చలం స్త్రీ స్వేచ్ఛ పేరిట చాలామంది గుర్తుంచుకుంటారు. ఆయనలో అనేక చలాలు నాకు కనిపిస్తారు. అందరూ కదిలే చలాలే. కదలిక జీవలక్షణం. మార్పు జీవ లక్షణం. ఆయన అచలం కాకపోవటమే .. అంటే ఒకే ఆలోచనని అంటి పెట్టుకుని ఉండకపోవటమే.. ఇమేజిని కూడా పట్టించుకోకపోవటమే.. నాకు ఆయన పట్ల ఉండే ప్రధాన గౌరవం. ఆయనలో స్థిరంగా ఉన్న లక్షణం ఆలోచనాపరత. అది గమనించినపుడల్లా నేను ఆశ్చర్య చకితుడినవుతుంటాను. గొప్పమానవులను బొమ్మలు చేసి వారికి భజనలు చేసి వారిని చంపెయ్యటం అనే నిరంతర మానవ కార్యక్రమంలో బలైన వారిలో చలం ఒకరు. కాకపోతే ఆయనని చంపటం వల్ల రాజకీయ ప్రయోజనాలు తక్కువ కనక ఇంకా ఆయనని చదివేవారున్నారని నాకు అనిపిస్తుంది. వారు ఆయన ఆలోచనా పరత్వాన్ని చూపే ఈ వ్యాసాన్ని చదవమని అభ్యర్ధన. సమీక్ష 1950 జనవరి సంచికలో “ఎంతవరకూ విశ్వాసం” శీర్షికను వెలువడిన వ్యాసం ఈ లంకెలో