ట్యాగులు
ఈ వ్యాసం 1927 ఆందధ్రపత్రిక ఉగాది సంచికలో వచ్చింది. రచయిత మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు జగమెరిగిన మనిషి. హిందూ అనేది జాతిపరమైన శబ్దంగానే ఈ వ్యాసంలో వాడారు. మన దేశపు పురాతన వైశిష్ఠ్యాలలో గ్రామ స్వపరిపాలన ఒకటి. దాని స్వయం నిర్భరత మరొకటి. ఈ రెండూ ఎంతవరకూ సాధ్యపడ్డాయి అనేది పరిశీలనార్హం. దానికి భౌగోళిక, పరిసర(climatic) ప్రత్యేకతలు ఎంతవరకూ కారణం అనేది ఒక కోవకి చెందిన ప్రశ్న. ఇక్కడ ఉండే సముదాయాల ఉమ్మడి మనస్తత్వం ఎంతవరకూ కారణం అనేది మరో అంశం. కాకపోతే ఈ వ్యాసం ఆ గ్రామ నిర్మాణం ఎలా ఉండేదో ఆధారాలతో సహా వివరిస్తుంది. వర్తమాన సామాజిక సమస్యలకు.. దానికి కారణమైన సాంఘికనిర్మాణానికీ .. ఈనాడు బాధితులుగా ఉన్నవారు ఈ వ్యాసాన్ని సహనంగా చదవలేకపోవచ్చు కాని అధ్యయనం కుతూహలం కలవారు తప్పని సరిగా పరిశీలించవలసిన వ్యాసం ఇది. గత చరిత్రని తప్పు పట్టవచ్చు కాని మార్చలేం అనేది వాస్తవం. దాన్ని ఘనంగా ప్రశంసించటమూ తీవ్రంగా అభిశంసించటమూ వర్తమానంలో రెండు భిన్న ధోరణులు. రెండూ వాస్తవాల విషయంలో పాక్షికమైనవే. కాని వాస్తవ దృష్టి వర్తమాన సమస్యల పరిష్కారానికి అగత్యం. ఈ వ్యాసం చదవరూ.. దయచేసి..