శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు నడిపిన ప్రబుద్ధాంధ్రలో 1939 ఫిబ్రవరి, జనవరి మాసాలలో వారు రాసి ప్రచురించిన రెండు వ్యాసాలు ఈటపాలో పెడుతున్నాను. ఇవి నైజాంలో నున్న ఆంధ్రుల గురించి సేకరించిన అనేక వివరాలతో రాసిన ఈ వ్యాసాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కథకునిగా మాత్రమే పేరున్న శ్రీపాద సమాచార సేకరణ, వివరణా, అభిప్రాయాలూ గమనించితే సామాజికవిషయాలపై ఆయన చూపిన శ్రద్ధ తెలుస్తుంది. ఆనాటి చరిత్రని వీరి వ్యాసాలు అనేక కోణాలలో చూపిస్తాయి. మా మనసు బృందం సిద్ధం చేస్తున్న శ్రీపాద లభ్యరచనల సర్వస్వం ఆయననే కాక స్వాతంత్ర్యోద్యంమాన్ని స్వంతదృష్టితో సూక్ష్మస్థాయిలో చూపిస్తుంది. తప్పక చదవవలసిన అనేకవ్యాసాలు ఇందులో సంపుటీకరించబడుతున్నాయి. నైజాం పై వ్యాసాలు ఈ లంకెలో చూడగలరు.1048 Prabudhandhra 1939 feb nijamu rashtramu 1049 Prabudhandhra 1939 march nijam rashtramlo