ట్యాగులు
స్రవంతి 1968 డేసెంబరు సంచికలో వచ్చిన నా ఆత్మీయ మిత్రుడు, ప్రఖ్యాత చిత్రకారుడు చంద్ర ఇంటర్వ్యూ ఇక్కడ అందిస్తున్నాను.SRAVANTHI_1968_12CHANDRA
27 శుక్రవారం ఫిబ్ర 2015
Posted ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు
inట్యాగులు
స్రవంతి 1968 డేసెంబరు సంచికలో వచ్చిన నా ఆత్మీయ మిత్రుడు, ప్రఖ్యాత చిత్రకారుడు చంద్ర ఇంటర్వ్యూ ఇక్కడ అందిస్తున్నాను.SRAVANTHI_1968_12CHANDRA
24 మంగళవారం ఫిబ్ర 2015
Posted పాత పత్రికలు, వివిన కబుర్లు
inట్యాగులు
ఆత్రేయ సినిమా పాటలు అందరికీ తెలుసు. ఆయన నాటకాల ప్రసిధ్ది సాహిత్యజీవులలో చాలామందికి తెలుసు. ఈ పద్యాలను నార్ల చిరంజీవి గారు ఆత్రేయ డైరీల నుంచి ఈ పద్యాలను సేకరించి ప్రచురించానని స్రవంతి 1967 జూలై సంచిక లో తెలియజేసారు. ఈ పద్యాలలో గాలిబ్ గీతాల ఛాయలు కనుపిస్తున్నాయి. దాశరధి గారు అనువదించిన గాలిబ్ గీతాలు తొలి ప్రచురణ మార్చి 1961లో జరిగింది. వాటిని చదవి నేను ఇలాంటి పద్యాలను రాస్తూ ఉండేవాడిని. కాని ఛందోబద్ధ పద్యాలు(వృత్తాలు) రాసినపుడు కలిగే ఆనందం భిన్నంగా ఉండేది. వీటిలో భావం మనసుకి దగ్గరగా అనిపించేది. పురుషుని ప్రేమ – ఒక స్త్రీ పై పురుషుని ప్రత్యేక ఆసక్తి (సులువుగా చెప్పాలంటే)- తనకు మాత్రమే ఆమె పరిమితం కావాలన్న సాంప్రదాయక( నా అప్పటి అవగాహన ప్రకారం) భావనకి మించిందిగా అనిపించేది. అది భావకవిత్వ ప్రభావంలో ఉన్న నాకు దానికన్న భిన్నంగా, మిన్నగా అనిపించింది. పురుషుని భావుక స్వేచ్చ భావకవిత్వంలో కనిపిస్తే (భావుకజీవి మానస విభావరిలో యొక వెల్గు రేఖ ఈ భావనలోని ప్రేమ .. అని రాసాను ఒకనాడు ఓ కావ్యంలో. దాని వెనకనే దానికి భగవంతునిపై భక్తికీ సంబంధం గురించి,అది మనిషికి ఇవ్వగల ఆత్మవిశ్వాసం, తెగింపూ గురించి తార్కిక యోచనా) గాలిబ్ లో స్త్రీకి కావలసిన స్వేచ్ఛపై గౌరవం కనిపించేది. భావకవిత్వంలో స్వేచ్ఛ కనిపించితే గాలిబ్ లో అంతకు మించిన తాత్వికత ఏదో కనిపించేది. 19వ శతాబ్ధపు రొమాంటిక్ కవుల ప్రభావం భావకవుల మీద ఉండటం గురించి విన్నాను గాని, గాలిబ్ ప్రభావం గురించి వినలేదు. తెలిసిన వారు చెపితే తెలుసుకోవాలని ఉంది. ఇవన్నీ ఆరుద్ర గారి ఈ నవముక్తకాలు కంట పడినపుడు మనసులో కదిలేయి. ఆసక్తి గలవారి కోసం అందిస్తున్నాను.Sravanti_1965_07_00_Volume No_12_ATREYA
22 ఆదివారం ఫిబ్ర 2015
Posted ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు
inట్యాగులు
భారతదేశం గర్వించదగ్గ మహారచయిత ప్రేమ్ చంద్. ఆయన కథలెలారాసారో చెప్పే చిన్ని వ్యాసం నవభారతి 1978 జూలై సంచికలో వచ్చింది.
18 బుధవారం ఫిబ్ర 2015
Posted ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు
in1923 ఆగస్టు 24 వతేదీ కృష్ణాపత్రిక సంచికలో ప్రచురింపబడిన ఈ వ్యాసంలో ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. go hatya
12 గురువారం ఫిబ్ర 2015
Posted ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు
inట్యాగులు
గోర్కీ రాసిన వ్యాసానికి అనువాదం నవభారతి పత్రిక 1978 మార్చ్ సంచికలో ప్రచురితం. యువ కథకులకు ఉపయోగపడవచ్చుననీ, సాహిత్యజీవులకు గుర్తు చేద్దామనీ ఈ వ్యాసం అందిస్తున్నాను. GORKI 03-1978
01 ఆదివారం ఫిబ్ర 2015
Posted ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు, వివిన రచనలు
inనేను లోగడ నేరం అనే కథ రాసాను. దానిలో శిక్ష వెనకనున్న భావనల చరిత్ర ఆలోచించాను. శిక్షలో క్రూరత్వం అన్నది మధ్యయుగాలలో ఎక్కువ అని నాకు అనిపిస్తుంది.దానికి కారణంఏమిటి.. చిన్ని సమూహాలలో అంటే గణాలలో, తెగలలో ఒక మనిషికి మరో మనిషితో సంబంధం, సంపర్కం ఉండేది. కనక తమ వాడే అయిన వ్యక్తికి తమవాడే అయిన మరో వ్యక్తి నష్టం కలిగించితే అదే నష్టం సమూహం అంతాకలిసి వాడికి ప్రతీకారంగా కలిగించటం అన్నది తోలి శిక్షారూపం. అందులో వినోదం పాలు తక్కువ. కాని క్రమంగా ప్రభుత కీ, పాలితుడికీ భౌతిక దూరం ఏర్పడ్డాక నేరస్తుడికి వేసే శిక్ష, నేరం యొక్క తీవ్రత ఆధారంగా, ఉండాలనే ఆలోచనా, శిక్షలో ఒక స్థాయీకరణా అన్న భావనా చోటుచేసుకున్నాయి. పర ప్రాంతాలకి వెళ్లి, వాళ్లు వచ్చి సంపర్కం పెరుగుతున్న దశలో పర వ్యక్తులని తమ వ్యక్తులుగా చూడలేని స్థితి వచ్చింది. ఇది మధ్యయుగాలలో పెరిగింది. అప్పుడే శిక్షలో వినోదం చోటుచేసుకుని లేదా దాని పాత్ర పెరగటం జరిగిఉండాలి. ఇది ప్రపంచమంతటా జరిగింది.
కాపోతే-
విజయంలో- బందీలపై జరిగే అమానుష లేదా అనాగరిక క్రూరత్వ ప్రదర్షనలో- వినోదం ఉంది. అది ఈనాడు కూడా తగ్గలేదు. కసి వల్ల కూడా క్రూరత్వం ఉంటుంది. కాని అసహాయంగా దొరికిపోయిన వాడిపట్ల ఎన్ని జెనీవా ఒప్పందాలు చేసుకున్నా ఇరాక్ ఖైదీలపై అమెరికన్ల నిర్భందంలో జరిగిన, జరుగుతున్న అనాగరిక క్రూరత్వం గమనించినపుడు మానవుడు ఈ పాశవిక దశ దాటలేదనే అనిపిస్తుంది. సరే శిక్షలో ఉండే వినోద క్రూరత్వం ఈ వ్యాసంలో గమనించినపుడు ఈ విషయంలో మానవుడికి స్థల కాలలతో నిమిత్తం లేదని అనిపించింది. గోవాలో ప్రసిద్ధ చర్చిలో, అవెన్యూ నగరం చర్చిలో (అని గుర్తు) ఈనాడు మనం మహనీయులుగా భావించేవారి పట్ల జరిగిన శిక్షల చిత్రాలు చూసి వాటికన్న ఒకమారు చంపి పారేసే మరణం ఎంత మంచి శిక్షో లేదా ప్రతీకారమో కదా అనిపించింది. కాఫ్కా పీనల్ కాలనీలో శిక్ష కోసం తయారు చేసిన యంత్రం కథ చదివి రెండు రోజులు మామూలు మనిషిని కాలేకపోయాను. ఈ వ్యాసం చదివినపుడు ఇలాంటి ఎన్నెన్నో విషయాసు, ఆలోచనలూ..ANDHRAJYOTHI_1966_06_05