ట్యాగులు

తెలుగు పత్రికలలో ఇప్పుడు కూడా స్త్రీలు పత్రికా సంపాదకత్వంలో వెనకబడే ఉన్నారు. ప్రధాన పత్రికలలో నాకు గుర్తున్నంతవరకు సంపాదకురాలు కనబడరు. కొన్ని ఆశయాలతో వచ్చిన పత్రికలలో స్త్రీల సంపాదకత్వం కనిపిస్తుంది. హిందూసుందరి పత్రిక పెట్టిన సత్తిరాజు సీతారామయ్యగారి ఈ సంపాదకీయవ్యాసంలో స్త్రీలను పత్రికా సంపాదకత్వం వహించజేయాలన్న తన ప్రయత్నం, అనుభవం గురించి రాసిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. HINDU SUNDARI 1903 DECEMBER