ఓపెన్ హీమర్ అణుబాంబు నిర్మాత. ఇటీవలే ఆ సినిమా చూసాను. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యవస్థ ఉంది. ఈ బాంబు నిర్మాత ఎవరనేది నా ప్రశ్న. 1991లో విపుల నాకథ అఖండదృష్టి అనే పేరుతో ప్రచురించింది. దానికి నేను పెట్టిన పేరు పరుగు(race). కోల్డ్ వార్ ఆరంభించిన పరుగు అన్నది నా భావన. ప్రసాదరావు గారు పేరు మార్చి కథ చివర రెండు పేరాలు చేర్చారు. అణుశక్తిని శాంతికోసం వాడవచ్చనే వారి అభిప్రాయాన్ని చేర్చారు. భవిష్యషత్తరాలు ఈ సామూహిక మారణాయుధాలను తరిమేస్తాయని చెప్పటంతో నా కథ ముగించాను. సరే సంపాదకులతో నా సమస్యలు గొడవలు అదో గ్రంథం తొలికథతోనే ఆరంభం. అదంకతా పిడకల వేట. ఓపెన్ హీమర్ సినిమాలో ఒక ప్రత్యేక వ్యక్తి మానసిక స్థితినీ, అగ్రరాజ్యాల అదుపులేని నక్షత్రయుద్ధ పరుగు కాంక్షనీ ఇందులో సృశించాడు. అది సమర్ధవంతంగానూ , అర్ధవంతంగానూ ఉంది. అది ప్రత్యేక దృష్టి (specific). మానవుని ఉమ్మడిమానవుని ప్రవృత్తి ఏమిటి? inventions( కల్పనలు) discoveries(అన్వేషణల ) చేసేది వ్యక్తా? సమూహమా? ఆ చేయటం వల్లనే మానవ ప్రస్థానం నడుస్తోంది. వ్యక్తి జిజ్ఞాసది ప్రధానపాత్రే. కాని వివేచన? ఆ జిజ్ఞాసని నడిపేది అహమేనా? ఈ ప్రశ్నల నుంచి పుట్టిన కథ నాది. ఆసక్తి కలవారు చదవటం కోసం, ఆలోచించగలవారు ఆలోచించటం కోసం దాన్ని నా బ్లాగ్ లో ఉంచుతున్నాను.
ఓపెన్ హీమర్
11 శుక్రవారం ఆగ 2023
Posted Uncategorized
in