ట్యాగులు

1930-31 సమదర్శని ఉగాది సంచికలో నేనిప్పుడు అందిస్తున్న వ్యాసం ప్రచురితం. ఈ వ్యాసం శ్రీనివాసరావు పేరుతో వచ్చింది. ఇందులో అభిప్రాయాలు -విశ్వ మానవ భావన- అని నేను అనుకుంటున్నదానికి చెందినది. ఆనాటి అభ్యుదయ ఆలోచనాపరులలో ఈ భావన కనిపిస్తుంది. ఇది ప్రముఖంగా ప్రభావితం చేసిన కవిగా శ్రీశ్రీ నాకు అనిపిస్తాడు. నా మటుకు నాకు నాలో దీనికి బీజం వేసినవారు శ్రీశ్రీయే. ఈ దృష్టితో ఈ వ్యాసంలో భావాలు పరిశీలించితే కాబోయే శ్రీశ్రీ నాకు కనిపించాడు. ఇది శ్రీశ్రీ దని ఊహించటానికి చిన్న ఆధారం కూడా ఉంది. ఇదే పత్రిక 29-30 ఉగాది సంచికలో కన్యాశుల్కములో స్త్రీ వ్యక్తులు అనే వ్యాసం శ్రీ శ్రీనివాసరావు పేరుతో వచ్చింది. అది మన గురజాడ పుస్తకంలో 1932లోనే సంకలితమయింది. కాకపోతే 30-31 సంచికలో సుప్తాస్థికలు పూర్తి పేరుతో వచ్చింది. కనక ఇది శ్రీశ్రీదా కాదా అన్నది ప్రశ్న. చర్చించండి.SAMADARSHINI_1930_01srinivasa