సాహితీ గోదారి అనే పత్రికలో ప్రచురించిన ఈ కథను ఆసక్తిగలవారి కోసం ఈ లంకెలో అందిస్తున్నాను. ఆత్మీయులు కాత్యాయని గారి కోరిక మీద ఈ పత్రికకి రాద్దామని ప్రయత్నం. దానికి వారు సంపాదకులనుకుంటాను. ఈ కథ చాలాకాలంగా 30 ఏళ్లకి పైగా నా వద్ద ఉంది. పూర్తయినా పూర్తయినట్టనిపించలేదు.  వల్లంపాటీ నేనూ  పాత్రలుగా దీనిని పూర్తిచేయటానికి ఓ ప్రయత్నం చేసాను. కవనశర్మని పాత్రగా చేర్చి కొన్నేళ్ల తరవాత మరో ప్రయత్నం చేసాను. తృప్తి కలగలేదు. చిట్టచివరికి పటేల్ విగ్రహం కడుతున్న వార్త అబ్దుల్ కలాంని గాంధీ స్థానంలో పెట్టే ప్రయత్నం గమనించాక ఈ కథ పూర్తయిందనిపించింది. పత్రికవారిని చాలా విసిగించాను. చివరికి పూర్తిచేసాను. వారు ప్రచురణకి తీసుకున్నారు. ఆసక్తి గలవారు చదవమని ప్రార్ధన.

విగ్రహాలుversion2