• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Monthly Archives: మే 2022

ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం

30 సోమవారం మే 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి అందుతుందనేది మనకి తెలిసిన విషయం. కాకపోతే ఒక్కోదశలో అది ఆగిపోతుంది. కారణాల చర్చ ప్రస్తుతం వదిలేద్దాం. ఇది అన్ని చోట్లా జరిగింది. యూరోపీయుల జ్ఞానం కూడా దాదాపు1500 సంవత్సరాల చీకటిలో కనుమరుగయింది. దానిని ఆ సమయంలో భద్రపరిచినది ఇస్లాం అవలంబకులైన అరబ్ పండితులు. మనకి ప్లేటో తెలుసు గాని ఆయన కృషి తిరిగి యూరప్ కి చేరింది గడచిన 2,3 వందల ఏళ్ల లోనే అన్నవిషయం తెలియదు. దీనికి సంబంధించిన ఈ వ్యాసాన్ని కొందరైనా చదవాలన్న కోరికతో ఇక్కడ అందిస్తున్నాను.

research-articles-arab-translationsDownload

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

అచ్చుబాటు కాని చదువు

29 ఆదివారం మే 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ 2 వ్యాఖ్యలు

1923 జూన్ శారద సంచికలో అచ్చుబాటు కాని చదువు కథ ప్రచురితం. కొప్పర్తి నారాయణ గారి రచన. చదువు(విద్య) పట్ల కొందరి అబిప్రాయాలు వందేళ్లక్రితం కథ చేసారు. చదవాల్సిన కథ

kn60238_achchuDownload

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

చలం ఆలోచనాజీవి

20 శుక్రవారం మే 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

చలం స్త్రీ స్వేచ్ఛ పేరిట చాలామంది గుర్తుంచుకుంటారు. ఆయనలో అనేక చలాలు నాకు కనిపిస్తారు. అందరూ కదిలే చలాలే. కదలిక జీవలక్షణం. మార్పు జీవ లక్షణం. ఆయన అచలం కాకపోవటమే .. అంటే ఒకే ఆలోచనని అంటి పెట్టుకుని ఉండకపోవటమే.. ఇమేజిని కూడా పట్టించుకోకపోవటమే.. నాకు ఆయన పట్ల ఉండే ప్రధాన గౌరవం. ఆయనలో స్థిరంగా ఉన్న లక్షణం ఆలోచనాపరత. అది గమనించినపుడల్లా నేను ఆశ్చర్య చకితుడినవుతుంటాను. గొప్పమానవులను బొమ్మలు చేసి వారికి భజనలు చేసి వారిని చంపెయ్యటం అనే నిరంతర మానవ కార్యక్రమంలో బలైన వారిలో చలం ఒకరు. కాకపోతే ఆయనని చంపటం వల్ల రాజకీయ ప్రయోజనాలు తక్కువ కనక ఇంకా ఆయనని చదివేవారున్నారని నాకు అనిపిస్తుంది. వారు ఆయన ఆలోచనా పరత్వాన్ని చూపే ఈ వ్యాసాన్ని చదవమని అభ్యర్ధన. సమీక్ష 1950 జనవరి సంచికలో “ఎంతవరకూ విశ్వాసం” శీర్షికను వెలువడిన వ్యాసం ఈ లంకెలో

sameeksha_1950_01_e0b09ae0b0b2e0b082Download

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

మాచిరాజు దేవీప్రసాద్ కచేరీకథనం

16 సోమవారం మే 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

దేవీప్రసాద్ గారు కొంతమందికైనా తెలిసి ఉండాలి. వ్యంగ్య రచనలకి ఆయన పేరు చెపుతారు. వ్యంగ్యానికీ హాస్యానికీ తేడా ఏమిటండీ అని తెలిసినాయన ఒకరిని అడిగితే మందహాసం మందుహాసం అన్నాడు. నాకది ఎలా అర్ధంమయిందంటే చిన్నినవ్వు మనసులో నాటుకుంటుంది దాని జ్ఞాపకం చాలాకాలం మనసులో ఉంటుంది. అది గుర్తైనపుడు మళ్లీ అదేనవ్వు కలిగిస్తుంది. మందుహాసం ఆ సమయంలో పగలబడి నవ్వించి తరవాత మరుపున పడుతుంది. మనకెందుకో మందహాసం తెప్పించేవి తక్కువ మందుహాసం తెప్పించేవి ఎక్కువ పడతాయి అని ఆ తెలిసినాయన చెప్పేవాడు. కితకితలు పెడితే తప్ప నవ్వురాని జాతి అని విసుక్కునీ వాడు. ఆయన ఏ లాబు చరిత్ర చూచినా ఏముంది గర్వకారణం అంటూ పారడీ చెప్పాడు. ఆయన నోట విన్నాను ఈ దేవీప్రసాద్ గారి గురించి. ఆ తెలిసినాయన నేనింకా తెలుసుకోవలసినవీ తేల్చుకోవలసినవీ ఉండగానే జారుకున్నాడు. ఈ దేవీప్రసాద్ గారి కచేరీ కథనం మీకు అందజేస్తున్నాను. ఎవరైనా చూసారనటానికి ఫేబుక్కులో లైకులు ఒక ఆధారంట. ఆ లైకులు తెచ్చుకోటం ఓ కళట. కథానిలయం చేయాలనుకున్న పరిశోధనాపత్రాల సేకరణకి సంబంధించి టపాకి పది ఇష్టాలు దాటటం గగనమై పోయింది. కట్టమంచి వారి వ్యాసం చెప్పిన మనకి జాతి అభిమానం లేదు, కులాభిమానం స్వాభిమానం తప్ప అనే అభిప్రాయాన్ని ఎవరూ చదవనైనా లేదు. ఇదీ నిష్కామకర్మలా చెయాల్సిందే నని ఓ పెద్దాయన చెప్పాడు. సరే కానమ్మని, ఏమవుతుందో చూదామని ఈ కచేరీ కథనం 72 ఏళ్ళ క్రితం ఆంద్రపత్రిక 1950 ఉగాది సంచికలో వచ్చింది. వీధిలో పెడుతున్నాను ఈ లంకెలో ..

