ట్యాగులు
నాకు లభించిన చివరి వ్యాసం అందిస్తున్నాను. Prabuddha Andhra_1939_06_01_నైజాం-4
15 మంగళవారం మార్చి 2016
Posted పాత పత్రికలు, శ్రీపాద, Uncategorized
inట్యాగులు
నాకు లభించిన చివరి వ్యాసం అందిస్తున్నాను. Prabuddha Andhra_1939_06_01_నైజాం-4
09 బుధవారం మార్చి 2016
Posted పాత పత్రికలు, వివిన కబుర్లు, శ్రీపాద
inగాంధీగారి కాంగ్రెస్సు స్వతంత్రానికి ముందు ప్రచారం చేసిన కార్యక్రమాలలో- అస్పృశ్యుల దేవాలయ ప్రవేశం- ఒకటి. అంతకుముందే గురజాడ, బంకుపల్లి మల్లయ్యశాస్త్రి వంటి ఇంకా ఎందరో సంస్కరణ వాదులు మానవతా దృక్పధంతో అస్వృసేయ సమస్యపట్ల స్వందించారు. ఇంకా వెనక్కి వెళ్తే రామానుజుడూ, వీరశైవులూ ఈ అమానవీయ కట్టుబాట్లపై స్పందించారు. ఉద్యమాలు నడిపారు. గాంధి గారి -అస్పృశ్యుల దేవాలయ ప్రవేశం పుట్టుక, పరిణామం పరిశీలించగలవారికి దానిలో ఉండే రాజకీయాలు కూడా అందుతాయి.. 75 ఏళ్ల క్రితం దానిపై శ్రీపాద వేసిన ప్రశ్నలు- స్వతంత్రోద్యమం ఉరవడిలో, కాంగ్రెస్సు ప్రచారంలో- ఒక పక్కకు ఉండిపోయాయి. ఈనాడు మతం పేరుపెట్టుకున్న రాజకీయపక్షం పాలనలో ఉన్నాం మనం. నిజంగా వారికి మతం కావాలో, పాలనాధికారం కావాలో, అందులో దేనికోసం ఏదికావాలో తెలీని స్థితిలో ఆలోచనాపరులున్నారు. మతాన్ని ఒకలా వాడుకున్న గాంధి కాంగ్రెస్సు ఈనాడున్న కాంగ్రెస్సూ ఒకటేనా? ఆనాటి హిందూ మహాసభ ఈనాటి భాజపా ఒకటేనా? ఆనాడు ఒక నిజాయితీగల ఆలోచనాపరుడు వేసిన ప్రశ్నలు ఎలా మరుగున పడిపోయాయో ఈనాడూ వర్తమాన సంబంధిత ప్రశ్నలూ ప్రశ్నలూ మరుగున పడిపోతున్నాయా? ఈ ప్రశ్నలతో ఈవ్యాసం చదవండి.. నేడు వివేచన ఆవశ్యకతని గుర్తించండి. అందుకు ఈ ప్రశ్నలు – ఇలాంటి ప్రశ్నలు వెయ్యగల సత్తా కోసం- ఆలోచించండని కోరుతూ..Prabuddha Andhra_1939_08_దేవాలయప్రవేశం
08 మంగళవారం మార్చి 2016
Posted పాత పత్రికలు, శ్రీపాద
inట్యాగులు
లోగడ 2వ్యాసాలు నైజాం రాష్ట్రంపై శ్రీపాద రాసినవి అందించాను. ఇది వాటిలో మూడవది.
03 గురువారం మార్చి 2016
Posted పాత పత్రికలు, శ్రీపాద
inనేనిప్పుడు శ్రీపాద పుస్తకం పనిలో పూర్తిగా మునిగిపోయివున్నాను. ఆరువేల పుటల పైగా మేం సేకరించగలిగిన శ్రీపాద రచనలని ఇంత క్షుణ్ణంగా చదివే అవకాశం నా 68వ ఏట నైనా నాకు లభించింది. ఆయన ఆత్మకథ, కథలు, నవలలు తప్ప ఆయన వ్యాసాలు నేను చదవలేదు. సామాజిక విషయాలపై ఆయన అభిప్రాయాలతో నాకు కొంత అనంగీకారం ఉన్నా ఆయన హేతుబద్ధత, తార్కికత అన్నింటికీ మించిని నజాయితీ, నిర్భీకత అవగతం అవుతున్న కొద్దీ, నా ఆలోచనలకు పదును పెడుతున్నకొద్దీ నాకు కొన్ని ప్రశ్నలు కలుగుతున్నాయి. ఆయన సమకాలీన ప్రసిద్ధ రచయితలను స్వంతం చేసుకున్నట్టు – జాతి, ఆంధ్రజాతి, తెలుగు జాతి అంటూ వారిని ఏకం చెయ్యటానికీ, ఒక జాతి అన్న భావన కలిగించటానికీ జీవితాంతమూ యావచ్ఛక్తులూ వినియోగించిన శ్రీపాదను – ఎందుకు స్వంతం చేసుకోలేదు? ఈనాటి సమాజంలో, సాహిత్యంలో తాను నమ్మినదానిని ఇంత నిజాయితీగా చెప్పేవారున్నారా? కథల మాటున, కవితల మాటున మనసులోని భావాలు చెప్పుకోటానికి కూడా సాటిజనమే కత్తులు పట్టుకు కళ్లెగరేస్తున్నపుడు ప్రజాస్వామిక చర్చకి అవకాశం ఈసమాజంలో లభిస్తుందా? మద్యపానంపై వారి ఈ వ్యాసాన్ని చదవండి. శ్రీపాద వస్తునిష్టకి ఇది ఒక మచ్చు .
నేనిలా శ్రీపాద రచనలు అందివ్వటం బోరుగా ఉందా?
02 బుధవారం మార్చి 2016
Posted పాత పత్రికలు, శ్రీపాద
inమన దేశ పరిణామంలో పుట్టి, మందు కనిపించకండా, వున్న వ్యాధి కుల వ్యవస్థ. దానికి శిఖరాయమానమైన జాడ్యం అస్వృస్యత. దానికి గురయిన మేథావీ, విద్యావేత్త, పండితుడు అంబేద్కరు అన్న ప్రసిద్ధ వాక్యం నేను హిందువుగా చనిపోను. దానిపై 1935నవంబరు ప్రబుద్ధాంధ్ర మైసపత్రికలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రాసిన వ్యాఖ్యానం ఈనాడు మనం చదవాలని నా కోరిక. నాలిక చివరి మాటలు
01 మంగళవారం మార్చి 2016
Posted పాత పత్రికలు, శ్రీపాద, Uncategorized
inభావకవిత్వం ఎచ్చుగా వున్న రోజులలో ఈరకం ప్రశ్నకి కవులు చెప్పిన జవాబు పాఠకులు అర్ధం చేసుకోవాలన., అలా అర్ధం చేసుకునే శక్తి సంపాదించుకోవాలన్న సూచన, ఆశ కూడా ఇందులో గర్భితమై ఉన్నాయి. నేటి కవులు(కొందరు కథకులు కూడా) ఈ ప్రశ్నకి ఏం జవాబు ఇస్తారు? చర్చని కోరుతూ శ్రీపాద వారి వ్యాసాన్ని అందిస్తున్నాను.kaviulu -Prabuddha Andhra_1935_07
27 శనివారం ఫిబ్ర 2016
Posted పాత పత్రికలు, శ్రీపాద
inట్యాగులు
తెలంగాణా రచయితల సంఘం 2వ వార్షికోత్సవం 1956లో జరిగింది. కథకుల గోష్టి ప్రారంబోపన్యాసం చేసారు శ్రీపాద. దానిని స్రవంతి పత్రిక 1956 అక్టోబరులో ప్రచురించింది. కథ యొక్క స్వస్వరూపంపై వారి వివరణ ఇందులో చూడండి.1067 sreepada telangana rachayitala Sravanti_1956_10_01_Volume No 03_Issue No 07_104 P_Katha Nilayam
24 బుధవారం ఫిబ్ర 2016
Posted పాత పత్రికలు, శ్రీపాద
inట్యాగులు
నార్ల, పింగళి, బలిజేపల్లి, భమిడిపాటి, మల్లాది, రాజమన్నార్, శ్రీపాద, సముద్రాల
తెలుగు సాహిత్యంలో నాటకం, నవల ఎదగవలసినంతగా ఎదగలేదని వింటుంటాం. అది ఎంతవరకూ సత్యమో తెలియదు గాని నాటకం ఎందుకు రాసారు, ఇటీవల వచ్చిన మార్పులేమిటి అంటూ 1947 దసరా కార్యక్రమంగా ఆలిండియా రేడియో మద్రాసు వారు ఆనాటి నాటక రచయితలను ప్రశ్నించారు. నార్ల వెంకటేశ్వరరావు, పింగళి నాగేంద్రరావు, బలిజేపల్లి, పి.వి. రాజమన్నార్, సముద్రాల, మల్లాది అవధాని, శ్రీపాద ఇందులో ప్రసంగించారు. ఆ ప్రసంగాలను భారతి 1947 డిసెంబరు సంచికలో ప్రచురించింది. నాటకంలో ఆసక్తి గలవారు ఈ వ్యాసం చదవగలరు.1059 Natakarachana ……_Bharathi_1947_12_01_Volume_No_24_Issue_No_12
17 బుధవారం ఫిబ్ర 2016
Posted పాత పత్రికలు, శ్రీపాద
inశ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ఆంధ్రశిల్పి నవంబరు 1946 సంచికలో రాసిన ఈ వ్యాసం మన దేశంలోని పరిస్థితిపై చాలా మౌలికమైన ప్రశ్నలు కలిగిస్తుంది. తప్పక చదవండి.
11 గురువారం ఫిబ్ర 2016
Posted ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు, శ్రీపాద
inశ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు నడిపిన ప్రబుద్ధాంధ్రలో 1939 ఫిబ్రవరి, జనవరి మాసాలలో వారు రాసి ప్రచురించిన రెండు వ్యాసాలు ఈటపాలో పెడుతున్నాను. ఇవి నైజాంలో నున్న ఆంధ్రుల గురించి సేకరించిన అనేక వివరాలతో రాసిన ఈ వ్యాసాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కథకునిగా మాత్రమే పేరున్న శ్రీపాద సమాచార సేకరణ, వివరణా, అభిప్రాయాలూ గమనించితే సామాజికవిషయాలపై ఆయన చూపిన శ్రద్ధ తెలుస్తుంది. ఆనాటి చరిత్రని వీరి వ్యాసాలు అనేక కోణాలలో చూపిస్తాయి. మా మనసు బృందం సిద్ధం చేస్తున్న శ్రీపాద లభ్యరచనల సర్వస్వం ఆయననే కాక స్వాతంత్ర్యోద్యంమాన్ని స్వంతదృష్టితో సూక్ష్మస్థాయిలో చూపిస్తుంది. తప్పక చదవవలసిన అనేకవ్యాసాలు ఇందులో సంపుటీకరించబడుతున్నాయి. నైజాం పై వ్యాసాలు ఈ లంకెలో చూడగలరు.1048 Prabudhandhra 1939 feb nijamu rashtramu 1049 Prabudhandhra 1939 march nijam rashtramlo