ట్యాగులు

రామాయణం గురించి నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలలో వివిధ జాతులూ, ప్రాంతాలే కాక మతాలు కూడా తమకి నచ్చిన విధంగా చెప్పుకోటం. తార్కికంగా ఆలోచిస్తే ప్రాశ్చాత్య ప్రపంచం అంతటికీ ఓల్డ్ టెస్ట్మెంటునే అక్కడి మతాలు తమ గతంగా చెప్పుకున్నాయి. ఇలాగే తూర్పు ప్రపంచంలో రామాయణం ఒక ఏకసూత్రంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాపోతే ఇక్కడి వాళ్లు రకరకాలుగా చెప్పుకున్నారు. కిళాంబి రాఘవాచార్యులు గారు 1936 డిసెంబరు సంచికలో రాసిన ఈ వ్యాసంలో జైనులూ, బౌద్ధులూ చెప్పుకున్న రామాయణాల గురించి చెప్పారు. నాదృష్టి సోషియలాజికల్ దృష్టి.  ప్రాంతాల మధ్య ఉన్న ఈ పోలికలను గమనించటం ద్వారా మానవ ప్రవృత్తి మీద అవగాహన పెరుగుతుందన్నదే నా ఆలోచన.  ఇలాంటి విషయాలు చాలామందికి తెలిసినవే కావచ్చు. అందుకే అనవసరంగా భావించి తాత్సారం చెసాను. గోండు రామాయణం గురించి వందలాది మంది చదవటంతో ఈ విషయం మీద ఆసక్తి ఉండవచ్చనిపించి ఈరోజు అందిస్తున్నాను.

ANDHRA_SAHITHYA_PARISHAT_PATRIKA_1936_12_01_ ramayana