• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Monthly Archives: సెప్టెంబర్ 2013

Poverty reduction and sustainable energy

23 సోమవారం సెప్టెం 2013

Posted by వివిన మూర్తి in వివిన కబుర్లు, వివిన రచనలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

harish hande

2. బొంబే వచ్చింతర్వాత పై విషయం గురించి ఉపన్యాసం ఉందని పోస్టరు చదవి తెలుసుకున్నాను. చిత్రంగా ఉందీ అంశం.. తప్పకుండా వెళ్లాలనుకున్నాను. మాటలాడేది హరీశ్ హందే. కర్నాటకలోని కుందాపురంలో పుట్టి, రూర్కెలాలో పెరిగిన ఈయన ఖరగపూర్ ఐఐటిలో ఎనర్జీ ఇంజనీరింగులో బిటెక్ చదవాడు. తరవాత అమెరికా మసాచుసెట్స్ విశ్వవిద్సాలయంలో పిజి, పిహెచ్ డీ చేసి భారతదేశానికి తిరిగి వచ్చాడు. 1995లో SELCO అనే సామాజిక వ్యాపారసంస్థను బెంగళూరులో స్థాపించాడు. ఈ సంస్థకి కర్నాటక, మహరాష్ట్ర, బీహార్, గుజరాత్, తమిళనాడులలో 38 ఎనర్జీ సేవా కేంద్రాలు ఉన్నాయి. గ్రామీణ భారతంలో సౌరశక్తిని వినియోగించి పేదప్రజలకి ఉపాధి కల్పనలో, ఆదాయం పెరగటంలో సహాయం చేయటం ఆయన చేపట్టిన కార్యక్రమం. రామన్ మెగాసెసే అవార్డుతో సహా అనేక జాతీయ, అంతర్జాతీయ బహుమానాలు పొందిన ఈ social entrepreneur ఉపన్యాసం వినటం ఒక అనుభవం. సుమారు 500 పట్టే సభాంగణం నిండిపోయింది.

ఆయన చెప్పిన కొన్ని అనుభవాలు, ఆలోచనీయ అంశాలు పంచుకోవటం రెండవ బాకీ.
అ. ఒక వీధివ్యాపారి సంగతి. ఉదయం 1000రూ. అప్పు తీసుకోటంతో ఆరంభం. అందులో 100 వడ్డీ అప్పుడే తీసుకుంటారు. 900 వందలతో సరుకు కొని వీధి వీధీ తిరిగి అమ్ముకుంటాడు. అందులో పోలీసు మామూలు, రౌడీ జులుం 100. బండి అద్దె 50. సాయంకాలం మిగిలిన సరుకు నిలవ వేసుకొనే సదుపాయం లేదు. ఏదో ధరకి అమ్ముకోవాలి. కనీసం 200 నుంచి 300 సంసారపోషణకి కావాలి. ఇతను చేసే సేవ ఇంటింటికీ సరుకు చేర్చటం. ఇతనికి ప్రభుత్వం.. ఏమైనా సహాయపడుతోందా .. వీళ్లకి పోటీగా ఉండే మాల్స్ కి లభించే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, 5, 6 శాతం బాంకు రుణాలు లెక్కవేయండి సబ్సిడీలు ఎవరికి అందుతున్నాయి.
ఆ. నేను ఐఐటిలో ఎలా చదివాను.. ఎంత సబ్సిడీ ఫొందాను.. ఆ ధనం ఎవరిది.. పేదల నుంచి నేరుగానూ, మరో రూపంలోనూ ప్రభుత్వం పోగుచేస్తున్నది కాదా.. దానితో లాభపడిన నేను ఎవరికి లాభపడాలి.. ఎవరి లాభాలకి ఉపయోగపడుతున్నాను..
ఇ. నేను మలేసియా, శ్రీలంక, ఆఫ్రికా లలో పేదల మధ్య పనిచేసాను. ప్రపంచంలో పేదలు ఎక్కడున్నా వారికి నేను రుణపడే ఉంటాను. ఎందుకంటే ప్రపంచంలోని పేదలు పోగుచేసిన సంపదతోనే నేటి విద్యావ్యవస్థ ఏర్పడింది. అందుకే నా దేశంలో పేదలకి మాత్రమే పరిమితం కావాలనుకోను. నా నైపుణ్యం వీరికి ఎలా ఉపయోగించటం..
ఈ. బీహార్ లో పని చేయటం చాలా కష్టం అంటారు. ముంగేర్ జిల్లాలో మూడేళ్లుగా పని చేస్తున్నాను. వారికి నా టెక్నాలజీతో 1200 గ్రామాలకు విద్యుత్తు ఇవ్వగలిగాను. ఒక గ్రామంలో ఆకులు కుట్టటం వృత్తి. వారు ఒకరోజు ఆకులు పోగుచేస్తారు. మరునాడు మాత్రమే కుట్టగలుగుతారు. రాత్రి దీపం వల్ల వారు రెండురోజుల పని ఒకరోజులో చేయగలిగారు.
ఉ. వ్యవసాయంలో నిపుణులు పనిచెయ్యటం లేదంటారు. పనిచేస్తున్న వారెవరు? జీవితమంతా అక్కడ పని చేస్తున్నవారి అనుభవానికీ, వారు పెంచుకున్న నైపుణ్యాలతో పోలిస్తే 4,5 ఏళ్లు చదివిన వారు ఏ పాటి? ఈ దృష్టికోణంలో తప్పు కనిపించటం లేదా.. మేం చెయ్యవలసింది వారివద్ద నేర్చుకోటం.. వారి అవసరాలకు కావలసిన పరికరాలు డిజైన్ చేయటం.
ఊ. నాకూ, నీలిమా మిశ్రాకు కలిపి రామన్ మెగాసెసే అవార్ఢు ఇచ్చారు. న్యాయంగా అది ఆమెకు మాత్రమే రావాలి. నా అమెరికా చదువు, నా ఇంగ్లీషుల వల్ల నేనందులో వాటా చిక్కించుకున్నాను. మనదేశంలో ఇంగ్లీషుకి ఉన్న విలువ ఇలాగే ఉండాలా అంటూ చాలా సంగతులు చెప్పారు.
ఎ. ఒక అబ్బాయి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంచి ప్రశ్న వేసాడు. మా తలిదండ్రులు మా జీవితాలు సుఖంగా ఉండాలని ఐఐటిలకి పంపుతారు. యంత్రాలలా మేం చదువుతాం. మేం మాగురించి తప్ప మరి దేని గురించైనా ఆలోచించే మోటివేషన్ ఎలా వస్తుంది? దానికి హరీష్ సమాధానం – ప్రశ్నతో నిరసన చేయటం మనకి అలవాటయింది. జవాబుతో నిరసన మనం అలవాటు చేసుకోవాలి. అంటే ఈ ప్రశ్న నీకు కలిగాక జవాబు నువ్వే ఆలోచించాలి. ఉదాహరణకి నువ్వు స్కూల్స్ లో విద్యార్ధులకి మోటివేషన్ అవసరం చెప్పవచ్చు. నీ పిల్లలని ఈ విషవలయం నుంచి తప్పించవచ్చు. ఇవి కేవలం ఉదాహరణలు.
గుర్తున్నమేరకు చెప్పాను.
ఒక పెనుమార్పుతో అనేక రంగాలలో మార్పుల గురించి ఆలోచించే మనిషిని నేను. అనేక మార్పుల గురించి మాటలాడేవారు అసలు మార్పు జాప్యానికి తోడ్పడతారని విన్నవాడిని. నా వివేచనా స్వభావం వల్ల ఆకలిగా ఉన్నపుడే(అవసరాల వల్లే) పెనుమార్పులు సాధ్యమన్న అంచనాలో పొరపాటుందని అనుకునే మనిషిని. మనిషి ఎదగాలని కలలు కనటం ఓ స్థాయి తరవాతనే సాధ్యం అని నేను కొంతకాలంగా ఆలోచిస్తున్నాను. ఆ స్థాయికి చేరిన వారిని రాజ్యం ఒకరికి ఒకరికి శత్రువుని చేయటంలో ప్రస్తుతం ముందంజలో ఉంది. కాని అదిక సంఖ్యాకులు కలలు కనే స్థాయికి చేరాక రాజ్యం స్వభావం మారక తప్పదు. ఇటువంటి సామాజిక ఆలోచనాపరుల ఇలాంటి ప్రయత్నాలు ఆ దిశగా ఆహ్వానించవలసినవే.

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

అద్దె కడుపులూ- అఖండ భారతం

21 శనివారం సెప్టెం 2013

Posted by వివిన మూర్తి in వివిన కబుర్లు, వివిన రచనలు

≈ వ్యాఖ్యానించండి

20-9-2013
ఈ మధ్యలో నలుగురితో పంచుకోవలసినవి కొన్ని బాకీ ఉన్నాయి.
1. బొంబే వచ్చేముందే స్వాతిలో ఒక వ్యాసం చదివారు రామలక్ష్మిగారు. ఒకటి భగవతి, అమర్త్యసేన్ ల ఆర్ధిక నమూనాల గురించి. గుజరాత్ ఆర్ధికాభివృద్ధికి భగవతి నమూనాట .. ఏంటంటారూ.. ఇన్ప్రాస్ట్రక్చర్ ఏర్పరచటం. దాన్ని ఉపయోగించుకుని ప్రజలు కొత్త కొత్త సంపాదనా మార్గాలను ఏర్పరచుకోడం… దానివల్ల ఉపాధి అవకాశాలు పెరగటం… అందరూ ఆర్ధికంగా అభివృద్ధి చెందటం. ఇన్ప్రాస్ట్రక్చర్ అంటే ఏంటి.. అని అడిగారు ఆవిడ. రోడ్లు, ఆస్పత్రులు, పరిశ్రమల పార్కులు, టెలికమ్యీనికేషన్ అంటూ తోచిందేదో చెప్పాను. ఆస్పత్రి అనగానే .. ఆవిడ తెగ చదువుతుంది గదా.. మరో వ్యాసం గుర్తొచ్చింది రామలక్ష్మికి. అదీ గుజరాత్ గురించే. అక్కడ అద్దెతల్లుల ఆస్పత్రులు ఉన్నాయిట. అవి పూర్తిగా అద్దెతల్లులను సమకూర్చటం.. వారి గర్భాలలో వేరే ఆడా, మగా విత్తులను నాటటం.. నాటిన నాటినుంచి పంట వచ్చేవరకూ క్షేత్రాలను, వాటి హక్కుదారులైన భర్తలను, లబ్ధిదారులైన ఇతర కుటుంబ సభ్యులనూ సంరక్షించటం.. పంట వచ్చాక ఖర్చులనూ లాభాలనూ లెక్క చూసుకుని ఎవరికి కావలసింది వారి చేతిలో పెట్టి తామూ కొంత చేసుకోటం.. ఇదీ కార్యక్రమంట. ఇంతమందికి.. జీవనోపాధి లభిస్తుంది. మూడు నాలుగు పంటలతో ఒక కుటుంబం కుటుంబం ఆర్ధిక స్థితి మారిపోతుంది. వారి బిడ్డలు కాకపోయినా మనుమలు కడుపులను అద్దెకు తెచ్చుకునే ఉన్నత స్థితికి ఎదగవచ్చు. చిత్రం చాలా పచ్చ పచ్చగా ఉంది. అయితే నా మట్టిబుర్రకి ఓ అనుమానం వచ్చింది. – ఇంత మార్కెట్టుందిటోయ్ – అన్నాను . నా తెలివితక్కువకి రామం గారు పకాలున నవ్వారు. –పెద్ద కబుర్లు చెపుతారు గదా.. ఆమాత్రం తెలియదా.. అన్నారు. బుర్ర గోక్కున్నాను. “అదేంటండీ పిల్లలని కనటానికి టైం లేని సాఫ్టువేరు జంటల సంగతి ఏంటి.. కెరీరులో వెనకబడరు.. ఆడా మగా పోటీలుగా పరుగెట్టవచ్చు. పిల్లలవి వాళ్ల డిఎన్ఏలే. సంపాదించిన ఆస్తులు, పెట్టిన షాపులు చూసుకోటానికి వారసులు శ్రమ లేకుండా కాస్తంత ఖర్చుతో పుట్టుకొస్తారు. శీలం సమస్య లేదు. కామం కోసం కూడా టైం కేటాయించనవసరం లేదు.. సగం మంది పని చెయ్యటం.. సగం మంది కనటం బావుంటుంది గదా” అందావిడ. రేపు దేశమంతా అద్దెతల్లుల ఆస్పత్రులు పెట్టాలని ప్రభుత్వాలు పధకాలు వెయ్యొచ్చు.. మన నియోజకవర్గంలో ప్రతి వీధికీ తెప్పిస్తామని ప్రజాప్రతినిధులు వాగ్దానాల ఖాతాలో చేర్చుకోవచ్చుగదా అని నేను నా ఊహలు కొనసాగించాను. ఇది నలుగురికీ పంచేసుకోవాలని .. మన దేశం గురించి పెసిమిస్టులు ఎవరైనా ఉంటే .. వాళ్లని మార్చెయ్యాలని ఎఫ్బీలోకి దూర్చేసాను.

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

kalipatnam ramarao sashtipurti

10 మంగళవారం సెప్టెం 2013

Posted by వివిన మూర్తి in వివిన రచనలు

≈ 1 వ్యాఖ్య

90 ఏళ్ల రామారావు గారికి షష్టిపూర్తి ఏంటని కొందరికైనా అనుమానం రావచ్చు. కథానిలయం పని అందులోనూ నేను చేస్తున్నది చాలా ప్రత్యేకమైనది. పత్రికలలో కథలు డేటాబేస్ లో చేర్చటం ఒక ఎత్తు. దానిలో రిపిటీషన్ లు లేకుండా చేయటం చాలా సమస్య. పదేళ్లుగా పట్టుదలగా పిచ్చివాడిలా పనిచేస్తున్నాను. ఇలా చెప్పుకోటం నామటుక్కు నాకు నా మనస్తత్వానికి వ్యక్తిత్వానికి నేను ఏర్పరచుకున్న నియమాలకు పూర్తిగా వ్యతిరేకం.

కాని-

ఒక్కోమారు ఈ చుట్టూ ప్రపంచపు తీరు గమనిస్తుంటే నాకేంటి అనుకోని మనుషులు పిచ్చివాళ్లు అనే అనిపిస్తుంది.

అలాంటి కొందరు ఈ లోకంలో ఉండటం చాలా సహజం. అది సృష్టిలోనే ఉంది.  అలాంటి వాళ్ల ఆలోచనలు  తమ చుట్టూ కాకుండా తాము నివసిస్తున్నసమూహం లేదా గుంపు లేదా సమాజం లేదా ప్రపంచం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. వాళ్లు సాధారణంగా గుంపుగా ఉంటారు. వాళ్లని గుంపుగా ఉంచేవి అనేకం. ఆ అనేక కారణాలలో పరస్పర వ్యతిరేకమైనవీ ఉంటాయి. ఉదాహరణకి మతవాదులు కమ్యూనిస్టులూ  ఒకరినోకరు చంపుకొనేటంత తీవ్రమైన వ్యతిరిక్తులు. వీరు ప్రపంచాన్ని ముందుకో వెనక్కో నెట్టాలని చూస్తారు. ఏమైనా అందరూ గుంపులుగానే ఉంటారు.  రచయితలు అనేవాళ్లు ఒక గుణం అంటే రాయటం అన్నదాని వల్ల గుంపుగా కనిపిస్తారు గాని పని వల్గ గాని, ఆలోచన వల్ల గాని గుంపు కాలేరు. ఒక భావజాలంకి చెందిన వారు ఒక సంఘంగా పని చేయటం ఆధునిక కాలంలో కనిపిస్తుంది. అది ఒక అవసరం వల్ల ఏర్పడిన గుంపు అనటం కన్న ఒక భావ ఏకత వల్ల ఏర్పడిందనటం తర్కబద్దం. అలా నేను రచయితలు గుంపుకి చెందిన వాడిననుకోవచ్చు. అలా ఒక భావఏకత వల్ల కొంతమందితో సాన్నిహిత్యాన్ని ఆశించవచ్చు. అది లభించవచ్చు. కాని ఈ రచయితలు ఏకఫలాపేక్షగల యాచకులుగా కూడా కనిపిస్తారు. అలాగే వారు ప్రతి స్థిరమైన భావననీ ఎంతోకొంత సందేహించటం కూడా జరుగుతుంది. అది ఆలోచనాపరుల సహజ లక్షణం. రచయితలు కావటంలో కళావసరం ఎంత ఉందో అంతే సామాజిక సంవేదనలు పంచుకునే అవసరం ఉంది. ఇలాంటి రచయితలలో ఎంతో కొంత అనేకత ఉంది. ఒంటరిదనం ఉంది.

ఈ దృష్ట్యా

స్వభావరీత్యా, నేనెంచుకున్న పని రీత్యా బాగా అలసటలో నన్ను చూసి నాకే వెర్రివాడిననిపిస్తుంది. అలాంటి స్థితిలో 1984 డిసెంబరు జ్యోతి పత్రిక కంటబడింది. చాలాకాలమయింది చూసి. అందులో నేను మాస్టారి షష్టిపూర్తి సందర్బంగా సరదాగా రాసిన ఈ పేరడీలు కనిపించాయి.

ఈ లంకెలో చూడండి.vivina parady on kara

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ప్రేమ మాది పెళ్లి మీది

03 మంగళవారం సెప్టెం 2013

Posted by వివిన మూర్తి in వివిన కబుర్లు

≈ 3 వ్యాఖ్యలు

రకరకాల జరుగురులలో .. దిద్దుబాటుకి ముందు కథలు ఓ పుస్తకంగా తెచ్చే ప్రయత్నం.. తానా వారి తరఫున జంపాల, కథాసాహితి నవీన్ చేస్తున్నారు.. ఉడతాభక్తిగా నా వంతు కొంత చేతనైన పని.. అలాగే మరో పెద్దలు గొప్పవారితో గుసగుసలు అనే 1947 నాడు ఆంధ్రపత్రికలో సీరియల్ గా వచ్చిన ఊహా ముఖాముఖీలతో పుస్తకం తెస్తున్నారు. మానవ మాత్రుడిని కదా .. నోరు తెరిచి ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పే ఉత్సాహం లేని నాబోటి వానికి .. ఇది ఓ మాదిరి సంతోషం..

పోతే –

ఓ పెళ్లి సందడి. కులాంతరం.. ప్రేమమాది పెళ్లిమీది అనే ఓ కొత్త సందర్భం.. జ్ఞాతం అనే కథలో పదిలక్షలతో పెళ్లయింది అని రాసాను. 1500 వందల కోట్ల మార్కెట్టుట బారతీయ వివాహాలకు. అవి మారిపోతాయని వెర్రిగా కలలు కన్న తరం నాది. మనదేశంలో కొత్తవి చేరటమే గాని పాతవి పోవు. నా కళ్ల ముందు రోళ్లలో రొకళ్లతో పసుపులు దంచటం చూసాను.. పెన్సిల్ ని రోకలిగా చేసి ప్లాస్టిక్ డబ్బాలలో నామమాత్రంగా పసుపు వేసి దంచటం అనే తంతు చూసాను.. ఇళ్లలో పెళ్లిల్లు మళ్లీ చూడటం జరగదు. చదివింపులు ఒక ఆర్ధికమైన ఏర్పాటు అనుకున్నాం.. ఎదురు బహుమానాలు సాధారణం నేడు.. పెళ్లిలో ఎంత ఖర్చించితే ప్రేమకు అంత ప్రమాణం నేడు.. మధ్యతరగతి ఆర్ధిక స్థితిలో ఎదుగుదల ఉంది.. ఎక్కడో ఉందనుకునే నల్లధనం మధ్యతరగతి జీవితాలలో ప్రముఖ భాగం.. ఎలా మారతాయి ఈ వివాహ సంబరాలు.. టీవీల సీరియల్స్ ద్వారా మెహందీ తంతు దక్షిణానికి ప్రవహిస్తోంది.

love-arranged marriages are made in india along with so called traditional stuff.   we live by the market, for the market, as the market.

వల్లూరి సూర్యనారాయణరావు గారు 1931లో కృష్ణాపత్రికలో రాసిన కొన్ని అద్భుతమైన వ్యాసాలు త్వరలో అందిస్తాను.

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: