• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Monthly Archives: జూలై 2021

మహారచయిత రావిశాస్త్రి కలంపేర్లు తొలి కథలు మరో రెండు

31 శనివారం జూలై 2021

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

పుస్తకరూపంలో రాని రావిశాస్త్రి గారి కధలు మరో రెండు ఇక్కడ అందిస్తున్నాను. ఈ కథలు తొలికథలు. ఇవి వారి గొప్ప కథలలోకి చేరవు. ఆయన అభిమానులకి కొత్త కథలుగా అనిపించవచ్చు ననే ఉద్దేశ్యంతోనే వీటిని ఇక్కడ ఉంచుతున్నాను. ఇంతటితో ఈ వరస ముగుస్తుంది. వారి నిష్క్రమణ సందర్భంగా బెంగుళూరులో మిత్రులం ఒక చర్చా కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఆ చర్చను నేను రజనీకాంత్ గారూ రాసి విశాలాంధ్ర పత్రికకి పంపాము. అది వెతుకుతున్నాను. దొరికితే దానిని మరో టపాలో అందిస్తాను

బేడ ట్రాజెడీ1950-03-01

ప్రేమ నవ్వింది 1950-05-01

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

మహా రచయిత రావిశాస్త్రి 100.

30 శుక్రవారం జూలై 2021

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

రాచకొండ విశ్వనాధశాస్త్రి గారు మా తరాన్ని సృష్టించిన మహా రచయిత. ఆయన తెలుగు వాడిగా పుట్టటం ఆయన దురదృష్టమనీ తెలుగు వాడి అదృష్టమనీ మా రోజులలో పెద్దలు చెప్పేవారు. సమకాలీన దృష్టితోనే వారు ఆ మాట అనేవారు. ఆయన వందేళ్ల క్రితం ఈ తారీఖున పుట్టారు. 13వ ఏటనే కలం పట్టారు. ఏ మహా రచయిత అయినా కాలం దాటి కొంత వరకే ముందుకు చూడగలడు. తన కాలపు యువతను ఉత్తేజపరచగలడు. వారికి ఒక ఉమ్మడి సామాజిక స్వప్నాన్ని చూపించగలడు. జాతి వారిని సంపదగా భావిస్తుంది. కాని మన తెలుగు భాష మాటాడేవారు మన దేశంలోని ఇతర భాషా సమాజాలతో పోలిస్తే తమని తాము భాషాపరమైన జాతిగా అంగీకరించరు. ఒక మహా రచయితని అతని కాల పరిస్థితుల దృష్ట్యా అంచనా వేయరు. అతని పుట్టుక జరిగిన ప్రాంతం, కులం, వర్తమాన అక్షరాస్యుల రాగద్వేషాలతోనే తూచుతారు. ఇలాంటి సాహిత్య స్థితిలో శాస్త్రిగారిని తలుచుకునేది కొన్ని గ్రూపులు మాత్రమే. సారాంశాన్ని పక్కన పెట్టి పునర్మూల్యాకనం అనే మంచి పేరుతో పదాలలో రంధ్రాలు వెతికే కాలం ఇది, అటు సాంప్రదాయపరులకీ ఇటు వారి రాజకీయ ప్రత్యర్ధులమని చెప్పుకునీ వారికీ కూడా కమ్యూనిజం అనే నిజం పట్ల ఒక ద్వేషం రాజ్యమేలుతున్న దశలో అందరికీ చెందే శాస్త్రిగారు కొందరికే పరిమితమై పోయేకాలంలో వారి నూరేళ్ల జయంతి సంబరంగా చేసుకోవాలంటే మనసు ఇచ్చగించటం లేదు. కాని నా ఉద్వేగాలు నన్ను నిలవనీయటం లేదు. నా వ్యక్తిగత తృప్తికోసం నేను ఈ కథలు వరసగా నా బ్లాగ్ ద్వారా చదువరులకు అందజేస్తున్నాను. ఈ కథలు నేను కథానిలయం కథా సేకరణలో సేకరించినవి. ఇవి మనసు సంస్థ రచనాసాగరం ప్రచురించేనాటికి సేకరించని కథలు. శాస్త్రిగారి ఆఖరిదశ కథ 28వ ఏట రాసారు. నా దృష్టిలో అది ప్రపంచంలోనే అత్యుత్తమ కథలలో ఒకటి. ఆ దశలోనే రాసిన కథలు ఇవి. వీటిలో రూపొందుతున్న మహారచయిత ఆలోచనలను ఆవేశాలను మనం పట్టుకోగలం. వీలైతే చదవండి. వీటిని ఈ తరం చదివితే మరింత ఆనందం.

https://vivinamurthy.files.wordpress.com/2021/07/1950-06-15-crv3.pdf

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: