1997 జనవరిలో megatrends 2000 అన్న పుస్తకం చదివాను. రెండు దశాబ్దాల క్రితం వెలువడిన ఈ పుస్తకంలో కంప్యూటర్ నేర్వటం గురించి ఓ మాట అన్నట్టు గుర్తు. 85% వారంతటవారే నేరుస్తారట. అలా నేర్చిన వాళ్లలో నేనొకడిని. అప్పటినుంచి ఎంతోకొంత పరిచయమున్నా ఇంటర్నెట్ పాఠకుల(?) సాహిత్య సంవేదన హాబీ కిందకు వస్తుందన్న ఆలోచన నన్ను వెనక్కు లాగింది. ప్రస్తుత సాహిత్య వాతావరణం పట్ల ఆలోచనలు పంచుకునే స్నేహం కూడా ఎండిపోతోంది. వయసు కారణం కావచ్చు. సినిసిజమ్ కావచ్చు. ఒంటరితనంలోకి నేను జారిపోయినా నష్టం లేదు. కాని నాకున్నదనుకుంటున్న సామాజిక బాధ్యత ఏదో ఎప్పుడూ పొడుస్తూంది. అలాంటి ఓ గట్టి కుదుపులో ఓ చిట్టి ప్రయత్నంగా ఈ బ్లాగు మొదలించాను.

స్వయంగా నేరుస్తుండటం వల్ల కొంతకాలం కొన్ని అవకతవకలు తప్పవు గదా!

కాస్త ఓపిక సహ ఆలోచనాపరులనుంచి కోరుకుంటున్నాను.

ఆలోంచించవలసిన వాటికే ఈ బ్లాగు కేంద్రం కావాలన్న ఆశతో

వివిన