కథానిలయం సేకరణలో లభించిన చివరికథ 7వదీ అయిన ప్రాయశ్చిత్తం అందిస్తున్నాను.

బ్రహ్మాండంగా ఉందీ అనటానికి బదులుగా ఎస్వీరంగారావులా ఉంది అనటం నా ఊతపదం. మా కుటుంబాలలో వారికీ ముఖ్యంగా మా పిల్లలకీ మనవలకీ ఆ మాట అంటే నేను ఖుషీగా ఉషారుగా ఉన్నట్టూ వాళ్లని మెచ్చుతున్నట్టూ అర్ధం. ఎంటీవోడూ నాగ్గోడూ అంటూ మా పల్లెల్లో ఆప్యాయంగా పిలుచుకునీవాళ్లం, హైస్కూలు, కాలేజిల నాటికి ఎంటీవోడి పక్షంలో చేరి 500 పేజీల పుస్తకంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పేరుపెట్టి ఆయన బొమ్మలు సేకరించి అంటించి అందరికీ చూపించి వచ్చీరాని మీసాలు తిప్పటం అవోరోజులు. నాగ్గోడి పార్టీ వాళ్లతో వాదనలు. కొట్లాటలు. కాని రంగారావు గారికి మాత్రం రెండుపక్షాలవాళ్లం అభిమానులమే. కాకినాడ మినర్వా టాకీసు పక్కసందులో అంటే పూర్ణా టాకీసుకు వెళ్లేదారిలో మా కొట్లాటలు గుర్తువస్తున్నాయి. వారిద్దరూ మంచినటులుగా మాత్రమే ఉన్న రోజులలోనే రంగారావు మహానటుడని అనుకునేవాళ్లం,

రచనాసాగరంలో రాని రావిశాస్త్రి గారి కథలనూ వీలుచూసుకుని అందిస్తాను తరవాతి ప్రయత్నంలో. అలాగే  కె.జి. సత్యమూర్తి పేరుతో ఉన్న కథలు బహుశా శివసాగర్ గారివి కావచ్చని అందిచాలనుంది.

యువ 1964 దీపావళి సంచికలోని ప్రాయశ్చిత్తం కథ అందిస్తున్నాను.యస్వీ7_1964 deepavali_1643