స్త్రీల దుస్థితిని పురుషుడు బహిరంగంగా అంగీకరించటం  మన దేశంలో ఆంగ్లపాలనలో ఊపందుకుంది. దానికి విద్య ఒక పరిష్కారంగా భావించారు. కందుకూరి, రాయసం వెంకటశివుడు, సత్తిరాజు సీతారామయ్య , కొమర్రాజు లక్ష్మణరావు  వంటివారు పనిచేసారు. భండారు అచ్చమాంబ గారు ఆనాటి స్త్రీల స్థితిగురించి వ్యాసాలు రాసారు. పర్షియా దేశ పరిస్థితుల గురించి రాస్తూ విద్వాంసులు గల ఈ దేశంలో  విద్యకి స్త్రీ  అనర్హురాలనే అభిప్రాయం గురించి రాసారు. ఈ వ్యాసం 1902 మే హిందూసుందరిలోంచి ఆసక్తిగలవారి కోసం ఈ లంకె. అచ్చమాంబ1