అమ్మను వెదుక్కోటంతో ఆరంభం మనిషి.
వాడు ఇదేమిటి అదేమిటి అంటూ ప్రశ్నల వాడైతే జవాబుల కోసం వెదుకులాట.
48 మే 21న మొదలైన నేను ఎప్పుడో అప్పుడు ముగిసిపోతాను.
ఈ మధ్యలో నాకు కలిగిన ప్రశ్నలను, దొరికిన జవాబులను ఇంతకాలం కథలల్లాను. వ్యాసాలు రాసాను.
వాటిల్లో కొందరు గుర్తుంచుకునేవి వ్యాపారబంధాలు, హంసగీతం, విమానం వచ్చింది, అలసిన కన్నులు, పాడుకాలం వంటి నవలలు. పయనం-పలాయనం, స్పర్శ, జ్ఞాతం, కృష్ణస్వప్నం, వాల్ పేపర్, మాయ-మహామాయ వంటి కథలు. అందరూ మరోమారు చదవాలని నేను కోరేవి జగన్నాటకం(jagannatakam), కాలమహిమ, గోగ్రా, అఖండదృష్టి వంటివి. నా జీవన సహచరి వి. రామలక్ష్మి రాసిన కథలు సైతం ఈ బ్లాగులో చేరతాయి.
ఛందోబద్ధ కవిత్వం రాసిన నాడూ ప్రశ్నలే జవాబులే.
జవాబులు తప్పితే కోపం, దుఃఖం . అనవసరమే. తెలుసు. కాని కొందరికి తప్పవు.
ఇదో అంతులేని వెదుకులాట. ఇలాంటి వెదుకులాటలో చాలామంది ఉంటారని నా సాహిత్యానుభవం చెపుతోంది. అలాంటివాళ్లు కొందరు ఈ అంతర్జాల మాధ్యమంలో దొరకుతారేమోనన్న ఆశతో.. వా వెదుకులాటలో వారూ, వారి వెదుకులాటలో నేనూ సహచరులం కావాలని.. ఈ బ్లాగు నా 65వ పుట్టినరోజున ఆరంభిస్తున్నాను.
ఇందులో నా వెదుకులాటలో నన్ను అబ్బురపరిచిన కథలూ, విశేషాలు, వ్యాసాలు చేరుస్తాను.
మీరూ వాటిగురించి ఆలోచించి ఏదైనా అంటే సంతోషిస్తాను. వివిన మూర్తి
తప్పకుండా ఎదురుచూస్తుంటాను.
65 శుభాకాంక్షలు.
మాస్టారూ! నమస్కారం. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం, మీ రచనల గురించి తెలుసుకునే అవకాశం మాకు కలిగించడం నిజంగానే భాగ్యం సుమండీ.
ఫోటో చాలా బావుంది .మరొక మంచి బ్లాగు మాకు
mee blog chalaa bagundi ….
meeku naa abhinandanalu
chakkati anubandhaniki chikkati photo. Manchi blog. Happy to see it!
I have seen your blog just now 3 months after your 65th birthday. It is interesting with your essays and in future we expect some more articles and shortstories of yours and of V.Varalaxmi gaaru.
సార్ మీ బ్లాగ్ బావుంది. నేనూ బ్లాగ్ ప్రారంభించాను గాని డిజైన సరిగ్గా కాలేదు.
వి వి న మూర్తి గారూ
ఇప్పుడే మైల్ బాక్స్ లోకి వెళ్ళిపాత మైల్స్ డిలీట్ చేయాలని చూస్తే మీ బ్లాగ్ గూర్చి కనిపించింది.వెంటనే చూసాను
బ్లాగ్ గెటప్ అంశాలూబాగున్నాయి.ఇం కోవిశేషం తెలుసు కున్నాను. వి.రామలక్ష్మి మీ సహచరి అని నాకు ఇంతవరకూ తెలియదు.సాహితీ దంపతుల లిష్ట్ లో మీరిరువురూ కూడా వున్నందుకు చాలా సంతోషం .రామలక్ష్మిగారికి నా ప్రత్యేక అభినందనలు
ఎదురుచూస్తాము మాస్టారు
వివినమూర్తిగారూ, ఈ టపా ఇప్పుడే చూస్తున్నాను. మీ పయనం – పలాయనం కథకి వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారి అనువాదం thulika.netలో ఉంది. మీకు తెలిసినవిషయమే అయినా మీ జగన్నాటకం బ్లాగులో చేర్చుకుంటారేమోనని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీ సాహిత్యకృషిని అభినందిస్తూ ..
chadivanu. spandichadam cetakadu. bagundi
మూర్తి గారూ! మీ సాహితీ వంటకం రుచి చూశాక లాలాజలోత్పత్తి, తృష్ణ, పిపాస పెరిగాయి. మీరు జతచేసిన ‘గోర్కీ’ వ్రాయడం నేనేలా నేర్చుకున్నాను, గొప్ప సేకరణ. జనవరి 19 న విజయనగరంలో చాసో శతజయంతి కి వచ్చాను, కాస్త ఆలస్యంగా. అందుకే మిమ్మల్ని కలవలేకపోయాను. నాకు రచన చాతకాదు. కానీ ఆలోచనల్ని అప్పుడప్పుడూ నా సొంత పెరట్లో (gksraja.blogspot.in) చల్లుకుంటుంటాను. నవభారతి లాంటి పత్రికలలోని మంచి వ్యాసాలను మరిన్ని సమకూర్చి మాజిహ్వల్ని షడ్రుచోపేతం చేస్తారని ఆశిస్తూ—
రాజా.
Maa Adrustam
వి.వి.న.మూర్తి గారూ మీ బ్లాగు చాలా ఆకర్షణీయంగా వుంది.15 సంవత్సరాలక్రితం బెంగళూరులో మీ ఇరువురినీ కలిసిన నాటి స్మ్రుతులు మదిలో మెదిలాయి.
సి.వి.గురించి మీ అభిప్రాయం చాలా విలువైనదిగా భావిస్తున్నాను.– దివికుమార్
inka chudaledu chusi spandisthamu
Viroopakshuni samadrusti ki nidarsanam kanudoyi
నిన్ననే మన కల్యాణి అసలు blog అంతే ఏమిటి ?ఎలా తెరవాలి అన్నది మీ blog ద్వారా నేర్పించింది .అక్షరాభ్యాసం నాడు చేతిలోకి తీసుకున్న వస్తువు పుస్తకమా బంగారమా ధనమా అన్నదాని బట్టి పెద్దలు భవిష్యత్తు గురించి predict చేసేవారటగా ?నా భవిష్యత్తు …………..?గుర్గాం లో ఉన్నాను.
sir Ihave seen your blog veryvery thx
sir , I have seen yourblog very very thx
వివిన మూర్తి గారు ఒక ఆత్మీయ స్పర్శ కలిగిన సాహిత్యకారులు. ఆయన బ్లాగు ప్రారంభించటం నాలాంటి వారికి చాలా సంతోషకరం.
సంతోషం సార్
all the best wish your efforts all success-s s sarma
Vvnsahithivanamveguchukka
పుట్టిన రోజు శుభాకాంక్షలండీ.మీ అనుభవాలు గురించి, ఆలోచనలు బ్లాగు లో అందిస్తే మాకు మార్గదర్శకాలవుతాయి.
ప్రయత్నిస్తానండీ
ఇష్టం తో కూడిన అభినందనలు సర్. ఎదురు చూస్తుంటాం
Thank you sir. Waiting…
సర్, మంచి ప్రయత్నం , మీ లాంటి స్కాలర్ ఆలోచనలు మా లాంటి వారికి చాలా అవసరం.మీ పయనం పలాయనం కథ తెలుగు కథల్లో ఒక గొప్ప కథ అని నా అభిప్రాయం.
సంతోషమండీ
మీ అమూల్యమైన అభిప్రాయాలు వినాలని ఉంది