ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర తెలుగులో లభిస్తున్న ప్రవాస రచనలలో మొదటిది అనుకుంటున్నాను. జొన్నలగడ్డ సత్యనారాయణ గారి నా మహారాష్ట్ర యాత్ర 1936 భారతులలో వచ్చింది. అమెరికా సందర్శనం గురించి ఒకరు అదే కాలంలో రాసారని గుర్తు. త్రిపురనేని రామస్వామి గారు పారిస్ గురించి 1910 ప్రాంతాలలో కృష్ణాపత్రికలో రాసారని గుర్తు. ఇప్పుడు అందిస్తున్న రచన దత్తమండలంలో ప్రవాసానికి సంబంధించినది. 1912 డిసెంబరు ప్రభోధిని పత్రికలోనిది.SRI_PRABODHINI_1915_09_dattamandalam