ట్యాగులు

, , , , , , ,

20-07-13
ఒకనాడు మనకి పత్రికలే మాధ్యమం. ఆ తరవాత శ్రవ్యమాధ్యమం వచ్చింది. రేడియో.. ప్రభుత్వమే నడిపేది. సిలోన్ రేడియో తప్ప ప్రకటనలు ఉండేవి కావు. క్రమంగా వాణిజ్య విభాగం.. తర్వాత ప్రైవేటు రేడియోలు వచ్చాయి. దృశ్యమాధ్యమం టివి.. వచ్చింది. అది కొంతకాలానికి ప్రైవేటు టివిగా పరిణమించింది. జనంకి ఏం చెప్పాలన్న దానిమీద ప్రభుత్వానికి ఏదోఒక విధానం రేడియో.. టివిలలో కనిపించేది. ఆ విధానం ఆధారంగా ప్రభుత్వమూ, ఆ సమయానికి దానిని అజమాయిషీ చేస్తున్న పార్టీలు శ్రవ్య. దృశ్య మాధ్యమాల మీద పెత్తనం పొంది వాటిని దుర్వినియోగం చేస్తున్నట్లు విమర్శలు వచ్చేవి. ఆలిందిరా రేడియో వంటి వేళాకోళాలు నడిచేవి. కొన్ని పత్రికలు వారఫలాలు వెయ్యటం తప్పుగా భావించిన రోజులు ఉండేవి. కొన్ని రకాల ప్రకటనలు వెయ్యరాదనే స్వయం నిషిధ్ధం పాటించేవి. manufacturing consent అనే పుస్తకంలో ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి సమ్మతిగా మార్చటానికి మీడియా ఎలా వాడుతున్నారో Noam Chomsky చెపుతారు.
పోతే-
మనదేశంలో ప్రైవేటు దృశ్య మాధ్యమం భావప్రకటనా స్వేచ్ఛకి సంకేతంగా ఒక అభిప్రాయం సమ్మతి పొందింది. దీని వాణిజ్యాసక్తిపై అది హృదయహీనంగా మారటం పై రాతి తయారి (మునిసుందరం పిళ్లై) వంటి కథ, ఇటీవలి పీప్లీలైవ్ వంటి సినిమాలు వచ్చాయి. భావప్రసార మాధ్యమాలు రాజకీయ ఘటనలను చెపుతాయి. వాటిపై వ్యాఖ్యల ద్వారా చదువరుల, శ్రోతల, ప్రేక్షకులను ఆలోచింపజేయటం అన్న కర్తవ్యం నెరవేరుస్తాయి. ప్రజా భావ స్వామ్యానికి ఎన్ని పరిమితులు ఉన్నా ఇవి తప్ప మరోమార్గం లేదని నేను నమ్ముతున్నాను. ప్రజల హేతుబుద్ధికి, వారిని ఆలోచింపజేయటానికి పత్రికలు ప్రయత్నించేవి. వాటిని కాదనేవారి స్వరానికి మాధ్యమంలో చోటు ఉన్నప్పటికీ అది చర్చా స్వభావానికి దోహదం చేసేది.
ఈనాడు-
మనకి అనేక చానల్స్ ఉన్నాయి. పత్రికలు ఉన్నాయి. రాజకీయాలు పక్కన ఉంచి హేతుబుద్దిని ప్రజలలో వ్యాపింపజేయటానికి ఇవి ఏమైనా పని చేస్తున్నాయా? ఎన్ని మత ప్రచారం చేసే చానల్స్ ఉన్నాయో లెక్కవేయండి. ముఖ్య పత్రికలలో ఎన్ని పుటలు మత విషయాలకు కేటాయించబడుతున్నాయో అంచనాలు వేయండి. వార్తలు అందించే చానల్స్ లో ఎంత సమయం ఈ అంశానికి ఉందో గమనించండి. హేతుబుద్ధి ఆవశ్యకత లేదని మెజార్టీ భావించితే అదైనా బయటపడాలి. ఇక్కడ నేనిస్తున్న లంకెలో వ్యాసం చూడండి. పంచాంగం చెపుతున్న ధోరణిలో ఆనాటి స్థితిపట్ల ఒక వ్యంగ్యం ఇందులో ఉంది. దీని వెనకన హేతుబుద్ధి వ్యాప్తి అన్న లక్షణం నాకు కనిపిస్తుంది. ప్రజాజీవితంలో మంచి రాజకీయాలకు స్థానం కలగాలంటే రాజకీయ భావాల ప్రాపగండాతో బాటు ఈ లక్షణాన్ని మన మాధ్యమం స్వీకరించాలని నా ఆశ.
ఈ రచన 1931 మార్చి 28 కృష్ణాపత్రికలో వచ్చింది. ఇటువంటి మరికొన్ని వ్యాసాలు నేను సేకరించాను. వాటిని బ్లాగ్ సందర్సకుల ఆసక్తిని బట్టి వరసగా ఇక్కడ అందిస్తాను.
ఈ లంకెను చూడగలరు.
panchngam-prajothpathi