ఛాయారాజ్ గారిని చూసి వచ్చాక, నాకు కలిగిన ఆలోచనలు అనేకం. 68-69ల నుంచి నా జీవితంలో ప్రధాన భాగమైన కమ్యూనిజం, 70ల నుంచి మొదలైన కమ్యూనిస్టులనబడే వ్యక్తుల పరిచయాలు, ప్రపంచ కమ్యూనిజంకీ, జాతీయ పరిస్థితులకీ మధ్య నలిగిన భారతీయ కమ్యూనిజం, తెలుగు ఆలోచనా సమాజంలో సాహిత్యంపై గల భావాలు, వాటిలో కొంతకాలం  ప్రధాన స్రవంతిగా ఉన్న కమ్యూనిస్టు ప్రభావిత సాహిత్యం, దానిలోని ఎగుడు దిగుడులు, ఒక insider నీ కాని outsider నీ కాని నా ఆవేదన, ఆలోచనలు, అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఒక క్రమంలో ఉంచాలి. చాలా శ్రద్ధగా మిత్రుని స్వరంతో చెప్పాలి. ఛాయారాజ్ గారిని చూసి వచ్చాక నాలో కలిగిన జీవనోత్సాహానికి  కార్యరూపం ఇవ్వాలి.

అప్పటి వరకూ ఈ ఆలోచనలు, ఉద్వేగం, నేనూ బ్రతికి ఉంటే ఇవి ఆలోచనాపరులు, సమాజ హితాన్ని ఆశించేవారు తెలుసుకోవలసినవే గనక తప్పక రాస్తాను.

అందాకా- ద్వితీయ విఘ్నం కూడదని గిడుగు వారి పై భమిడిపాటి కామేశ్వరరావు గారి నివాళి నా బ్లాగు మిత్రులకు ఈ లంకెలో అందిస్తున్నాను.

