• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Monthly Archives: జూన్ 2015

1945లో హైదరాబాద్ తెలుగు కథకులు

25 గురువారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ 1 వ్యాఖ్య

ట్యాగులు

తెలంగాణా కథకులు

తెలుగుతల్లి 1945 జనవరి సంచికలో మానేపల్లి తాతాచార్య రాసిన వ్యాసం ఈరోజు ఈలంకెలో చూడగలరు. Telugutalli Jan 1945hyd

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

తెలుగు పత్రికల స్థితిలో 85 ఏళ్లలో మార్పువచ్చిందా?

19 శుక్రవారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ 1 వ్యాఖ్య

ట్యాగులు

తెలుగు పత్రికలు

క్రొవ్విడి లింగరాజు గారి ఈ వ్యాసం చూస్తే కలిగిన ప్రశ్న ఇది. SAMADARSHINI_1930_01_01krovvidi

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

తెలుగు జాతి తొలి ఎన్ సైక్లోపీడియా – పాల్కురికి

18 గురువారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ 1 వ్యాఖ్య

ట్యాగులు

తిమ్మావజ్ఝల కోదండరామయ్య

తిమ్మావజ్ఝల కోదండరామయ్య గారు రాసిన ఈ వ్యాసం పాల్కురికి వారి ప్రతిభని, విశాల ఆలోచనని తెలియబరుస్తుంది. తప్పక చదివి తీరవలసిన వ్యాసం. PARISHODHANA_1955_08_encyclopedia

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

భండారు అచ్చమాంబ- కొమర్రాజు లక్ష్మణరావు

14 ఆదివారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ 1 వ్యాఖ్య

ట్యాగులు

కొమర్రాజు లక్ష్మణరావు, భండారు అచ్చమాంబ

రాయసం వెంకటశివుడు గారు కొమర్రాజు వారి జ్ఞాపకాలతో రాసిన ఈ వ్యాసంలో అచ్చమాంబ గారి గురించి కూడా చాలా విషయాలున్నాయి. ఈ లంకెలో చూడగలరు.Telugutalli Oct 1944 bhandaru

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

మహమ్మద్ ఖాసింఖాన్ – పురిపండా అప్పలస్వామి

12 శుక్రవారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు, వివిన కబుర్లు

≈ 3 వ్యాఖ్యలు

ట్యాగులు

పురిపండా అప్పలస్వామి, మహమ్మద్ ఖాసింఖాన్

నాకు బాగా పరిచయమైన మొదటి సాహిత్యవేత్త పురిపండా అప్పలస్వామి గారు. నా వెనకబెంచీ మనస్తత్వం వల్ల ఎవరితోనూ చొరవగా పరిచయం చేసుకునే అలవాటు లేధు. ఎవరికి ఏం అవసరం వచ్చినా నేను చెయ్యగలిగింది చేసే గుణం వల్ల ఆయనకి చేరువయాను. తూమాటి దోణప్ప గారి హరికథా సర్వస్వము(అని గుర్తు) వ్రాతప్రతి చదివి వినిపించటానికి ప్రతిరోజూ పురిపండా ఇంటికి వెళ్లేవాడిని. ఆయన నాగురించి అడిగినపుడు నా పద్యకవిత్వం, నా కావ్యం కపోతసందేశం వారికి చూపించాను. వస్తువు అభ్యుదయానికి చెందినపుడు దానికి పద్యకవిత్వం నప్పదని ఆయన చెప్పారు. వస్తువుకి తగిన వాహనం ఉండాలన్నారు. వారి హిందీ అనువాదం ఏదో రామలక్ష్మి గారికి కానుకగా ఇచ్చిన గుర్తు.

మా కారాయజ్ఞం ప్రచరించిన తొలి పుస్తకం కథానికారచన. దీనిని రాసినవారు మహమ్మద్ ఖాసింఖాన్. వీరి వ్యాసాలు కొన్ని ఈ ప్రచురణానంతరం నాకు ఎదురయాయి. వీరి ఫొటో కోసం ప్రయత్నించినా లభించలేదు. వీరు రాసిన వ్యాసం కవితావిమర్శనము 1930 సమదర్శని ఉగాది సంచికలో వచ్చింది. దీనిలో తెలుగు కవిత్వ స్వర్ణయుగం ఇంకా ఆరంభం కాలేదంటారు ఖాసింఖాన్. అప్పటికి శ్రీశ్రీ మహాప్రస్థానం కవిత్వం రాలేదు. భావకవిత్వంతో కొంచెం స్వర్ణయుగద్వారాలు తెరవబడినట్లు ఖాన్ రాస్తారు. కవి వ్యక్తిత్వం, కవిత్వంగా విభజించి ఆనాటి కవిత్వ స్థితిని మొత్తంగా చూడటానికి చేసిన ప్రయత్నం నన్ను ఆకట్టుకుంది.

తెలుగు ఆధునిక కవిత్వం తీరుతెన్నుల గురించి అంతగా తెలియని నేను అనరాదేమో గాని నాకు తెలిసి శ్రీశ్రీ మహాప్రస్థానం, శైశవగీతి, కవితాఓకవితా, నగ్నముని కొయ్యగుర్రం తప్ప గొప్ప దీర్ఘకావ్యాలు మనకు తక్కువ.

దీర్ఘకావ్యములు రచింపకుండుట కవికొక లోపము. స్వీయప్రవృత్తిని చిత్రించుట కన్న సామాన్యమానవప్రవృత్తి చిత్రించుటయందే కవి తన కవితాశక్తులను చూపఁగలడు.

ఈ ఖాసింఖాన్  గారి అభిప్రాయం గురించి కవులు ఆలోచించవలసిందిగా వినతి.

ఇందులో పురిపండావారి గురించి చిట్టచివరి పేరాలో రాసిన వాక్యాలు నాకు తెలిసిన స్వచ్ఛమైన పురిపండా వ్యక్తిత్వం గుర్తుచేసింది. కవులూ, విమర్శకులూ తప్పక చదవాల్సిన అంశాలు ఈ వ్యాసంలో ఉన్నాయి. చదువుతారన్న ఆశతో ఈ వ్యాసం.. SAMADARSHINI_1930_01_01_Volume_No_Issue_No_3

 

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

విచిత్ర పంచాంగం 1935

10 బుధవారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ 1 వ్యాఖ్య

ఈరోజు టీవీలన్నింటా మంచి తిధులూ, శుభలగ్నాలూ.. జ్యోతిష్యాలూ.. లగ్నబలాలూ..!! పత్రికలే మాధ్యమంగా ఉన్న రోజులలో వారఫలాలు ప్రచురించటానికి కొంచె సంకోచించేవారు..!!  హేతువాద భావాలు మనదేశంలో చాలా మార్పులు తెస్తాయనీ, వ్యక్తుల అభివృద్ధి వారి ఆలోచనల అభివృద్ధిగా విద్యావంతులలో చాలామంది భావించిన రోజులవి. 1935 అంటే 80 సంవత్సరాల క్రితం రాసిన ఈ పంచాంగం చూస్తే మనజాతిలో వచ్చిన మార్పులు ఎన్నో గుర్తు వచ్చాయి. బౌద్ధికాభివృద్ధి కేవలం భౌతికాభివృద్ధికీ అది లభించటంకోసం పరుగుపందాలకీ అందులో విజయాలకు అన్ని విలువలనీ, ఆత్మనమ్మకాన్నీ కోల్పోటానికీ పరిమిత మయిపోయాం.. ఈ  సరదా పంచాగం సరదాగానే చదువుతూ ఈ 80 ఏళ్లలో మనం మానసికంగా చేరుకున్న దోవ గురించి క్షణంపాటు ఆలోచిద్దాం.. ANDHRA_VIDHYARDHI_1935_01_01vichitra panchangam

 

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

దేశదేశాల లోకోక్తులు

09 మంగళవారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు

≈ 1 వ్యాఖ్య

1915 అక్టోబరు విద్యానిది పత్రికలో వచ్చిన ఈ సామెతలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆసక్తి కలవారి కోసం..

VIDYANIDHI_1915_10_01_lokoktulu

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

పానుగంటి వారి స్వప్నకావ్యము – విశ్వనాథ విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు

07 ఆదివారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల కథలు, పాత పత్రికలు

≈ 1 వ్యాఖ్య

ట్యాగులు

పానుగంటి లక్ష్మీనరసింహారావు

1918లో ఆంధ్రసేవ అనే పత్రికలో పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు స్వప్నకావ్యము అనే పెద్ద కథ రాసారు.  ఈ కథ చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు గుర్తొచ్చింది. ఆసక్తి గలవారి కోసం ఈరోజు ఆ కథ అందిస్తున్నాను. ANDHRA_SEVA_1918_03_01panuganti full

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

కవులు భార్యలను ఎందుకు వర్ణించరు 1928 నాటి ప్రశ్న

05 శుక్రవారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ 5 వ్యాఖ్యలు

VIDYANANDA_1928_04_01_ellepeddiఎల్లేపెద్ది వెంకమ్మగారు 1928 ఏప్రిల్ లో విద్యానంద అనే పత్రికలో వేసిన ప్రశ్న ఇది.

ఈ ప్రశ్న ఈనాడు కూడా వర్తిస్తుందా? పరిస్థితి మారిందా? మారాలా?

స్పందించవలసిందిగా వినతి.

 

 

 

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

చిత్రకవిత్వము – ఈతరం

01 సోమవారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు, వివిన కబుర్లు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

చిత్ర కవిత్వము

ఈతరానికి ఇప్పుడు నేను అందిస్తున్న వ్యాసం ఎంతవరకూ ఆసక్తిగా ఉంటుందో తెలీదు. చనిపోతున్న అనేక కళలలో పద్య రచనను చేర్చటానికి వీలులేదు. పద్య రచన వేరు పద్య కవిత్వం వేరు. పద్య కవిత్వం చాలావరకూ కనుమరుగైనా, రచన భిన్న రూపాలలో కొనసాగుతూనే ఉంది. ఈనా అభిప్రాయం పైపై పరిశీలన వల్ల కలిగినదే. దీనికి అష్టావధానాలు, శతావధానాల రూపంలో ఇంకా జనాదరణ ఉంది. ఇది సంస్కృతికి మూలరూపంగా ఇంకా కొందరు గౌరవించటం, ధనం ఖర్చుపెట్టటం, కొందరైనా విస్మయంతో ఆనందపడటం ఉంది.

ఇదంతా పక్కన పెట్టి,

అనేక పూర్వపు కళలలో దీనిని ఒకదానినిగా నేను భావిస్తాను. ఇలాంటి వాటితో మన సమీప పూర్వీకుల సృజనశక్తి క్షీణదశకు చేరుకుందని అనేకమంది ఆధునికులు తేల్చేసారు. మన శిష్టుల సృజనశక్తి భారత ఇతిహాసాన్ని అనువాదించటంలో ప్రాంతీయతను మిళితం చెయ్యటంతోనే ఆరంభమయింది. ఇది తిక్కన నాటికి అభివృద్ధి చెందింది. శ్రీనాధుడు, పోతనల నాటికి స్వతంత్ర విస్తరణలు ఆరంభమయాయి. ప్రబంధయుగానికి పురాణాలలో, ఇతిహాసాలలోంచి మూలకథని తీసుకుని విస్తరించటం దాని పరిణామమే. ఆ తర్వాత కాలానికి పింగళితో మొదలైన స్వతంత్ర కల్పన కొనసాగింపుగా ఉండకపోటంతో అనేకులు దానిని క్షీణదశగా భావించారు. ఈ పరిణామక్రమంలో ఈ దశలో వచ్చినవి ద్వ్యర్ధి, త్ర్యర్థి కావ్యాలు. అలాగే చిత్ర, గర్భ కవిత్వాలు. ప్రాంతీయత మరింత హెచ్చింది.

ఇలా

సృజన శక్తి తీసుకున్న రూపాలలోని చిత్ర, గర్భ కవిత్వాలను నేను ఒక మరుగున పడుతున్న  కళగా గుర్తిస్తాను. ఈరోజు అందిస్తున్న వ్యాసం వాటిని గురించి ఈనాటి తరానికి ఉపయోగం ఉండదని తెలిసినా, భద్రపరచదగిన ఒక కళారూపంగా చూడవలసిందిగా, ఆనందించవలసిందిగా నా వినతి. ఇది ఆంధ్రభాషావిలాసిని పత్రికలో 1926 జనవరి సంచికలో వచ్చింది.

ANDHRA_BHASHA_VILASINI_1926_01_chitra kavitwamu

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: