• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Category Archives: ఇతరుల వ్యాసాలు

నైజాం రాష్ట్రంపై శ్రీపాద వ్యాసాలు 1939లో

11 గురువారం ఫిబ్ర 2016

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు, శ్రీపాద

≈ వ్యాఖ్యానించండి

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు నడిపిన ప్రబుద్ధాంధ్రలో 1939 ఫిబ్రవరి, జనవరి మాసాలలో వారు రాసి ప్రచురించిన రెండు వ్యాసాలు ఈటపాలో పెడుతున్నాను. ఇవి నైజాంలో నున్న ఆంధ్రుల గురించి సేకరించిన అనేక వివరాలతో రాసిన ఈ వ్యాసాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కథకునిగా మాత్రమే పేరున్న శ్రీపాద సమాచార సేకరణ, వివరణా, అభిప్రాయాలూ గమనించితే సామాజికవిషయాలపై ఆయన చూపిన శ్రద్ధ తెలుస్తుంది. ఆనాటి చరిత్రని వీరి వ్యాసాలు అనేక కోణాలలో చూపిస్తాయి. మా మనసు బృందం సిద్ధం చేస్తున్న శ్రీపాద లభ్యరచనల సర్వస్వం ఆయననే కాక స్వాతంత్ర్యోద్యంమాన్ని స్వంతదృష్టితో సూక్ష్మస్థాయిలో చూపిస్తుంది. తప్పక చదవవలసిన అనేకవ్యాసాలు ఇందులో సంపుటీకరించబడుతున్నాయి. నైజాం పై వ్యాసాలు ఈ లంకెలో చూడగలరు.1048 Prabudhandhra 1939 feb nijamu rashtramu 1049 Prabudhandhra 1939 march nijam rashtramlo

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

అవైదిక మతాలు – పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి గారు

06 శనివారం ఫిబ్ర 2016

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ వ్యాఖ్యానించండి

religion అనే ఆంగ్లపదాన్ని మతము అనే పదంగా అనువదించుకుంటున్నాం. ఇది దాదాపు వాడికలో స్థిరపడింది. కాకపోతే మతము అంటే అభిప్రాయము అని చాలా నిఘంటువులు చెపుతాయి. ప్రాచీనవాజ్ఞయంలో ఆ అర్ధంలోనే ఈ పదం హెచ్చుగా వాడబడింది. The belief in and worship of a superhuman controlling power, especially a personal God orgods: అనీ A particular system of faith and worship: అనీ ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ నిర్వచిస్తుంది. Religion ప్రధానంగా విశ్వాసమూ, ఆరాధనా అన్నది సూచిస్తుంది. మన ప్రాచీన చింతనలో ప్రధాన విభాగం వేదాల ప్రామాణికత. వేద ప్రమాణాన్ని అంగీకరించని అనేక మతాలు అంటే అభిప్రాయాలను పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి గారు ఈ వ్యాసంలో స్థూలంగా పరిచయం చేసారు. వీటిగురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకునేవారు సాయణ మాధవాచార్యుల సర్వదర్శన సార సంగ్రహాన్ని- పుల్లెల రామచంద్రుడు గారు సులభమైన తెలుగులోకి అనువదించారు- చదవవచ్చు. ఈ వ్యాసాన్ని చదవమని కోరుతూ ఈ లంకెలో అందిస్తున్నాను.REDDY_RANI_1929_02_ అవైదిక మతాలు

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

అస్పృశ్యత – ప్రబుద్ధాంధ్ర జూన్ 1934

04 గురువారం ఫిబ్ర 2016

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు, వివిన కబుర్లు, శ్రీపాద

≈ వ్యాఖ్యానించండి

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ప్రబుద్ధాంధ్ర పత్రిక నడిపారని చాలా మందికి తెలుసు. ఆ పత్రిక 1934 జూన్ సంచికలో వచ్చిన ఈ రచనని ఈరోజు టపాలో అందిస్తున్నాను. రచయిత భువనగిరి లక్ష్మీకాంతమ్మ గారు. 71 సంవత్సరాల నాటి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా పల్లెటూళ్లలో మార్పు వచ్చింది. ఈమార్పు ఆశించినంత వచ్చిందా అన్నది వేరే చర్చ. పట్నాలలో కొత్తతరహా ప్రచ్ఛన్న అస్పృశ్యత ఫలితాలు నేడు మనం అనుభవిస్తున్నాం. దీనికి మన కుల నాయకుల రాజకీయాలెంత కారణమో, మన రాజకీయనాయకుల కుల సమీకరణాలు ఎంత కారణమో తేల్చుకోవలసిన బాధ్యత ఈ తరంమీద ఉంది. సాంఘిక సంస్కారావశ్యకతని పూర్తిగా వదిలేసి, భౌతికాభివృద్ది ఆశలను కేంద్రం చేసుకున్న రాజకీయవ్యాపారుల దండోరాలో మన జాతి నాయకుల లేమితో మనం ఇలావున్నాం. కొంతైనా బాధ్యత వహించవలసిన సాహిత్యం కొత్త వస్తువులకోసం కృత్రిమంగా పుట్టించబడిన పోటీలో వ్యక్తి సంస్కారం కోసం అలమటించటం మానేసింది. కృతక స్పందనలతో, పరుషపదాలతో, ఆక్షేపణలతో ఎదిరిని రెచ్చగొట్టే సాహిత్యం వ్యక్తి సంస్కారానికి, వివేచనకీ దోహదం చెయ్యలేదు. 71 ఏళ్ల నాటి ఈ రచన చదివినపుడు మన సమాజం, సాహిత్యం రావలసిన మార్పులను త్వరితం చెయ్యటానికి బదులు తప్పుదోవ పట్టించాయని లేదా పట్టించుకోటం లేదనీ అనిపించింది. లేకపోతే రోహిత్ వేముల హత్య- ప్రతి ఆత్మహత్య వెనకా కనీకనిపించని సామాజిక కారణం ఉంటుందన్నది వాస్తవం- జరిగేదా? ఈ లంకెలో ఈ రచన తీసుకోండి. PRABUDDHA_ANDHRA_1934_06_అస్పృశ్యత

≈ 1 వ్యాఖ్య

కుమతీ శతకం

02 మంగళవారం ఫిబ్ర 2016

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు

≈ 3 వ్యాఖ్యలు

ట్యాగులు

పరిశోధన

ఈరోజు ఒక అపూర్వమైన గ్రంధాన్ని మీకు అందజేస్తున్నాను. ఇది ఎందుకు రాయబడిందీ నేను వేరేగా చెప్పనవసరం లేదు. చదవండి. మన చదువుల గూర్చి ఆలోచించండి.kumathi1

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

1945లో హైదరాబాద్ తెలుగు కథకులు

25 గురువారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ 1 వ్యాఖ్య

ట్యాగులు

తెలంగాణా కథకులు

తెలుగుతల్లి 1945 జనవరి సంచికలో మానేపల్లి తాతాచార్య రాసిన వ్యాసం ఈరోజు ఈలంకెలో చూడగలరు. Telugutalli Jan 1945hyd

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

తెలుగు పత్రికల స్థితిలో 85 ఏళ్లలో మార్పువచ్చిందా?

19 శుక్రవారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ 1 వ్యాఖ్య

ట్యాగులు

తెలుగు పత్రికలు

క్రొవ్విడి లింగరాజు గారి ఈ వ్యాసం చూస్తే కలిగిన ప్రశ్న ఇది. SAMADARSHINI_1930_01_01krovvidi

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

తెలుగు జాతి తొలి ఎన్ సైక్లోపీడియా – పాల్కురికి

18 గురువారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ 1 వ్యాఖ్య

ట్యాగులు

తిమ్మావజ్ఝల కోదండరామయ్య

తిమ్మావజ్ఝల కోదండరామయ్య గారు రాసిన ఈ వ్యాసం పాల్కురికి వారి ప్రతిభని, విశాల ఆలోచనని తెలియబరుస్తుంది. తప్పక చదివి తీరవలసిన వ్యాసం. PARISHODHANA_1955_08_encyclopedia

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

భండారు అచ్చమాంబ- కొమర్రాజు లక్ష్మణరావు

14 ఆదివారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ 1 వ్యాఖ్య

ట్యాగులు

కొమర్రాజు లక్ష్మణరావు, భండారు అచ్చమాంబ

రాయసం వెంకటశివుడు గారు కొమర్రాజు వారి జ్ఞాపకాలతో రాసిన ఈ వ్యాసంలో అచ్చమాంబ గారి గురించి కూడా చాలా విషయాలున్నాయి. ఈ లంకెలో చూడగలరు.Telugutalli Oct 1944 bhandaru

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

విచిత్ర పంచాంగం 1935

10 బుధవారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల వ్యాసాలు, పాత పత్రికలు

≈ 1 వ్యాఖ్య

ఈరోజు టీవీలన్నింటా మంచి తిధులూ, శుభలగ్నాలూ.. జ్యోతిష్యాలూ.. లగ్నబలాలూ..!! పత్రికలే మాధ్యమంగా ఉన్న రోజులలో వారఫలాలు ప్రచురించటానికి కొంచె సంకోచించేవారు..!!  హేతువాద భావాలు మనదేశంలో చాలా మార్పులు తెస్తాయనీ, వ్యక్తుల అభివృద్ధి వారి ఆలోచనల అభివృద్ధిగా విద్యావంతులలో చాలామంది భావించిన రోజులవి. 1935 అంటే 80 సంవత్సరాల క్రితం రాసిన ఈ పంచాంగం చూస్తే మనజాతిలో వచ్చిన మార్పులు ఎన్నో గుర్తు వచ్చాయి. బౌద్ధికాభివృద్ధి కేవలం భౌతికాభివృద్ధికీ అది లభించటంకోసం పరుగుపందాలకీ అందులో విజయాలకు అన్ని విలువలనీ, ఆత్మనమ్మకాన్నీ కోల్పోటానికీ పరిమిత మయిపోయాం.. ఈ  సరదా పంచాగం సరదాగానే చదువుతూ ఈ 80 ఏళ్లలో మనం మానసికంగా చేరుకున్న దోవ గురించి క్షణంపాటు ఆలోచిద్దాం.. ANDHRA_VIDHYARDHI_1935_01_01vichitra panchangam

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…
← Older posts

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: