ఈరోజు టీవీలన్నింటా మంచి తిధులూ, శుభలగ్నాలూ.. జ్యోతిష్యాలూ.. లగ్నబలాలూ..!! పత్రికలే మాధ్యమంగా ఉన్న రోజులలో వారఫలాలు ప్రచురించటానికి కొంచె సంకోచించేవారు..!!  హేతువాద భావాలు మనదేశంలో చాలా మార్పులు తెస్తాయనీ, వ్యక్తుల అభివృద్ధి వారి ఆలోచనల అభివృద్ధిగా విద్యావంతులలో చాలామంది భావించిన రోజులవి. 1935 అంటే 80 సంవత్సరాల క్రితం రాసిన ఈ పంచాంగం చూస్తే మనజాతిలో వచ్చిన మార్పులు ఎన్నో గుర్తు వచ్చాయి. బౌద్ధికాభివృద్ధి కేవలం భౌతికాభివృద్ధికీ అది లభించటంకోసం పరుగుపందాలకీ అందులో విజయాలకు అన్ని విలువలనీ, ఆత్మనమ్మకాన్నీ కోల్పోటానికీ పరిమిత మయిపోయాం.. ఈ  సరదా పంచాగం సరదాగానే చదువుతూ ఈ 80 ఏళ్లలో మనం మానసికంగా చేరుకున్న దోవ గురించి క్షణంపాటు ఆలోచిద్దాం.. ANDHRA_VIDHYARDHI_1935_01_01vichitra panchangam