gidugu bhamidipati

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

నా స్థితి – గిడుగు జయంతి

20 మంగళవారం ఆగ 2013

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు, వివిన రచనలు

≈ 2 వ్యాఖ్యలు

ట్యాగులు

gidugu, thirupathivenkata kavulu

20-8-2013
రాత్రిళ్లు రాసుకోటానికి బాగుంటుంది. సత్యం తలపు తడుతున్నట్లుంటుంది. నిజంగానే ఈ బ్లాగు మీద, ఎఫ్బీ మీదా మనసు కొంత ఎడమయింది. మొదటి దెబ్బ యాజి గారి కథ మీద నేను కదిలి, దాని గురించి కొంత చురుకు ప్రదర్శించాను. దాన్ని దుడుకు అని ఒక సహ ఆలోచనాపరురాలు భావించారు. నాకు కోపం రాలేదు కాని, బాధ కలిగింది. దీనికి ఉన్న అప్రకటిత సామాజిక నియమాలు(etiquette) నాకు అవగతం కాలేదు అనుకున్నాను కొంతకాలం. పల్లెటూరి వాళ్లకూ, అంతగా విద్యార్హత లేని వారికీ సహజంగా ఉండే ముడుచుకుపోయే గుణం 28 ఏళ్లుగా బెంగళూరులో ఉన్నా నాకు పోలేదు. తగని చోట తలదూర్చ రాదనిపించింది. అది కొన్నాళ్లు.
వ్యాసాలలో నా భాష గురించి, అందరూ వాడే పదాలను ఎక్కువగా వినియోగించుకోకపోటం గురించి ఒక మిత్రుడు నాతో మాటలాడాడు. దానివలన నా వ్యక్తీకరణలో బిగుసుకుపోటం కనిపిస్తుందని ఆయన పరిశీలన. నేను తీసుకునే విషయంలోని క్లిష్టత వల్ల, నేను అర్ధం చేసుకునీ పద్దతిలోని మౌలికత వల్ల అది అలా జరుగుతున్నదా లేక సామర్ధ్యలోపం వల్లనా అని ప్రశ్నించుకున్నాను. అసలు ఆయన అన్నది నీవు పట్టించుకోవద్దు, ప్రతి వారికీ వారికి సహజమైన ఒక పద్దతి ఉంటుంది- అన్నారు కారా మాస్టారు ఒకమారు. అదంతా నా మనసులో ఉందనుకుంటాను.. కొంత హాస్యంగా బ్లాగులో రాయటం ఆరంభించాను. ఇది కూడా ఒక వ్యూహంతోనే చేసాను. ఈ సామాజిక నెట్టువర్కులని అర్ధం చేసుకోవాలని, ఆరునెలలు ఒక అవధి అని నా మనసులో ఉంది. మనిషికి తనను ప్రదర్శించుకోవాలనేది ఒక ప్రేరణ. లోతుగా పరిశీలిస్తే అది ఒక సామాజిక చోదకశక్తిగా నేను చాలాకాలంగా ఒక అవగాహనకి వచ్చాను. ఆ అవగాహన నన్ను నా నియమాలనుంచి విడుదల ఇవ్వలేదు గాని, తోటి మానవులను మరింత ఆకళింపు చేసుకోటానికి నాకు ఉపయుక్తమయింది. అయితే విపరీత ప్రదర్శన నన్ను నిరాశ పరిచింది. తెలిసిన వారి పట్ల లోకానికి వారు అలా ఉండరన్న ఓ ఊహ ఉంటుంది. బహుశా నాలో ఉండే ఆ ఊహ ఊహేనని అనిపించింది. అది కొన్నాళ్లు.
కథానిలయం పని రోజురోజుకీ ఎక్కువవుతోంది. అందులో దిగేనాడు రిటైరయిన మూడేళ్లు అనుకున్నాను. ఆరేళ్లు ముగిసాయి. శారీరకంగా అంతో ఇంతో సత్తువ ఉండగానే నేను ప్లాన్ చేసుకున్న 3 నవలలు పూర్తి చెయ్యాలని గట్టిగా అనుకుంటాను. మూడూ ఆరంభించి ఇరవై ఏళ్లు. వాటికోసం చదివిన పుస్తకాలు, రాసుకున్ననోట్సులు బెంగళూరుకీ, ఇక్కడికీ తిరగటంలో తిప్పటంలో పోతాయేమోనని అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలు చేతికి అందగానే పెద్దపెద్ద పరిశోధనలలా వాటిని ప్రకటించటం మనలో హెచ్చు. ఒకప్పుడు మన భారతీయ తాత్వికత వల్ల తను చేస్తున్నదాని పట్ల వ్యక్తికి కొంత detachment ఉండటమూ, ఆ కారణంగా జనానికి వారి పట్ల attachment ఏర్పడటమూ జరిగింది. అది మన జాతి స్వభావమైపోయింది. అది లేని వారు అల్పవిషయాలకే సంతుష్టులయారు. ఉన్నవారు నిర్లిప్తులయారు. ప్రాశ్యాత్యులలో లోతులు చూడాలన్న జిజ్ఞాసతో పోలిస్తే మనం ఆ విషయకంగా చాలా నేర్చుకోవలసింది ఉంది. ఇలాంటి ఆలోచనల వల్ల నేను రాసేవన్నీ చాలాకాలం పడుతుంటాయి. ఒక విషయానికి చెలామణీ కొన్నాళ్లే ఉంచటం వార్తా, పత్రికా మాధ్యమాల అలవాటు. జనం జ్ఞాపకశక్తి కన్న మన ఫోర్త్ ఎస్టేట్ శక్తి పలచన. అందువల్ల చెలామణీ అయిపోయాకగాని నా రాత ముగియకపోటం అపుడపుడు జరుగుతోంది.
చివరగా- ఆగస్టు 29 గిడుగు వారి 150 వజయంతి. ఈ సందర్భంగా గిడుగు వారి మీద రాసినవీ, వారు తమ స్వంత పత్రిక తెనుగులో రాసినవీ కొన్ని బ్లాగు ద్వారా ఒక వారం అందించాలని ఆలోచన. గిడుగు వారి వ్యావహారిక భాషావాదానికి వ్యతిరేకులైన చెళ్లిపిళ్ల వెంకటశాస్త్రి గారు రాసిన నివాళి ఈ క్రింది లంకెలో చదవగలరు. ఒకనాడు భావజాలంలో విరోధులైనా ఒకరి కృషిపై మరొకరికి గల గౌరవం గమనించగలరు. ఈనాడు మనం వారినుంచి నేర్వవలసింది ఎంతో ఉందని నేను అనుకుంటున్నాను.
gidugu-chellapilla

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

అద్దెకు నోరు

13 మంగళవారం ఆగ 2013

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

కొంతకాలమయింది గదా.. పని.. పని.. కథానిలయం.. ఈ చిన్న టుమ్రీతో ప్రస్తుతానికి సరిపెట్టుకోండి..

1926 నాటి కృష్ణాపత్రికలో ఎన్నికల సందర్భంగా వచ్చిన తమాషా వ్యాసం..
addeku

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

1937లో వర్ణ వ్యవస్థ

04 ఆదివారం ఆగ 2013

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు

≈ వ్యాఖ్యానించండి

4-8-2013

చిత్రగుప్త 1937 జనవరి సంచికలో ఈరోజు లభించింది ఈ వర్ణాలు అనే వ్యాసం. వర్ణ వ్యవస్థ గురించి ఇందులో వ్యక్తమైన అభిప్రాయంపై ఈనాటి ఆలోచనాపరులు ఏమంటారు? ఈ లంకెలో ఆ వ్యాసం చూడగలరు.

CHITRA_GUPTA_1937_01 varnalu

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

1912 లో తెలుగువాడు కోరుకున్న గ్రంధములు

01 గురువారం ఆగ 2013

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు

≈ వ్యాఖ్యానించండి

1912 నాటికి మన పూర్వులు ఎలాంటి పుస్తకాలు తెలుగులో రావాలని కోరుకున్నారు? అసక్తి దాయకమైన ఈ వ్యాసం భరతమాత పత్రిక 1912లో ప్రచురించారు. ఈ లంకెలో చూడగలరు.
SRI_BHARATHAMATHA_1912_04_03_Volume_No_4_Issue_No_1

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: