• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Monthly Archives: ఏప్రిల్ 2022

తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా?

25 సోమవారం ఏప్రి 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ 2 వ్యాఖ్యలు

ఒకప్పుడు ఎన్నెమ్మ కథ పురటాళ్లకి చెప్పేవారు. ఈ కథ మీలో పాతతరాలకి తెలిసే ఉంటుంది. కొత్తవారు సంగతి నేను చెప్పలేను. కాకపోతే.. ఈ కథ మళ్లీ చదివినపుడు కొత్త ప్రశ్నలు కలిగాయి. కులాంతర వివాహం జరిగితే కుక్క ముట్టిన కుండ దోషం అని ఎన్నెమ్మ తీర్మానం చేసుకుంటుంది. దానికి శిక్ష ఏమిటని ఈనాడు మనం ప్రవచనకారులని అడిగినట్టు తండ్రిని అడిగింది. ఆయన దర్భపెట్టి తగలెయ్యమన్నాడు. ఆ పని చేసిందా ఇల్లాలు. తనతో సహా మొగుడినీ, పిల్లలనీ కాల్చి చంపేసింది. ఆవిడ చెయ్యాల్సిందే చేసింది కదా.. మన ప్రవచనకారుల్లాగే మొత్తం విషయం తెలుసుకోకుండా తండ్రి ధర్మాన్ని చెప్పాడు గదా.. ఆ ధర్మమూ, దాన్ని పాటించడమూ సరైనదే కదా.. భగవంతుడు ఆపని చేసినందుకు మెచ్చాలి కదా.. లేదు. ‘నువ్వు నీ పిల్లల్ని మొగుడ్నీ చంపేసావు.  ఎన్నెమ్మగా పుట్టి ఆకలితో బాధపడమంటా’డు. దీన్ని బట్టి దేముడు మంచాడు భూమ్మీద ధర్మం చెడ్డది అని అర్ధం వస్తుంది కదా.. నిజమేనా? ఏం జరిగినా ఎవరు చెప్పినా పిల్లల్ని చంపుకోకూడదని సందేశం ఉంది కదా.. నిజమేనా? అనేక ప్రశ్నలు. వాటిల్లో ఈ రెండు ప్రశ్నలు ముఖ్యం. చదివి మీరేంటంటారు? ఈ కథ చదవి చెప్పండి. 1933 మే భారతిలో ఎన్నెమ్మ కథ ఈ లంకెలో

bharathi_1933_05_01-e0b08ee0b0a8e0b18de0b0a8e0b186e0b0aee0b18de0b0aeDownload

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

బంకుపల్లి మల్లయ్యశాస్త్రి గారి శంకర జగత్తు

22 శుక్రవారం ఏప్రి 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

నన్ను బాగా ఆలోచింపజేసిన భారతీయ తాత్వికులలో శంకరాచార్యులు ఒకరు. ఆయన మీద ఒక నవల రాయాలని ఒక ప్రణాళిక ఉంది. ఒక ఆత్మీయ మిత్రునికి నేను మాట కూడా ఇచ్చాను. గజం మిధ్య పలాయనం మిధ్య అంటూ ఆయన తాత్వికతను పరిహసించటం మనకు తెలిసిన విషయమే. దానిని విబేధిస్తూ బంకుపల్లి మల్లయ్యశాస్త్రి గారు తన వాదన చెప్పిన వ్యాసం ఈ రోజు అందిస్తున్నాను. బంకుపల్లి వారి గురించి లోగడ నేను పెట్టిన ఒక టపా పెట్టాను. అందులో రాసినది తిరిగి ఇక్కడ అతికిస్తున్నాను.

12-07-13
బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారి విగ్రహావిష్కరణ వార్తతోబాటు పత్రికలలో కె. ముత్యంగారి వ్యాసం వచ్చింది. అది చదివి ఆరోజుకి ఆరోజు బెంగళూరునుంచి బయలుదేరి నరసన్నపేట (శ్రీకాకుళం వద్ద) చేరాను. ఇది ఆరేడేళ్ల క్రితం మాట. పర్లాకిమిడి గిడుగు వారు, ఉర్లాం మల్లయ్య శాస్త్రి, మేరంగి సాంఖ్యాయనశర్మ, విజయనగరం గురజాడ వీరంతా సమకాలికులు. వారు తమతమ పరిధులలో ఆధునిక భావాలతో ప్రభావితమై వాటి వ్యాప్తికి ప్రయత్నించారు. గిడుగు భాష, సాంఖ్యాయనశర్మ సైన్సు ప్రచారం, గురజాడ కన్యాశుల్కం, బాల్యవివాహాలు, తెలిసినంతగా మల్లయ్య శాస్త్రి గారి హరిజన( ఒకనాటి ఆ పదం ఈనాటికి తగినది కాదు) ఉద్యమం తెలియదని అనుకుంటున్నాను. చాలా ప్రధానంగా, రహస్యంగా భావించే గాయత్రి మంత్రం రామానుజాచార్యులు అందరికీ తెలియటం కోసం ధ్వజస్తంభమో ఏదో ఎక్కి అందరికీ వెల్లడించినట్టు విన్నాను. అది ఎంతవరకూ వర్ణ, కుల వ్యవస్థలలో మార్పులు తేగలిగిందీ అన్నది ఒకరకం ఆలోచన. తేలేకపోతే ఎందుకు సమూలమైన మార్పులు తేలేకపోయాయి- ఇది అటువంటి ప్రశ్నకి కొనసాగింపు. ఐతే, భారతీయ సమాజంలో దుష్ట సంప్రదాయాల గుర్తింపు, దానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాల –స్పిరిట్- ను పరిశీలించటం మరో ప్రయత్నం. ఆ స్పిరిట్ ఆంగ్లేయుల ఆంగ్ల విద్య ద్వారా మరోమారు ప్రజ్వరిల్లింది. హరిజనులకి గాయత్రి ఉపదేశించి జంధ్యం వేయించిన వారు మల్లయ్యశాస్త్రి గారు. వారి గురించి నేను తెలిసుకొన్న ఈ విషయానికి సంబంధించిన వార్త జమీన్ రైతు పత్రికలో చూసినపుడు ఇది అందరికీ పంచుకోవాలనిపంచింది. ఫేసుబుక్కులో నాబోటి వారి సీరియస్ టపాలు అరణ్యరోదన వంటివే. అయినా వస్తూనే ఉంటాయి. 1921 ఆంధ్రపత్రిక ఉగాది సంచికలోని ‘శంకరమతమున జగత్తు అసత్యమా’ అనే వ్యాస్నాన్ని  ఈ లంకెలో చూడగలరు.

andhrapatrika-ugadi-1921-04-09-e0b0b6e0b082e0b095e0b0b0e0b0bee0b09ae0b0bee0b0b0e0b18de0b0afe0b181e0b0a1e0b181Download

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ప్లేటో వ్యాసుడు అరిస్టాటిల్ పానుగంటి

19 మంగళవారం ఏప్రి 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ 2 వ్యాఖ్యలు

పానుగంటి లక్ష్మీనరసింహరావు గారు అనగానే సాక్షి ఉపన్యాసాలు గుర్తువస్తాయి. ఆయన అనేక నాటకాలు, కథలు రాసారు. ఆయన దివాన్ గా పనిచేసిన లక్ష్మీనరసాపురం దివాణం మా ఊరికి చాలా సమీపంలో ఉంది. మూడేళ్ల క్రితం నేను పనిగట్టుకుని ఆ ఊరు చూడటానికి వెళ్లాను. పానుగంటి వారివద్ద మా ఫాదర్ మాతామహులు గున్నారావు గారు పనిచేసేవారు. తన తాత గారు చెప్పినట్టు మా ఫాదర్ పానుగంటి వారి కథలు చెప్పేవారు. కథానిలయం కథల పోగేతలో పానుగంటి వారి అపూర్వమైన కల్పనా శక్తితో నాకు మరి కొంత పరిచయమయింది. ప్లేటో అరిస్టాటిల్ వాదావివాదాలకు వ్యాసుని మధ్యవర్తిత్వం ఊహిస్తూ రాసిన ఈ రచన ఆేంధ్రపత్రిక 1935 ఉగాది సంచికలో ప్రచురితం. అలాగే వారి కల్పనాశక్తికి సంబంధించిన స్వప్నకావ్యం లోగడ నా బ్లాగ్ లో ఉంచాను. సాహిత్య తత్వం గురించిన చర్చ ఈ వ్యాసంలో సరళంగా వివరించారు. తప్పకుండా చదవదగ్గది. ఈ లంకెలో.. చదవండి.

andhrapatrika-ugadi-1935_04_04-e0b0aae0b18de0b0b2e0b187e0b09fe0b18b-e0b0b5e0b18de0b0afe0b0bee0b0b8e0b181e0b0a1e0b181Download

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

అట్లూరి పిచ్చేశ్వరరావు గారి వసుంధర

05 మంగళవారం ఏప్రి 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

ఈ కథ 1957 ఏప్రిల్ అభ్యుదయలో ప్రచురితం. కథనం ఈ కథ యొక్క ప్రత్యేకత.

కాలేజి గేటు, రోడ్డు వంటివీ, కాలం, పరిస్థితులూ వంటివీ, వ్యక్తులూ, పాత్రలూ ప్రధాన పాత్ర వసుంధర గురించి కథ చెపుతాయి. ఈ టెక్నిక్ తో మరో కథ చదవిన గుర్తు లేదు. మీకోసం ఈ లంకెలో

abudaya-04-1957-picheswararaoDownload

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

రంప పితూరీలు ఎన్ని?

02 శనివారం ఏప్రి 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

రంప పితూరీ అనగానే అల్లూరి సీతారామరాజు మనకి గుర్తు వస్తారు. పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారు మన తరం మరిచిపోయిన గొప్ప ఆలోచనాపరులు. వారి మౌలిక పరిశీలనలు నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. భారతం మీద ఆయన రాసిన వ్యాసాలు తప్పనిసరిగా చదవదగ్గవి. ఆయన ఈ రంప పితూరీలు వ్యాసకర్త. 1936 ఆంద్రపత్రిక ఉగాది సంచికలో ప్రచురితం. దీనిలో చాలా సమాచారం ఉంది. ఆసక్తిపరుల కోసం ఈ లంకెలో

andhrapatrika-ugadi-1936_03_24-rampa-pituriDownload

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: