ట్యాగులు

ఆత్రేయ సినిమా పాటలు అందరికీ తెలుసు. ఆయన నాటకాల ప్రసిధ్ది సాహిత్యజీవులలో చాలామందికి తెలుసు. ఈ పద్యాలను నార్ల చిరంజీవి గారు ఆత్రేయ డైరీల నుంచి ఈ పద్యాలను సేకరించి ప్రచురించానని స్రవంతి 1967 జూలై సంచిక లో తెలియజేసారు. ఈ పద్యాలలో గాలిబ్ గీతాల ఛాయలు కనుపిస్తున్నాయి. దాశరధి గారు అనువదించిన గాలిబ్ గీతాలు తొలి ప్రచురణ మార్చి 1961లో జరిగింది. వాటిని చదవి నేను ఇలాంటి పద్యాలను రాస్తూ ఉండేవాడిని. కాని ఛందోబద్ధ పద్యాలు(వృత్తాలు) రాసినపుడు కలిగే ఆనందం భిన్నంగా ఉండేది. వీటిలో భావం మనసుకి దగ్గరగా అనిపించేది. పురుషుని ప్రేమ – ఒక స్త్రీ పై పురుషుని ప్రత్యేక ఆసక్తి (సులువుగా చెప్పాలంటే)- తనకు మాత్రమే ఆమె పరిమితం కావాలన్న సాంప్రదాయక( నా అప్పటి అవగాహన ప్రకారం) భావనకి మించిందిగా అనిపించేది. అది భావకవిత్వ ప్రభావంలో ఉన్న నాకు దానికన్న భిన్నంగా, మిన్నగా అనిపించింది. పురుషుని  భావుక స్వేచ్చ భావకవిత్వంలో కనిపిస్తే (భావుకజీవి మానస విభావరిలో యొక వెల్గు రేఖ ఈ భావనలోని ప్రేమ .. అని రాసాను ఒకనాడు ఓ కావ్యంలో. దాని వెనకనే దానికి భగవంతునిపై భక్తికీ సంబంధం గురించి,అది మనిషికి ఇవ్వగల ఆత్మవిశ్వాసం, తెగింపూ గురించి తార్కిక యోచనా) గాలిబ్ లో స్త్రీకి కావలసిన స్వేచ్ఛపై గౌరవం కనిపించేది. భావకవిత్వంలో స్వేచ్ఛ కనిపించితే గాలిబ్ లో అంతకు మించిన తాత్వికత ఏదో కనిపించేది. 19వ శతాబ్ధపు  రొమాంటిక్ కవుల ప్రభావం భావకవుల మీద ఉండటం గురించి విన్నాను గాని, గాలిబ్ ప్రభావం గురించి వినలేదు. తెలిసిన వారు చెపితే తెలుసుకోవాలని ఉంది. ఇవన్నీ ఆరుద్ర గారి ఈ నవముక్తకాలు కంట పడినపుడు మనసులో కదిలేయి. ఆసక్తి గలవారి కోసం అందిస్తున్నాను.Sravanti_1965_07_00_Volume No_12_ATREYA