27-8-2013
గిడుగు వారి 150 జయంతిని పురస్కరించుకుని ఈ నా సప్తాహ కార్యక్రమంలో ఆఖరు వ్యాసం గిడుగు రామ్మూర్తి పంతులుగారు ఆరంభించిన తెలుగు పత్రిక తొలి సంపాదకీయం. మొట్టమొదటి సంచిక సంపాదకీయాలలో పత్రికలు తమ లక్ష్యాలు చెప్పటం, ప్రజల సహాయ సహకారాలు అర్ధించటం ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగు జాతి ఏ పత్రిక పట్లా పక్షపాతం చూపించలేదు. చాలావాటిని మొగ్గలోనే చిదిమేసింది. పత్రికలు పెట్టిన వారి ధనబలం, సంకల్పబలం, ఔదార్యాలతో కొన్ని కొంత ఎక్కువకాలం బ్రతికాయి. సామల రమేష్ బాబు గారి లెక్క ప్రకారం ఇప్పుడు 18 కోట్ల తెలుగు వారున్నారుట. ఇంత జనసంఖ్య వివిధ రాష్ట్రాలలో ఉన్నారుట. బెంగాలీ బాబు ఎక్కడున్నా అమృతబజార్ పత్రిక చదువుతాడనీ, మద్రాసీ హిందూ, మళయాళీలు మనోరమ చదువుతాడనీ అంటుంటారు. అలా కనీసం ఒక పత్రిక ఒక జాతి సంస్కృతిలో భాగమవటం జరిగింది కాని  ఇంత పెద్ద తెలుగు జాతి అలా దేనినీ నిలబెట్టుకోలేదు. వాడుక భాష వ్యాప్తికోసం పుట్టిన ఈ పత్రిక ఓ ఏడాది బ్రతికినట్లుంది. గ్రాంధిక భాషా స్థిరత్వం కోసం పుట్టిన ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక పిఠాపురం రాజావారి చలవ వల్ల దాదాపు 60 ఏళ్లు బ్రతికింది. ఈ ఆసక్తికరమైన అంశం ఆలోచనీయం కదా! ఈ చిన్ని కార్యక్రమాన్ని పూర్తిచేసేలా ప్రోత్సహించిన ఆప్తులు రజనీకాంత్ గారికి కృతజ్ఞతలు.
గిడుగు వారి ఈ వ్యాసం తెలుగులో ఉన్నది ఈ లంకెలో చూడండి.
gidugu editorial