ట్యాగులు

, , ,

నేనిప్పుడు శ్రీపాద పుస్తకం పనిలో పూర్తిగా మునిగిపోయివున్నాను. ఆరువేల పుటల పైగా  మేం సేకరించగలిగిన శ్రీపాద రచనలని ఇంత క్షుణ్ణంగా చదివే అవకాశం నా 68వ ఏట నైనా నాకు లభించింది. ఆయన ఆత్మకథ, కథలు, నవలలు తప్ప ఆయన వ్యాసాలు నేను చదవలేదు. సామాజిక విషయాలపై ఆయన అభిప్రాయాలతో నాకు కొంత అనంగీకారం ఉన్నా ఆయన హేతుబద్ధత, తార్కికత అన్నింటికీ మించిని నజాయితీ, నిర్భీకత అవగతం అవుతున్న కొద్దీ, నా ఆలోచనలకు పదును పెడుతున్నకొద్దీ నాకు కొన్ని ప్రశ్నలు కలుగుతున్నాయి. ఆయన సమకాలీన ప్రసిద్ధ రచయితలను స్వంతం చేసుకున్నట్టు – జాతి, ఆంధ్రజాతి, తెలుగు జాతి అంటూ వారిని ఏకం చెయ్యటానికీ, ఒక జాతి అన్న భావన కలిగించటానికీ జీవితాంతమూ యావచ్ఛక్తులూ వినియోగించిన శ్రీపాదను – ఎందుకు  స్వంతం చేసుకోలేదు? ఈనాటి సమాజంలో, సాహిత్యంలో తాను నమ్మినదానిని ఇంత నిజాయితీగా చెప్పేవారున్నారా? కథల మాటున, కవితల మాటున మనసులోని భావాలు చెప్పుకోటానికి కూడా సాటిజనమే కత్తులు పట్టుకు కళ్లెగరేస్తున్నపుడు ప్రజాస్వామిక చర్చకి అవకాశం ఈసమాజంలో లభిస్తుందా? మద్యపానంపై వారి ఈ వ్యాసాన్ని చదవండి. శ్రీపాద వస్తునిష్టకి ఇది ఒక మచ్చు .

నేనిలా శ్రీపాద రచనలు అందివ్వటం బోరుగా ఉందా?

.madyapanam- sripada