గాంధీగారి కాంగ్రెస్సు స్వతంత్రానికి ముందు ప్రచారం చేసిన కార్యక్రమాలలో- అస్పృశ్యుల దేవాలయ ప్రవేశం- ఒకటి. అంతకుముందే గురజాడ, బంకుపల్లి మల్లయ్యశాస్త్రి వంటి ఇంకా ఎందరో సంస్కరణ వాదులు మానవతా దృక్పధంతో అస్వృసేయ సమస్యపట్ల స్వందించారు. ఇంకా వెనక్కి వెళ్తే రామానుజుడూ, వీరశైవులూ ఈ అమానవీయ కట్టుబాట్లపై స్పందించారు. ఉద్యమాలు నడిపారు. గాంధి గారి -అస్పృశ్యుల దేవాలయ ప్రవేశం పుట్టుక, పరిణామం పరిశీలించగలవారికి దానిలో ఉండే రాజకీయాలు కూడా అందుతాయి.. 75 ఏళ్ల క్రితం దానిపై శ్రీపాద వేసిన ప్రశ్నలు- స్వతంత్రోద్యమం ఉరవడిలో, కాంగ్రెస్సు ప్రచారంలో- ఒక పక్కకు ఉండిపోయాయి. ఈనాడు మతం పేరుపెట్టుకున్న రాజకీయపక్షం పాలనలో ఉన్నాం మనం. నిజంగా వారికి మతం కావాలో, పాలనాధికారం కావాలో, అందులో దేనికోసం ఏదికావాలో తెలీని స్థితిలో ఆలోచనాపరులున్నారు. మతాన్ని ఒకలా వాడుకున్న గాంధి కాంగ్రెస్సు ఈనాడున్న కాంగ్రెస్సూ ఒకటేనా? ఆనాటి హిందూ మహాసభ ఈనాటి భాజపా ఒకటేనా? ఆనాడు ఒక నిజాయితీగల ఆలోచనాపరుడు వేసిన ప్రశ్నలు ఎలా మరుగున పడిపోయాయో ఈనాడూ వర్తమాన సంబంధిత ప్రశ్నలూ ప్రశ్నలూ మరుగున పడిపోతున్నాయా? ఈ ప్రశ్నలతో ఈవ్యాసం చదవండి.. నేడు వివేచన ఆవశ్యకతని గుర్తించండి. అందుకు ఈ ప్రశ్నలు – ఇలాంటి ప్రశ్నలు వెయ్యగల సత్తా కోసం- ఆలోచించండని కోరుతూ..Prabuddha Andhra_1939_08_దేవాలయప్రవేశం