• About

వివిన మూర్తి వెదుకులాట

~ సాహిత్యమూ జీవితమే

వివిన మూర్తి వెదుకులాట

Category Archives: ఇతరుల కథలు

మంజీరతో నా సంబంధం వారి కథలు 1

11 ఆదివారం మార్చి 2018

Posted by వివిన మూర్తి in ఇతరుల కథలు, వివిన కబుర్లు

≈ వ్యాఖ్యానించండి

మంజీర కలంపేరుతో 1958-59లలో భారతి, ఆంధ్రపత్రికలలో పది కథలు రాసారు ఎమ్జీ రావు అనే ఆయన. వీరి పూర్తిపేరు మంచికంటి గున్నారావు. వీరు మధ్యప్రదేశ్ నైన్పూర్లో రైల్వేలో పనిచేస్తుండే కాలంలో పురాణం సుబ్రహ్మణ్యశర్మ వీరికి మిత్రుడు. వీరితో మూడవ మిత్రుడు ఆర్.ఎమ్. రావు గారు. మృత్యంజయరావు గారని గుర్తు. పురాణం తమ ముగ్గురి మీద ఒక నవల రాసారు. వీరు అక్కడ నుంచి జ్వాల అనే పేరిట ఓ కథాసంకలనం 1956లో తీసుకువచ్చారు. 1926లో పుట్టిన గున్నారావు గారు రెండురోజుల క్రితం 92వ ఏట మరణించారు. వీరు మా నాన్నగారికి మేనమామ కొడుకు. 1967లో ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాదు చేరినపుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. ఉద్యోగం రాలేదు గాని నా జీవితంలోకి కమ్యూనిజం వచ్చింది. 65లో రైల్వే జనరల్ స్ట్రైక్ జరిగినపుడు మంజీర కమ్యటనిస్టుగా ట్రేడ్ యూనియన్ కార్యకలాపంలో జైలులో ఉంచారని గుర్తు. శిక్షగా గార్డు నుంచి క్లర్కుగా డిప్రమోట్ చేసారు. వారి ద్వారానే నాకు కమ్యూనిజంతో పరిచయం జరిగింది. మొదటి సంవత్సరం వరకూ కమ్యూనిజం అనేది ఒక ప్రకృతి విరుద్ధమైన ఆదర్శంగా ఆయనతో వాదించేవాడిని. భావించేవాడిని. అసమానత అనేది ప్రకృతి సహజమైనదనేవాడిని. తరవాత ఆయన కాపిటల్ గురించి చెప్పి చదవమన్నారు. అయిదువేళ్లూ ఒకటి కావనే వాదన ఆరోజులలో చాలామంది వాడేవారు. క్రమంగా నేను నా వ్యక్తిగత జీవితంలో ఆకలి, నిరుద్యోగం, పేదరికం వల్ల కలిగే అవమానాలు అనుభవించుతూ కమ్యూనిజం వైపు ఆకర్షితుడయాను. పునాది -ఉపరితలం అవగాహన నా బౌద్ధిక జీవితానికి ఈనాటి వరకూ ఆలంబనగా ఉంది. దీనికి తొలి గురువు మంజీర గారు. సమాజ పరివర్తనలో లేదా పెనుమార్పులో సాహిత్యం యెక్క పాత్ర పట్ల చిన్నచూపు నా స్వంతమేగాని వీరికి దానిపట్ల కొంత గురి ఉండేది. ఆంగ్ల సాహిత్యం బాగా చదువుకున్న రావు గారు నవల అనేది ఎలా ఉంటుందో చెప్పాలన్న ఆలోచనతో సుమారు 5వేల పేజీల నవల మహాయానం రాసారు. దానిని ముద్రించాలన్న ఆశ తీరలేదు. కథానవీన్ తరవాత మనసు రాయుడు గారి వంటి వారిద్వారా నా సిగ్గుబిడియాలు విడిచి కొంత ప్రయత్నం చేసాను. ఫలించలేదు. ఎవరినీ ఏనాడూ ఏదీ అభ్యర్థించరాదన్న  వెర్రి నియమం నాది. సాహిత్యమే ఒక పనికిమాలిన వ్యవహారం.. దానికోసం ఆత్మాభిమానం చంపుకోవటంగా అనిపించుతుంది. ఈజాడ్యం నాకు చాలా చిన్నితనంలో పట్టింది. దీనివల్లనే నేనూ నా సాహిత్యం కూడా మహాయానంలాగే తొందరగా కాలగర్భంలో కలిసిపోటం తప్పదు.

పోతే రావుగారు నాచేత చాలా పుస్తకాలు చదివించారు. అందులో కురుగంటి సీతారామయ్య గారి నవ్యాంధ్ర సాహితీవీధులు బాగా గుర్తు.(పేర్లు తప్పు కావచ్చు.) డోస్టోవిస్కీ నేరమూ శిక్ష నా జీవితాన్ని ప్రభావితం చేసిన మొదటి పుస్తకం వారే నాకు ఇచ్చారు. సాంప్రదాయం అలవాటు అనేవాటి సంబంధం గురించి వారి వివరణ నా ఆలోచనలలో కలకాలం నిలిచినది. అలాగే ఫలానీది చదవరాదనేది తప్పు. చదివి నీ అభిప్రాయం నువ్వు ఏర్పరచుకోవాలన్నది వారి నుంచే నేను నేర్చాను. కమ్యూనిస్టులు అలాంటి నిషిధ్దాలు చెయ్యటం వారికి నచ్చేది కాదు. ప్రభుత్వం ఆపని చెయ్యరాదనేవారు తాము ఆపని ఎందుకు చేస్తారనేది వారి ఆలోచన. సెక్సుతో సహా ప్రతిదీ చదివి అభిప్రాయం ఏర్పరచుకోవాలనీ పేరుచూసి నిర్ణయించుకోరాదనీ దానిపై అభిప్రాయం చెప్పరాదనీ  నా 19వ ఏట ఆయన చెప్పిన విషయం నాకు ఇప్పటికీ అనుసరణీయమే. ఆ తర్వాత దరిశ చెంచయ్య గారి నేనూ నా దేశం నన్ను పూర్తిగా తీర్చిదిద్దిన పుస్తకం. ఇది మంజీర గారు ఇవ్వలేదనే గుర్తు. వారితో నేను నా ఫార్మేషన్ దశలో తప్ప ఎక్కువగా గడపింది లేదు. విశాలాంధ్ర వారు వందేళ్ల తెలుగుకథలో వారి కథ చేర్చటం నాకు ఆనందం కలిగించింది. అది నా రికమండేషనా అని ఫోన్ చేసారు. మావయ్య గారూ నాకే సంబంధం లేదు అని చెప్పాను. ఒక్క కూతురు లండన్లో ఉంటోంది. చివరిరోజులలో నర్సమ్మూర్తీ ఓమారు రావోయ్ అని ఆరునెలల క్రితం ఫోన్ చేసారు. వెళ్లలేకపోయాను. పనిగట్టుకుని చెయ్యవలసినవెన్నో చేయలేకపోయాను.  హైదరాబాదు వెళ్లినపుడల్లా విద్యానగర్లో వారింటికి వెళ్లేవాడిని. మనసులో సొదంతా ఈ ఫేస్బుక్కు అనే సంతలో ఉంచుతున్నాను. నా ఫీలింగ్స్ కోసం రేపటి నుంచి ఆయన కథలు నా బ్లాగులో ఉంచుతున్నాను. ఈలంకెను పూర్తిగా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి gotoపై క్లిక్ చేయండి.  http://kathanilayam.com/story/19200

 

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

పానుగంటి వారి స్వప్నకావ్యము – విశ్వనాథ విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు

07 ఆదివారం జూన్ 2015

Posted by వివిన మూర్తి in ఇతరుల కథలు, పాత పత్రికలు

≈ 1 వ్యాఖ్య

ట్యాగులు

పానుగంటి లక్ష్మీనరసింహారావు

1918లో ఆంధ్రసేవ అనే పత్రికలో పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు స్వప్నకావ్యము అనే పెద్ద కథ రాసారు.  ఈ కథ చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు గుర్తొచ్చింది. ఆసక్తి గలవారి కోసం ఈరోజు ఆ కథ అందిస్తున్నాను. ANDHRA_SEVA_1918_03_01panuganti full

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

yagnam – kara

24 బుధవారం సెప్టెం 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల కథలు, పాత పత్రికలు

≈ 2 వ్యాఖ్యలు

ట్యాగులు

కారా, కాళీపట్నం, kalipatnam

చాలామంది మంది యువమిత్రులు యజ్ఞం చదవాలని, మరోమారు చదవాలని  కొందరు అంటున్నారు. ఆ కథ చదవటానికి వీలుగా ఇక్కడ అందిస్తున్నాను.

