12-07-13
బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారి విగ్రహావిష్కరణ వార్తతోబాటు పత్రికలలో కె. ముత్యంగారి వ్యాసం వచ్చింది. అది చదివి ఆరోజుకి ఆరోజు బెంగళూరునుంచి బయలుదేరి నరసన్నపేట (శ్రీకాకుళం వద్ద) చేరాను. ఇది ఆరేడేళ్ల క్రితం మాట. పర్లాకిమిడి గిడుగు వారు, ఉర్లాం మల్లయ్య శాస్త్రి, మేరంగి సాంఖ్యాయనశర్మ, విజయనగరం గురజాడ వీరంతా సమకాలికులు. వారు తమతమ పరిధులలో ఆధునిక భావాలతో ప్రభావితమై వాటి వ్యాప్తికి ప్రయత్నించారు. గిడుగు భాష, సాంఖ్యాయనశర్మ సైన్సు ప్రచారం, గురజాడ కన్యాశుల్కం, బాల్యవివాహాలు, తెలిసినంతగా మల్లయ్య శాస్త్రి గారి హరిజన( ఒకనాటి ఆ పదం ఈనాటికి తగినది కాదు) ఉద్యమం తెలియదనుకుంటున్నాను. చాలా ప్రధానంగా, రహస్యంగా భావించే గాయత్రి మంత్రం రామానుజాచార్యులు అందరికీ తెలియటం కోసం ధ్వజస్తంభమో ఏదో ఎక్కి అందరికీ వెల్లడించినట్టు విన్నాను. అది ఎంతవరకూ వర్ణ, కుల వ్యవస్థలలో మార్పులు తేగలిగిందీ అన్నది ఒకరకం ఆలోచన. తేలేకపోతే ఎందుకు సమూలమైన మార్పులు తేలేకపోయాయి- ఇది అటువంటి ప్రశ్నకి కొనసాగింపు. ఐతే, భారతీయ సమాజంలో దుష్ట సంప్రదాయాల గుర్తింపు, దానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాల –స్పిరిట్- ను పరిశీలించటం మరో ప్రయత్నం. ఆ స్పిరిట్ ఆంగ్లేయుల ఆంగ్ల విద్య ద్వారా మరోమారు ప్రజ్వరిల్లింది. హరిజనులకి గాయత్రి ఉపదేశించి జంధ్యం వేయించిన వారు మల్లయ్యశాస్త్రి గారు. వారి గురించి నేను తెలిసుకొన్న ఈ విషయానికి సంబంధించిన వార్త జమీన్ రైతు పత్రికలో చూసినపుడు ఇది అందరికీ పంచుకోవాలనిపంచింది. దానిని ఈ లంకెలో చూడగలరు. harizan