ట్యాగులు

, ,

21-08-2013

మార్చివరకూ శ్రీకాకుళంలో ఉన్నాను. ఆ సమయంలోనే ఛాయారాజ్ గారి ఆరోగ్యం గురించి తెలిసింది. వెంటనే వెళ్లి చూదామనుకున్నాను. కాని ఇక్కడ స్వయంగా తిరిగే .. ఏ పదం వాడాలి.. అదేదో అలవాటు చేసుకోలేదు. మిత్రుల మీద ఆధారపడటం. దానితో అవలేదు. వచ్చాక దాసరి రామన్న సహకారంతో వెళ్లి చూడగలిగాను. అప్పుడు నాకు కలిగిన ఆలోచనలు రాసుకోవాలని .. ప్రయత్నం. ఎన్ని రాయగలనో ఎన్ని దాచేస్తానో.. ఎందుకు రాసుకోటం అంటే వంద కారణాలు హాయిగా చెప్పగలం.. ఎందుకు దాచటం అంటే ఏం చెప్పినా ఏదో కొంత ఆసత్యమో, అసత్య భ్రమో తప్పదు గదా.. డైరీల్లోనూ, కారా మాస్టారికి 85 నుంచి రాసిన లేఖల్లోనూ నా ప్రేమ, కోపం, ఆలోచన, ఆవేశం, అసహనం నా ఇష్టం వచ్చినట్లు కక్కేవాడిని. సమాజం గురించి, దానలో నావంతు- నా శక్తికి అనువైనదనిపించిన- సాహిత్యం గురించి, గతం గురించిన విశ్లేషణ, వర్తమాన విషయాలు, భవిష్యత్తు నమూనా ఏవేవో.. ఇప్పుడూ డైరీలను ఆశ్రయించవచ్చు. బ్లాగులు డైరీలలా ఉపయోగపడతాయా.. పడవు. సాధ్యం కాదు. అవి కూడా లోకం కోసమే. బహుశా ఒక చిన్ని లోకం అవొచ్చు. సంపాదకుడు అనే ద్వారం మాత్రం ఉండదు. కాని వివేచన, స్వయం నియంత్రణ అనేవి ఉండనే ఉంటాయి.

పోతే- ఛాయారాజ్ గారిని చూసి వచ్చాక, నాకు కలిగిన ఆలోచనలు అనేకం. 68-69ల నుంచి నా జీవితంలో ప్రధాన భాగమైన కమ్యూనిజం, 70ల నుంచి మొదలైన కమ్యూనిస్టులనబడే వ్యక్తుల పరిచయాలు, ప్రపంచ కమ్యూనిజంకీ, జాతీయ పరిస్థితులకీ మధ్య నలిగిన భారతీయ కమ్యూనిజం, తెలుగు ఆలోచనా సమాజంలో సాహిత్యంపై గల భావాలు, వాటిలో కొంతకాలం  ప్రధాన స్రవంతిగా ఉన్న కమ్యూనిస్టు ప్రభావిత సాహిత్యం, దానిలోని ఎగుడు దిగుడులు, ఒక insider నీ కాని outsider నీ కాని నా ఆవేదన, ఆలోచనలు, అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఒక క్రమంలో ఉంచాలి. చాలా శ్రద్ధగా మిత్రుని స్వరంతో చెప్పాలి. ఛాయారాజ్ గారిని చూసి వచ్చాక నాలో కలిగిన జీవనోత్సాహానికి  కార్యరూపం ఇవ్వాలి.

అప్పటి వరకూ ఈ ఆలోచనలు, ఉద్వేగం, నేనూ బ్రతికి ఉంటే ఇవి ఆలోచనాపరులు, సమాజ హితాన్ని ఆశించేవారు తెలుసుకోవలసినవే గనక తప్పక రాస్తాను.

అందాకా- ద్వితీయ విఘ్నం కూడదని గిడుగు వారి పై భమిడిపాటి కామేశ్వరరావు గారి నివాళి నా బ్లాగు మిత్రులకు ఈ లంకెలో అందిస్తున్నాను.

gidugu bhamidipati