ట్యాగులు

ఈతరానికి ఇప్పుడు నేను అందిస్తున్న వ్యాసం ఎంతవరకూ ఆసక్తిగా ఉంటుందో తెలీదు. చనిపోతున్న అనేక కళలలో పద్య రచనను చేర్చటానికి వీలులేదు. పద్య రచన వేరు పద్య కవిత్వం వేరు. పద్య కవిత్వం చాలావరకూ కనుమరుగైనా, రచన భిన్న రూపాలలో కొనసాగుతూనే ఉంది. ఈనా అభిప్రాయం పైపై పరిశీలన వల్ల కలిగినదే. దీనికి అష్టావధానాలు, శతావధానాల రూపంలో ఇంకా జనాదరణ ఉంది. ఇది సంస్కృతికి మూలరూపంగా ఇంకా కొందరు గౌరవించటం, ధనం ఖర్చుపెట్టటం, కొందరైనా విస్మయంతో ఆనందపడటం ఉంది.

ఇదంతా పక్కన పెట్టి,

అనేక పూర్వపు కళలలో దీనిని ఒకదానినిగా నేను భావిస్తాను. ఇలాంటి వాటితో మన సమీప పూర్వీకుల సృజనశక్తి క్షీణదశకు చేరుకుందని అనేకమంది ఆధునికులు తేల్చేసారు. మన శిష్టుల సృజనశక్తి భారత ఇతిహాసాన్ని అనువాదించటంలో ప్రాంతీయతను మిళితం చెయ్యటంతోనే ఆరంభమయింది. ఇది తిక్కన నాటికి అభివృద్ధి చెందింది. శ్రీనాధుడు, పోతనల నాటికి స్వతంత్ర విస్తరణలు ఆరంభమయాయి. ప్రబంధయుగానికి పురాణాలలో, ఇతిహాసాలలోంచి మూలకథని తీసుకుని విస్తరించటం దాని పరిణామమే. ఆ తర్వాత కాలానికి పింగళితో మొదలైన స్వతంత్ర కల్పన కొనసాగింపుగా ఉండకపోటంతో అనేకులు దానిని క్షీణదశగా భావించారు. ఈ పరిణామక్రమంలో ఈ దశలో వచ్చినవి ద్వ్యర్ధి, త్ర్యర్థి కావ్యాలు. అలాగే చిత్ర, గర్భ కవిత్వాలు. ప్రాంతీయత మరింత హెచ్చింది.

ఇలా

సృజన శక్తి తీసుకున్న రూపాలలోని చిత్ర, గర్భ కవిత్వాలను నేను ఒక మరుగున పడుతున్న  కళగా గుర్తిస్తాను. ఈరోజు అందిస్తున్న వ్యాసం వాటిని గురించి ఈనాటి తరానికి ఉపయోగం ఉండదని తెలిసినా, భద్రపరచదగిన ఒక కళారూపంగా చూడవలసిందిగా, ఆనందించవలసిందిగా నా వినతి. ఇది ఆంధ్రభాషావిలాసిని పత్రికలో 1926 జనవరి సంచికలో వచ్చింది.

ANDHRA_BHASHA_VILASINI_1926_01_chitra kavitwamu