andhrapatrika-ugadi-1950-51-e0b095e0b09ae0b187e0b0b0e0b180-e0b095e0b0a5e0b0a8e0b082Download

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

కట్టమంచి రామలింగారెడ్డి గారి నైశిత్యం- భజన కూటములు

10 మంగళవారం మే 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ 1 వ్యాఖ్య

మతాల చరిత్రని రెండుగా విభజించ వచ్చు. తొలి మతాలు మలి మతాలు అని లోగడ నేను విభజించుకున్నాను. మరింత స్పష్టత కోసం వ్యవస్థీకృతమయే పరిణామ దశలోవి తొలి మతాలు అంటున్నాను. వ్యవస్థీకరించటంతోనే ఆరంభమయేవి మలి మతాలు. ఈ తొలి మతాలలో ఉండే సాధారణ లక్షణం అనేక మంది నమ్మకాలనూ, ఆరాధనా పద్దతులనూ, సంస్కృతులనూ కలుపుకోటం. మలిమతాల పుట్టుక తొలిమతాల అవలక్షణాల మీద తిరుగుబాటుతోనే సాధారణంగా జరుగింది. ఒక దేవుడు, లేదా దైవ ప్రతినిధి, అతను చెప్పాడని చెప్పే గ్రంధం, నిజమైన దేవుడనే భావన మలి మతాల వ్యవస్థీకృతతకి సాధారణ చిహ్నాలు. చర్చి వంటివి వాటి వ్యవస్థీకరణని పటిష్టం చెయ్యటానికి పుట్టాయి. ఈనాడు హిందూమతం అనేపేరున స్థిరపడినది తొలిమతాలలో ఒకటి అనవచ్చు. పరిణామం, మార్పు అనేవి ఏ రకమైన మతానికైనా అనివార్యం. మార్పు పట్ల కొంతైనా సుముఖత వీటికి ఉంటుంది. మార్పు పట్ల ఎక్కువ విముఖత మలి మతాల లక్షణం. హిందూమత పరిణామములో భజనకూటముల ప్రాముఖ్యత అనే వ్యాసం1930 జనవరి సమదర్శని లో కట్టమంచివారు ప్రచురించారు. ఈ కోణంలో నేను మరో వ్యాసం చదివిన గుర్తు లేదు. హిందువులలో జాతీయతా భావము ప్రాశ్చాత్యులలో వలె లేదని అందఱుని ఎఱుంగుదురు అంటారు కట్టమంచి వారు. ఇది నాకు నిజమే అనిపిస్తుంది. ఒకే క్రైస్తవంలో అనేక జాతులు ఉండటమనే పరిస్థితి ప్రాశ్చాత్యలది. వారి దృష్టికోణం జాతుల కేంద్రకం. జాతి రాజ్యాలు అక్కడ చాలాకాలంగా ఉన్నాయి. దానివలనే జాతి అనే భావన అక్కడ ప్రముఖపాత్ర వహించింది. మన రాజకీయకూటములు రాజు కేంద్రకాలు కాని భాష వంటి జాతి లక్షణ కేంద్రకాలు కావు. కట్టమంచి వారి పరిశీలనా నైశిత్యం కోసం, మన గురించి మన ఆలోచనలలో ఒక నూతన కోణం కోసం ఈ వ్యాసం చదవాలి.

samadarshini_1930_01_01_-e0b095e0b09fe0b18de0b09fe0b0aee0b082e0b09ae0b0bfDownload

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

రుష్యా, జర్మనీ, పోర్చుగల్ సామెతలు

03 మంగళవారం మే 2022

Posted by వివిన మూర్తి in Uncategorized

≈ వ్యాఖ్యానించండి

సామెతలు ఒక ప్రాంతపు సామాజిక, సాంస్కృతిక జీవితాల నుంచి పుట్టి ఒక తరం మరో తరానికి మౌఖికంగా అందించిన అనుభవ సంపద. ఈ రోజు టపాలో రుష్యా, జర్మనీ, పోర్చుగల్ సామెతలు కొన్ని అందిస్తున్నాను. ఇవి 1939 ఫిబ్రవరి హిందూసుందరి పత్రికలో ప్రచురితం. ఈ లంకెలో

hindu_sundari_1939_02_0-sameyhaluDownload

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: