మనవాళ్ల మీద మనవాళ్లు వేసుకునే ఇగటాలలో – మనం తలైనా వదులుకుంటాం కాని తర్కం వదులుకోం- అన్నదొకటి. ఆ చతుర్లను పక్కనుంచినా నాకు పెద్దలు చెప్పినదేంటంటే తర్కంలో మనం చాలా సాధించాం అని. న్యాయం అంటే తర్కశాస్త్రం అని నిఘంటువు చెపుతుంది. తమాషా ఏంటంటే న్యాయం అంటే పిచ్చివాడు అని కూడా పర్యాయపద నిఘంటువు అంటుంది. మనం తర్కానికి ఉపయోగించే వాటిలో న్యాయాలు ఉన్నాయి. న్యాయచంద్రిక అనే గ్రంధానికి అనువాదంనుంచి కవిత అనే పత్రికలో లభించిన కొన్ని న్యాయాలు అందిస్తున్నానుKAVITHA_1911_04_01_Volume_No_2_Issue_No_11 KAVITHA_1911_05_01_Volume_No_1_Issue_No_12 KAVITHA_1911_06_01_Volume_No_2_Issue_No_1 KAVITHA_1912_02_01