90 ఏళ్ల రామారావు గారికి షష్టిపూర్తి ఏంటని కొందరికైనా అనుమానం రావచ్చు. కథానిలయం పని అందులోనూ నేను చేస్తున్నది చాలా ప్రత్యేకమైనది. పత్రికలలో కథలు డేటాబేస్ లో చేర్చటం ఒక ఎత్తు. దానిలో రిపిటీషన్ లు లేకుండా చేయటం చాలా సమస్య. పదేళ్లుగా పట్టుదలగా పిచ్చివాడిలా పనిచేస్తున్నాను. ఇలా చెప్పుకోటం నామటుక్కు నాకు నా మనస్తత్వానికి వ్యక్తిత్వానికి నేను ఏర్పరచుకున్న నియమాలకు పూర్తిగా వ్యతిరేకం.

కాని-

ఒక్కోమారు ఈ చుట్టూ ప్రపంచపు తీరు గమనిస్తుంటే నాకేంటి అనుకోని మనుషులు పిచ్చివాళ్లు అనే అనిపిస్తుంది.

అలాంటి కొందరు ఈ లోకంలో ఉండటం చాలా సహజం. అది సృష్టిలోనే ఉంది.  అలాంటి వాళ్ల ఆలోచనలు  తమ చుట్టూ కాకుండా తాము నివసిస్తున్నసమూహం లేదా గుంపు లేదా సమాజం లేదా ప్రపంచం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. వాళ్లు సాధారణంగా గుంపుగా ఉంటారు. వాళ్లని గుంపుగా ఉంచేవి అనేకం. ఆ అనేక కారణాలలో పరస్పర వ్యతిరేకమైనవీ ఉంటాయి. ఉదాహరణకి మతవాదులు కమ్యూనిస్టులూ  ఒకరినోకరు చంపుకొనేటంత తీవ్రమైన వ్యతిరిక్తులు. వీరు ప్రపంచాన్ని ముందుకో వెనక్కో నెట్టాలని చూస్తారు. ఏమైనా అందరూ గుంపులుగానే ఉంటారు.  రచయితలు అనేవాళ్లు ఒక గుణం అంటే రాయటం అన్నదాని వల్ల గుంపుగా కనిపిస్తారు గాని పని వల్గ గాని, ఆలోచన వల్ల గాని గుంపు కాలేరు. ఒక భావజాలంకి చెందిన వారు ఒక సంఘంగా పని చేయటం ఆధునిక కాలంలో కనిపిస్తుంది. అది ఒక అవసరం వల్ల ఏర్పడిన గుంపు అనటం కన్న ఒక భావ ఏకత వల్ల ఏర్పడిందనటం తర్కబద్దం. అలా నేను రచయితలు గుంపుకి చెందిన వాడిననుకోవచ్చు. అలా ఒక భావఏకత వల్ల కొంతమందితో సాన్నిహిత్యాన్ని ఆశించవచ్చు. అది లభించవచ్చు. కాని ఈ రచయితలు ఏకఫలాపేక్షగల యాచకులుగా కూడా కనిపిస్తారు. అలాగే వారు ప్రతి స్థిరమైన భావననీ ఎంతోకొంత సందేహించటం కూడా జరుగుతుంది. అది ఆలోచనాపరుల సహజ లక్షణం. రచయితలు కావటంలో కళావసరం ఎంత ఉందో అంతే సామాజిక సంవేదనలు పంచుకునే అవసరం ఉంది. ఇలాంటి రచయితలలో ఎంతో కొంత అనేకత ఉంది. ఒంటరిదనం ఉంది.

ఈ దృష్ట్యా

స్వభావరీత్యా, నేనెంచుకున్న పని రీత్యా బాగా అలసటలో నన్ను చూసి నాకే వెర్రివాడిననిపిస్తుంది. అలాంటి స్థితిలో 1984 డిసెంబరు జ్యోతి పత్రిక కంటబడింది. చాలాకాలమయింది చూసి. అందులో నేను మాస్టారి షష్టిపూర్తి సందర్బంగా సరదాగా రాసిన ఈ పేరడీలు కనిపించాయి.

ఈ లంకెలో చూడండి.vivina parady on kara