ట్యాగులు

,

ఆంధ్రజ్యోతి వివిధలో 25 మే సంచికలో  వచ్చిన ఈ వ్యాసంలో అనేక అంశాలు, సూచనలు ఉన్నాయి. నిర్మాణాత్మకదృష్టితో  రాసిన ఈ వ్యాసం మనవాళ్లలో కదలిక తీసుకువస్తే బాగుంటుంది. చాలాకాలంగా నాకు ఒక ఆలోచన ఉంది. మన విశ్వవిద్యాలయాలలో తెలుగులో పరిశోధనలన్నీ నెట్ లో ఉంచాలని.  నేను కలిసిన సందర్భాలలో విశ్వవిద్యాలయాల పెద్దలతో దీనిగురించి మాటలాడాను. కాని ఎవరూ పట్టించుకోలేదు. నేనే నావద్ద ఉన్న దాదాపు 150 పరిశోధనా పత్రాలను స్కాన్ చేయించాను. కథానిలయం వెబ్సైటులో పెట్టాలన్న  ప్రయత్నం చేస్తున్నాను. ఈ పరిశోధనలన్నీ జనం ధనంతో జరిగినవి. వీటి ఫలితాలు అందరికీ అందుబాటులో ఉండాలన్న ఆలోచన నాది. ఎలాంటి డిగ్రీ లేని నాబోటి వాడు వీటిని ప్రోఫెషనల్ గా అందించలేడని సంకోచం. వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్ గార్ల ఈ చక్కని, చిక్కని వ్యాసం చదివి ఎవరైనా ముందుకువస్తారన్న ఆశిస్తున్నాను. మనం ఎంత వెనకబడి ఉన్నామో, అయినా అంతర్జాతీయభాష వంటి ఎంత గొంతెమ్మ కోరికలు కోరుతున్నామో గదా!!! ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కుతుందా  velcheru