ఒకప్పుడు ఎన్నెమ్మ కథ పురటాళ్లకి చెప్పేవారు. ఈ కథ మీలో పాతతరాలకి తెలిసే ఉంటుంది. కొత్తవారు సంగతి నేను చెప్పలేను. కాకపోతే.. ఈ కథ మళ్లీ చదివినపుడు కొత్త ప్రశ్నలు కలిగాయి. కులాంతర వివాహం జరిగితే కుక్క ముట్టిన కుండ దోషం అని ఎన్నెమ్మ తీర్మానం చేసుకుంటుంది. దానికి శిక్ష ఏమిటని ఈనాడు మనం ప్రవచనకారులని అడిగినట్టు తండ్రిని అడిగింది. ఆయన దర్భపెట్టి తగలెయ్యమన్నాడు. ఆ పని చేసిందా ఇల్లాలు. తనతో సహా మొగుడినీ, పిల్లలనీ కాల్చి చంపేసింది. ఆవిడ చెయ్యాల్సిందే చేసింది కదా.. మన ప్రవచనకారుల్లాగే మొత్తం విషయం తెలుసుకోకుండా తండ్రి ధర్మాన్ని చెప్పాడు గదా.. ఆ ధర్మమూ, దాన్ని పాటించడమూ సరైనదే కదా.. భగవంతుడు ఆపని చేసినందుకు మెచ్చాలి కదా.. లేదు. ‘నువ్వు నీ పిల్లల్ని మొగుడ్నీ చంపేసావు.  ఎన్నెమ్మగా పుట్టి ఆకలితో బాధపడమంటా’డు. దీన్ని బట్టి దేముడు మంచాడు భూమ్మీద ధర్మం చెడ్డది అని అర్ధం వస్తుంది కదా.. నిజమేనా? ఏం జరిగినా ఎవరు చెప్పినా పిల్లల్ని చంపుకోకూడదని సందేశం ఉంది కదా.. నిజమేనా? అనేక ప్రశ్నలు. వాటిల్లో ఈ రెండు ప్రశ్నలు ముఖ్యం. చదివి మీరేంటంటారు? ఈ కథ చదవి చెప్పండి. 1933 మే భారతిలో ఎన్నెమ్మ కథ ఈ లంకెలో