yagnam

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

bapu as short-story writer 2

06 శనివారం సెప్టెం 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల కథలు, పాత పత్రికలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

బాపు, bapu

కథలను బొమ్మలకు కుదించే కథకుడు బాపూ బొమ్మలను కథలకు పెంచే చిత్రకారుడిగా  ఎలా ఉంటారన్న ఆలోచన ఎప్పుడో అప్పుడు కథకులందరికీ కలుగుతుంది గదా.. దానికి సమాధానంగా బాపు కథలు మూడు లభిస్తున్నాయి. నిన్న ఇచ్చిన అమ్మ-బొమ్మ జపానీస్ కథ ఆధారం. ఈ కథ మబ్బూ వానా మల్లె వాసనా ఆయన స్వంతం. ఈ కథ బాపూ గారికి రాజాలక్ష్మీ ఫౌండేషన్  వారి పురస్కారం సందర్భంగా 3 డిసెంబరు 82 ఆంధ్రజ్యోతిలో పునఃప్రచురణ జరిగింది. 1994 ఫిబ్రవరి రచన సంచికలో తిరిగి ప్రచురించారు.1995లో భాపు రమణలు కలిపి ప్రచురించిన బొమ్మ-బోరుసు కథా సంపుటంలో దీనిని చేర్చారు.  ANDHRA_PATRIKA_1957_08_28 bapu3

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

bapu as short-story writer 1

05 శుక్రవారం సెప్టెం 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల కథలు, పాత పత్రికలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

బాపు, bapu

కథానిలయం సేకరణ మేరకు బాపు గారి పేరిట 3 కథలున్నాయి. ఆ మూడు కథలూ వరసగా అందిస్తున్నాను. తొలి కథ అమ్మ-బొమ్మ ఈ లంకెలో లభిస్తుంది. 1995లో భాపు రమణలు కలిపి ప్రచురించిన బొమ్మ-బోరుసు కథా సంపుటంలో దీనిని చేర్చారు.  ANDHRA_PATRIKA_1959_12_16_bapu2

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

1951 WORLD SHORT-STORY COMPETITION GALIVANA

12 మంగళవారం ఆగ 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల కథలు, పాత పత్రికలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

పాలగుమ్మి పద్మరాజు, world short-story

గాలివాన కథ కి అన్నింటిలోనూ రెండవ బహుమతి రావటం ఓ తమాషా. ఆ కథని ఇక్కడ అందిస్తున్నాను.ANDHRAPATRIKA_1951_05_13 GALIVANA

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

1951 world short-story competition international story 4

10 ఆదివారం ఆగ 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల కథలు, పాత పత్రికలు

≈ 3 వ్యాఖ్యలు

ట్యాగులు

french -short-story, world short-story

అఁతర్జాతీయ కథానికల పోటీలో ప్రధమబహుమతి పొందిన నాలుగవ కథ తెలుగు పేరు ఎందుకనీ. రచయిత ఫ్రాన్స్ దేశస్తురాలు అనీ పాటోవ్. ఆకథ ఇక్కడ లభిస్తుంది. ANDHRAPATRIKA_1952_04_27 world story 4

ఈ కథాక్రమంలో చివరగా పత్రికలో పడిన గాలివాన కథ రేవు అందిస్తాను

 

 

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

1951 world short-story competition international story 3

08 శుక్రవారం ఆగ 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల కథలు, పాత పత్రికలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

france short-story, world short-story

అఁతర్జాతీయ కథానికల పోటీలో ప్రధమబహుమతి పొందిన 3వ కథ తెలుగు పేరు అయిదవరోజు. కథకుడు ఫ్రాన్స్ దేశస్తుడు పియరీ బాసన్. ఆకథ ఇక్కడ లభిస్తుంది.

ANDHRAPATRIKA_1952_04_20 world story 3

 

 

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

1951 world short-story competition international story 2

07 గురువారం ఆగ 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల కథలు, పాత పత్రికలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

norway short-story, world short-story

అఁతర్జాతీయ కథానికల పోటీలో ప్రధమబహుమతి పొందిన రెండవ కథ తెలుగు పేరు చిన్ననాటి కలలు. కథకుడు నార్వే దేశస్తుడు జోహన్ బోర్జన్. ఆకథ ఇక్కడ లభిస్తుంది.

ANDHRAPATRIKA_1952_04_13 world story 2

రచయిత వివరాలు ఇక్కడ లభిస్తాయి

http://en.wikipedia.org/wiki/Johan_Borgen

 

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…

1951 world short-story competition international story 1

05 మంగళవారం ఆగ 2014

Posted by వివిన మూర్తి in ఇతరుల కథలు, పాత పత్రికలు

≈ వ్యాఖ్యానించండి

ట్యాగులు

finland short-story, tule risanen, world short-story

1951లో జరిగిన ప్రపంచ కథల పోటీలలో ప్రధమ బహుమతి పొందిన కథలలో మొదటిది ఫిన్లాండ్ రచయిత్రి టుల్లి రైజొనెన్ కథ విద్రసంచీ. ఈ కథని ఇక్కడ చదవగలరు. ANDHRAPATRIKA_1952_04_06 world story 1

దీన్ని పంచుకోండి:

  • Tweet
  • మరిన్ని

దీన్ని మెచ్చుకోండి:

ఇష్టం వస్తోంది…
← Older posts

ఇటీవలి టపాలు

  • కావాలి వేల కలాల నిఘా
  • ప్రాచీన హిందూగ్రామ పరిపాలనము
  • గిరీశం, ఎంకి, కాంతం, పార్వతీశం
  • ప్రాశ్చాత్య జ్ఞానాన్ని భద్రపరచిన ఇస్లాం
  • అచ్చుబాటు కాని చదువు

ఇటీవలి వ్యాఖ్యలు

అచ్చుబాటు కాని చదువు పై వివిన మూర్తి
అచ్చుబాటు కాని చదువు పై jvpssoma
కట్టమంచి రామలింగారెడ్డి గారి న… పై jvpssoma
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై వివిన మూర్తి
తప్పెవరిది? శిక్ష ఎన్నెమ్మకా? పై jvpssoma

భాండాగారం

  • జూలై 2022
  • జూన్ 2022
  • మే 2022
  • ఏప్రిల్ 2022
  • మార్చి 2022
  • ఆగస్ట్ 2021
  • జూలై 2021
  • ఆగస్ట్ 2020
  • జూలై 2020
  • జూన్ 2020
  • మే 2020
  • ఫిబ్రవరి 2020
  • మార్చి 2019
  • డిసెంబర్ 2018
  • ఆగస్ట్ 2018
  • జూలై 2018
  • మే 2018
  • మార్చి 2018
  • ఆగస్ట్ 2017
  • మార్చి 2017
  • జూన్ 2016
  • మార్చి 2016
  • ఫిబ్రవరి 2016
  • డిసెంబర్ 2015
  • అక్టోబర్ 2015
  • జూలై 2015
  • జూన్ 2015
  • మే 2015
  • ఏప్రిల్ 2015
  • మార్చి 2015
  • ఫిబ్రవరి 2015
  • జనవరి 2015
  • డిసెంబర్ 2014
  • నవంబర్ 2014
  • సెప్టెంబర్ 2014
  • ఆగస్ట్ 2014
  • జూలై 2014
  • జూన్ 2014
  • ఏప్రిల్ 2014
  • మార్చి 2014
  • ఫిబ్రవరి 2014
  • జనవరి 2014
  • డిసెంబర్ 2013
  • నవంబర్ 2013
  • అక్టోబర్ 2013
  • సెప్టెంబర్ 2013
  • ఆగస్ట్ 2013
  • జూలై 2013
  • జూన్ 2013
  • మే 2013

వర్గాలు

  • ఇతరుల కథలు
  • ఇతరుల వ్యాసాలు
  • కాళీపట్నం రామారావు
  • పాత పత్రికలు
  • వి రామలక్ష్మి రచనలు
  • వివిన కబుర్లు
  • వివిన రచనలు
  • శ్రీపాద
  • సినిమా నటులు
  • Uncategorized

మెటా

  • నమోదవ్వండి
  • లోనికి ప్రవేశించండి
  • టపాల ఫీడు
  • వ్యాఖ్యల ఫీడు
  • WordPress.com

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • వివిన మూర్తి వెదుకులాట
    • మరో 36గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • వివిన మూర్తి వెదుకులాట
    • అనుకూలపరచు
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు
%d bloggers like this: