• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Monthly Archives: మార్చి 2018

మంజీర కథల శేషం

28 బుధవారం మార్చి 2018

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ 2 వ్యాఖ్యలు

శారీరక అస్వస్థతవల్ల అనుకున్న విధంగా మిగిలిన కథలు అందించటం ఆలశ్యమయింది. ఈకథ చదవండి. http://kathanilayam.com/story/pdf/19306

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

మంజీర కథ 4 పెద్దమనిషి.

15 గురువారం మార్చి 2018

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

1958 నవంబరు సంచికలోని పెద్దమనిషి కథ ఈ లంకెలో అందిస్తున్నాను. Peddamanoshi_Manjeera_Bharati Monthly_1958_11_01

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

మంజీర కథలు 3

14 బుధవారం మార్చి 2018

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

మూడవ కథ పెద్దమనిషి ఇవ్వాలి నిన్న. నావద్ద ఉన్న పత్రికలో కొన్ని పుటలు లేవు. పూర్తికథ వెతికి ఆఖరున టపాలో పెడతాను. ఈ రోజు సంఘటన అనే కథ ఆంధ్రపత్రిక 3-6-59 సంచికలోది కథానిలయం వెబ్సైటు నుంచి లంకె ఇస్తున్నాను.http://kathanilayam.com/story/pdf/19439

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

మంజీర కథలు

12 సోమవారం మార్చి 2018

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

మంజీర కథలు 16 జూలై 1958న ప్రచురితమవటం మొదలయింది. ఆగస్టు 1959 భారతిలో స్వరజతి అనేకథ ప్రచురితం. ఈ ఒక్క సంవత్సరంలో 8 కథలు రాసిన మంజీర తరవాత ఇంచుమించు పదేళ్ల వరకూ రాయలేదు. ఆన్నీ కలిపి 12 కథలు వారివి. ఈ రోజు వారి రెండవ కథ మొక్కుబడి ఈ లంకెలో చదవగలరు.BHARATHI_1958_08_01_మంజీర మొక్కుబడి

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

మంజీరతో నా సంబంధం వారి కథలు 1

11 ఆదివారం మార్చి 2018

Posted by వివిన మూర్తి in ఇతరుల కథలు, వివిన కబుర్లు

≈ వ్యాఖ్యానించండి

మంజీర కలంపేరుతో 1958-59లలో భారతి, ఆంధ్రపత్రికలలో పది కథలు రాసారు ఎమ్జీ రావు అనే ఆయన. వీరి పూర్తిపేరు మంచికంటి గున్నారావు. వీరు మధ్యప్రదేశ్ నైన్పూర్లో రైల్వేలో పనిచేస్తుండే కాలంలో పురాణం సుబ్రహ్మణ్యశర్మ వీరికి మిత్రుడు. వీరితో మూడవ మిత్రుడు ఆర్.ఎమ్. రావు గారు. మృత్యంజయరావు గారని గుర్తు. పురాణం తమ ముగ్గురి మీద ఒక నవల రాసారు. వీరు అక్కడ నుంచి జ్వాల అనే పేరిట ఓ కథాసంకలనం 1956లో తీసుకువచ్చారు. 1926లో పుట్టిన గున్నారావు గారు రెండురోజుల క్రితం 92వ ఏట మరణించారు. వీరు మా నాన్నగారికి మేనమామ కొడుకు. 1967లో ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాదు చేరినపుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. ఉద్యోగం రాలేదు గాని నా జీవితంలోకి కమ్యూనిజం వచ్చింది. 65లో రైల్వే జనరల్ స్ట్రైక్ జరిగినపుడు మంజీర కమ్యటనిస్టుగా ట్రేడ్ యూనియన్ కార్యకలాపంలో జైలులో ఉంచారని గుర్తు. శిక్షగా గార్డు నుంచి క్లర్కుగా డిప్రమోట్ చేసారు. వారి ద్వారానే నాకు కమ్యూనిజంతో పరిచయం జరిగింది. మొదటి సంవత్సరం వరకూ కమ్యూనిజం అనేది ఒక ప్రకృతి విరుద్ధమైన ఆదర్శంగా ఆయనతో వాదించేవాడిని. భావించేవాడిని. అసమానత అనేది ప్రకృతి సహజమైనదనేవాడిని. తరవాత ఆయన కాపిటల్ గురించి చెప్పి చదవమన్నారు. అయిదువేళ్లూ ఒకటి కావనే వాదన ఆరోజులలో చాలామంది వాడేవారు. క్రమంగా నేను నా వ్యక్తిగత జీవితంలో ఆకలి, నిరుద్యోగం, పేదరికం వల్ల కలిగే అవమానాలు అనుభవించుతూ కమ్యూనిజం వైపు ఆకర్షితుడయాను. పునాది -ఉపరితలం అవగాహన నా బౌద్ధిక జీవితానికి ఈనాటి వరకూ ఆలంబనగా ఉంది. దీనికి తొలి గురువు మంజీర గారు. సమాజ పరివర్తనలో లేదా పెనుమార్పులో సాహిత్యం యెక్క పాత్ర పట్ల చిన్నచూపు నా స్వంతమేగాని వీరికి దానిపట్ల కొంత గురి ఉండేది. ఆంగ్ల సాహిత్యం బాగా చదువుకున్న రావు గారు నవల అనేది ఎలా ఉంటుందో చెప్పాలన్న ఆలోచనతో సుమారు 5వేల పేజీల నవల మహాయానం రాసారు. దానిని ముద్రించాలన్న ఆశ తీరలేదు. కథానవీన్ తరవాత మనసు రాయుడు గారి వంటి వారిద్వారా నా సిగ్గుబిడియాలు విడిచి కొంత ప్రయత్నం చేసాను. ఫలించలేదు. ఎవరినీ ఏనాడూ ఏదీ అభ్యర్థించరాదన్న  వెర్రి నియమం నాది. సాహిత్యమే ఒక పనికిమాలిన వ్యవహారం.. దానికోసం ఆత్మాభిమానం చంపుకోవటంగా అనిపించుతుంది. ఈజాడ్యం నాకు చాలా చిన్నితనంలో పట్టింది. దీనివల్లనే నేనూ నా సాహిత్యం కూడా మహాయానంలాగే తొందరగా కాలగర్భంలో కలిసిపోటం తప్పదు.

పోతే రావుగారు నాచేత చాలా పుస్తకాలు చదివించారు. అందులో కురుగంటి సీతారామయ్య గారి నవ్యాంధ్ర సాహితీవీధులు బాగా గుర్తు.(పేర్లు తప్పు కావచ్చు.) డోస్టోవిస్కీ నేరమూ శిక్ష నా జీవితాన్ని ప్రభావితం చేసిన మొదటి పుస్తకం వారే నాకు ఇచ్చారు. సాంప్రదాయం అలవాటు అనేవాటి సంబంధం గురించి వారి వివరణ నా ఆలోచనలలో కలకాలం నిలిచినది. అలాగే ఫలానీది చదవరాదనేది తప్పు. చదివి నీ అభిప్రాయం నువ్వు ఏర్పరచుకోవాలన్నది వారి నుంచే నేను నేర్చాను. కమ్యూనిస్టులు అలాంటి నిషిధ్దాలు చెయ్యటం వారికి నచ్చేది కాదు. ప్రభుత్వం ఆపని చెయ్యరాదనేవారు తాము ఆపని ఎందుకు చేస్తారనేది వారి ఆలోచన. సెక్సుతో సహా ప్రతిదీ చదివి అభిప్రాయం ఏర్పరచుకోవాలనీ పేరుచూసి నిర్ణయించుకోరాదనీ దానిపై అభిప్రాయం చెప్పరాదనీ  నా 19వ ఏట ఆయన చెప్పిన విషయం నాకు ఇప్పటికీ అనుసరణీయమే. ఆ తర్వాత దరిశ చెంచయ్య గారి నేనూ నా దేశం నన్ను పూర్తిగా తీర్చిదిద్దిన పుస్తకం. ఇది మంజీర గారు ఇవ్వలేదనే గుర్తు. వారితో నేను నా ఫార్మేషన్ దశలో తప్ప ఎక్కువగా గడపింది లేదు. విశాలాంధ్ర వారు వందేళ్ల తెలుగుకథలో వారి కథ చేర్చటం నాకు ఆనందం కలిగించింది. అది నా రికమండేషనా అని ఫోన్ చేసారు. మావయ్య గారూ నాకే సంబంధం లేదు అని చెప్పాను. ఒక్క కూతురు లండన్లో ఉంటోంది. చివరిరోజులలో నర్సమ్మూర్తీ ఓమారు రావోయ్ అని ఆరునెలల క్రితం ఫోన్ చేసారు. వెళ్లలేకపోయాను. పనిగట్టుకుని చెయ్యవలసినవెన్నో చేయలేకపోయాను.  హైదరాబాదు వెళ్లినపుడల్లా విద్యానగర్లో వారింటికి వెళ్లేవాడిని. మనసులో సొదంతా ఈ ఫేస్బుక్కు అనే సంతలో ఉంచుతున్నాను. నా ఫీలింగ్స్ కోసం రేపటి నుంచి ఆయన కథలు నా బ్లాగులో ఉంచుతున్నాను. ఈలంకెను పూర్తిగా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి gotoపై క్లిక్ చేయండి.  http://kathanilayam.com/story/19200

 

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఓటుదండకము

09 శుక్రవారం మార్చి 2018

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

ఆనాటికి మనకింకా స్వతంత్రం రాలేదు. ఆంగ్లేయులు ఓటు హక్కు ఇచ్చారు. దానిగురించి ఆనాటి రాజకీయనాయకుల వెంపర్లాటపై ఈ ఓటు దండకము కృష్ణాపత్రికలో వచ్చింది.  గోలకొండ పత్రికలో 24-5-1934లో దీనిని పునర్ముద్రణ చేసారు. ఓటుని మన రాజకీయనాయకులు “సేకరించుకునే” నైశిత్యం పెంచుకున్నారు కాని ఓటర్లు అనబడే వారు దాని విలువ గుర్తించినట్లు కనపడటం లేదు. వారి నిస్పృహ, ఎవరినీ నమ్మలేని తనం, ఏరాయైతేనేం పళ్లూడగొట్టుకునేందుకనే తెలివీ పెరిగాయి. నానాటికి తీసికట్టవుతున్నది మనమా? మన పాలక వర్గమా? ఈ ప్రశ్న కలిగించిన ఈ రచన ఆసక్తి గలవారి కోసం ఆలోచించగలవారికోసం ఈ లంకెలోpost1

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

1930ల హాస్యకథ సిసింద్రీ పత్రిక

08 గురువారం మార్చి 2018

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

1982లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు హాస్యతోరణము అనే కథాసంకలనం ప్రచురించారు. దానిలో సిసింద్రీ పత్రిక అనే పేరున ఓ కథ ప్రచురించబడింది. దాని రచయిత నందివాడ చిదంబరము. వీరు 1930 అక్టోబరు భారతిలోోో ఈకథ ప్రచురించారు. అంటే సంకలనానికి ముందు 52 ఏళ్లక్రితం రచన. ఈనాటికి 87 సంవత్సరాల ఈ కథ ఈనాటి పాఠకులు ఎలా తీసుకుంటారు? చూడండి ఆకథ ఈ లంకెలోBHARATHI_1930_10_

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: