• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Monthly Archives: మే 2015

velcheru paruchuri వ్యాసం

27 బుధవారం మే 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు

≈ 1 వ్యాఖ్య

ట్యాగులు

PARUCHURI SRINIVAS, velcheru narayana rao

ఆంధ్రజ్యోతి వివిధలో 25 మే సంచికలో  వచ్చిన ఈ వ్యాసంలో అనేక అంశాలు, సూచనలు ఉన్నాయి. నిర్మాణాత్మకదృష్టితో  రాసిన ఈ వ్యాసం మనవాళ్లలో కదలిక తీసుకువస్తే బాగుంటుంది. చాలాకాలంగా నాకు ఒక ఆలోచన ఉంది. మన విశ్వవిద్యాలయాలలో తెలుగులో పరిశోధనలన్నీ నెట్ లో ఉంచాలని.  నేను కలిసిన సందర్భాలలో విశ్వవిద్యాలయాల పెద్దలతో దీనిగురించి మాటలాడాను. కాని ఎవరూ పట్టించుకోలేదు. నేనే నావద్ద ఉన్న దాదాపు 150 పరిశోధనా పత్రాలను స్కాన్ చేయించాను. కథానిలయం వెబ్సైటులో పెట్టాలన్న  ప్రయత్నం చేస్తున్నాను. ఈ పరిశోధనలన్నీ జనం ధనంతో జరిగినవి. వీటి ఫలితాలు అందరికీ అందుబాటులో ఉండాలన్న ఆలోచన నాది. ఎలాంటి డిగ్రీ లేని నాబోటి వాడు వీటిని ప్రోఫెషనల్ గా అందించలేడని సంకోచం. వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్ గార్ల ఈ చక్కని, చిక్కని వ్యాసం చదివి ఎవరైనా ముందుకువస్తారన్న ఆశిస్తున్నాను. మనం ఎంత వెనకబడి ఉన్నామో, అయినా అంతర్జాతీయభాష వంటి ఎంత గొంతెమ్మ కోరికలు కోరుతున్నామో గదా!!! ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కుతుందా  velcheru

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

జైన, బౌద్ధ రామాయణాలు

26 మంగళవారం మే 2015

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు

≈ 2 వ్యాఖ్యలు

ట్యాగులు

రామాయణం

రామాయణం గురించి నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలలో వివిధ జాతులూ, ప్రాంతాలే కాక మతాలు కూడా తమకి నచ్చిన విధంగా చెప్పుకోటం. తార్కికంగా ఆలోచిస్తే ప్రాశ్చాత్య ప్రపంచం అంతటికీ ఓల్డ్ టెస్ట్మెంటునే అక్కడి మతాలు తమ గతంగా చెప్పుకున్నాయి. ఇలాగే తూర్పు ప్రపంచంలో రామాయణం ఒక ఏకసూత్రంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాపోతే ఇక్కడి వాళ్లు రకరకాలుగా చెప్పుకున్నారు. కిళాంబి రాఘవాచార్యులు గారు 1936 డిసెంబరు సంచికలో రాసిన ఈ వ్యాసంలో జైనులూ, బౌద్ధులూ చెప్పుకున్న రామాయణాల గురించి చెప్పారు. నాదృష్టి సోషియలాజికల్ దృష్టి.  ప్రాంతాల మధ్య ఉన్న ఈ పోలికలను గమనించటం ద్వారా మానవ ప్రవృత్తి మీద అవగాహన పెరుగుతుందన్నదే నా ఆలోచన.  ఇలాంటి విషయాలు చాలామందికి తెలిసినవే కావచ్చు. అందుకే అనవసరంగా భావించి తాత్సారం చెసాను. గోండు రామాయణం గురించి వందలాది మంది చదవటంతో ఈ విషయం మీద ఆసక్తి ఉండవచ్చనిపించి ఈరోజు అందిస్తున్నాను.

ANDHRA_SAHITHYA_PARISHAT_PATRIKA_1936_12_01_ ramayana

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఈ వ్యాసం శ్రీశ్రీదా?

24 ఆదివారం మే 2015

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ 2 వ్యాఖ్యలు

ట్యాగులు

శ్రీశ్రీ

1930-31 సమదర్శని ఉగాది సంచికలో నేనిప్పుడు అందిస్తున్న వ్యాసం ప్రచురితం. ఈ వ్యాసం శ్రీనివాసరావు పేరుతో వచ్చింది. ఇందులో అభిప్రాయాలు -విశ్వ మానవ భావన- అని నేను అనుకుంటున్నదానికి చెందినది. ఆనాటి అభ్యుదయ ఆలోచనాపరులలో ఈ భావన కనిపిస్తుంది. ఇది ప్రముఖంగా ప్రభావితం చేసిన కవిగా శ్రీశ్రీ నాకు అనిపిస్తాడు. నా మటుకు నాకు నాలో దీనికి బీజం వేసినవారు శ్రీశ్రీయే. ఈ దృష్టితో ఈ వ్యాసంలో భావాలు పరిశీలించితే కాబోయే శ్రీశ్రీ నాకు కనిపించాడు. ఇది శ్రీశ్రీ దని ఊహించటానికి చిన్న ఆధారం కూడా ఉంది. ఇదే పత్రిక 29-30 ఉగాది సంచికలో కన్యాశుల్కములో స్త్రీ వ్యక్తులు అనే వ్యాసం శ్రీ శ్రీనివాసరావు పేరుతో వచ్చింది. అది మన గురజాడ పుస్తకంలో 1932లోనే సంకలితమయింది. కాకపోతే 30-31 సంచికలో సుప్తాస్థికలు పూర్తి పేరుతో వచ్చింది. కనక ఇది శ్రీశ్రీదా కాదా అన్నది ప్రశ్న. చర్చించండి.SAMADARSHINI_1930_01srinivasa

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

komarraju lakshmana rao- akkiraju umakantham

23 శనివారం మే 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ 1 వ్యాఖ్య

ట్యాగులు

అక్కిరాజు రమాకాంతం, కొమర్రాజు లక్ష్మణరావు

కొమర్రాజు లక్ష్మణరావు గారి నిర్యాణ సందర్భంగా అక్కిరాజు రమాకాన్తమ్ గారు రాసిన సంస్మరణ వ్యాసం 1921 సెప్టెంబరు తెలుగు దేశ వాజ్ఞయ పత్రికలో ప్రచురించారు. ఆ వ్యాసం ఈరోజు అందిస్తున్నాను.TELUGU_DESHA_VANGMAYA_PATRIKA_1921_09_01komarraju

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

న్యాయచంద్రిక

20 బుధవారం మే 2015

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

మనవాళ్ల మీద మనవాళ్లు వేసుకునే ఇగటాలలో – మనం తలైనా వదులుకుంటాం కాని తర్కం వదులుకోం- అన్నదొకటి. ఆ చతుర్లను పక్కనుంచినా నాకు పెద్దలు చెప్పినదేంటంటే తర్కంలో మనం చాలా సాధించాం అని. న్యాయం అంటే తర్కశాస్త్రం అని నిఘంటువు చెపుతుంది. తమాషా ఏంటంటే న్యాయం అంటే పిచ్చివాడు అని కూడా పర్యాయపద నిఘంటువు అంటుంది. మనం తర్కానికి ఉపయోగించే వాటిలో న్యాయాలు ఉన్నాయి. న్యాయచంద్రిక అనే గ్రంధానికి అనువాదంనుంచి కవిత అనే పత్రికలో లభించిన కొన్ని న్యాయాలు అందిస్తున్నానుKAVITHA_1911_04_01_Volume_No_2_Issue_No_11 KAVITHA_1911_05_01_Volume_No_1_Issue_No_12 KAVITHA_1911_06_01_Volume_No_2_Issue_No_1 KAVITHA_1912_02_01

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఆరుద్ర ఇంటర్వ్యూ 15 8 67

07 గురువారం మే 2015

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

ఆరుద్ర

15 ఆగస్టు 1967 ఆంధ్రజనత సంచికలోని ఆరుద్ర గారితో ఈ ఇంటర్వ్యూ వచ్చింది. సాహితీ ప్రియులకోసం ANDHRAJANATHA_1967_08_15_ arudra interview

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

articles by BN Reddi, relangi, NTR

05 మంగళవారం మే 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

b. nagireddi, NTR, relangi

ఆంధ్రజనత 15 8 67 సంచికలోని  బి.ఎన్. రెడ్డి, రేలంగి, ఎన్టీఆర్ వ్యాసాలు ఇక్కడ అందిస్తున్నాను.ANDHRAJANATHA_1967_08_15 bn reddy, relangi, ntr

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

తొలి తెలుగు పత్రికా సంపాదకురాలు

02 శనివారం మే 2015

Posted by వివిన మూర్తి in పాత పత్రికలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

సత్తిరాజు సీతారామయ్య

తెలుగు పత్రికలలో ఇప్పుడు కూడా స్త్రీలు పత్రికా సంపాదకత్వంలో వెనకబడే ఉన్నారు. ప్రధాన పత్రికలలో నాకు గుర్తున్నంతవరకు సంపాదకురాలు కనబడరు. కొన్ని ఆశయాలతో వచ్చిన పత్రికలలో స్త్రీల సంపాదకత్వం కనిపిస్తుంది. హిందూసుందరి పత్రిక పెట్టిన సత్తిరాజు సీతారామయ్యగారి ఈ సంపాదకీయవ్యాసంలో స్త్రీలను పత్రికా సంపాదకత్వం వహించజేయాలన్న తన ప్రయత్నం, అనుభవం గురించి రాసిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. HINDU SUNDARI 1903 DECEMBER

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: